అమరావతి : పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, ఇప్పుడు ఆక్వా హాలిడే.. ఇక జగన్‌రెడ్డి హాలిడే తీసుకోవడం మాత్రమే మిగిలివుం దని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆక్వా రంగాన్ని ఉద్ధరిస్తానని నమ్మించి జగన్‌రెడ్డి ఆక్వారైతులను దగా చేసారని దుయ్యబట్టారు. వైసిపి ప్రభుత్వ అసమర్ధతతో ఆక్వా రంగం సంక్షోభంలోపడిరది. పెరిగిన విద్యుత్‌ఛార్జీలు, దాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులతో ఆక్వా రైతులు కుదేలయ్యారు. వంద కౌంట్ కిలో రొయ్య ఉత్పత్తి కి రూ.270 ఖర్చవుతుంటే కనీసం రూ.200కూడా రాక రైతులు ఆక్వా హాలిడే ప్రకటిస్తున్నారు. కొత్త చట్టాల పేరుతో ఆక్వా రైతులను, ప్రాసెసింగ్ ప్లాంట్స్ నిర్వహి స్తున్న వారిని వేధిస్తూ వైసిపి నేతలు కోట్లు దండుకుం టున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఆక్వా రైతులను ఆదుకోవాలి. జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికి యూనిట్ విద్యుత్‌ని రూ.1.50కే అందించాలి. దాణా, ఇతర సామాగ్రిని రాయితీకి ఇవ్వాలి. మద్దతు ధర ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు.