మంగళగిరి: సొంత అక్కాచెల్లెళ్లు లేని నాకు ఆడపడుచులంతా సొంత సోదరీమణులేనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాఖీ పండగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అన్నలా అండగా.. తమ్ముడిలా తోడుగా ఉంటాను. మీరు చూపించే అనురాగమే నాకు రక్ష. రాఖీ పండగ ముందు రోజే మంగళగిరిలో నా సోదరీమణులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు స్త్రీశక్తి పేరుతో శిక్షణ ఇప్పించి, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేయడం చాలా సంతోషంగా ఉందని లోకేష్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. అంతకు మందుకు టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత లోకేష్‌కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.