- అన్నాక్యాంటీన్, జలధారను అడ్డుకున్న దుర్మార్గులు
- జనం ఇంటిముందు చెత్తపోస్తున్న సైకో ప్రభుత్వం
- మద్యనిషేధమంటే జె-బ్రాండ్ల మద్యాన్ని అమ్మడమా?
- బాదుడే బాదుడులో లోకేష్.. విద్యుత్ నిలిపివేత
అమరావతి: రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని తమ బినామీలకు అప్పగించి ఫ్రీగా దొరికే ఇసుకను ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి బంగారంలా మార్చారు, మన ఇసుక బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై తరలించి వందల కోట్లు దోచుకుంటున్నారు, దోచుకున్న సొమ్మంతా నేరు గా తాడేపల్లి ప్యాలస్ కే చేరుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్య బట్టారు. అక్రమ సంపాదనకోసం జగన్‌రెడ్డి లక్షలాది మంది కార్మికుల బతుకులను ఛిద్రం చేశారని మండి పడ్డారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. స్దానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ పర్యటిస్తుండగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. చీకటిలోనే యువనేత గ్రామాల్లో పర్యటించా రు. దుగ్గిరాల వైసిపి నేత, దుగ్గిరాల మాజీ ఎంపిపి, మాజీ పిఏసిఎస్ ఛైర్మెన్ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ నివాసానికి వెళ్లి లోకేష్ పరామర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి లూధరన్ చర్చిలో యువనేత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బాదుడే బాదుడు కరపత్రం పంచుతూ వైసిపి పాలన లో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి వివరించారు. ఇంటిపన్ను, చెత్తపన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనే క ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లోకేష్ దృష్టికి తెచ్చారు. చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గ్రామంలో ఉచితంగా తాగునీరు అందిచడానికి జలధార కార్యక్రమం ప్రారంభించాలని అనుకుంటే అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉచితంగా త్రాగునీరు అందించే జలధార కార్యక్ర మం ప్రారంభించి తీరుతామని అన్నారు. ప్రజల దాహార్తి తీర్చే కార్యక్రమాలను ప్రభుత్వం చెయ్యదు.. మమ్మ ల్ని చెయ్యనివ్వదని తెలిపారు. ఆపన్నుల ఆకలితీర్చేందుకు మేము అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే ఇలాగే అడ్డుకున్నారని అన్నారు.
10రూపాయలిచ్చి వంద లాక్కుంటున్నారు
కుడిచేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్న గజ దొంగ జగన్ అని లోకేష్ మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో సంక్షేమం గోరంత.. బాదుడే బాదుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత..అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారు. పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలని అన్నారు. మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్ ఇప్పుడు రాష్ట్రంలో తమ సొంత జె-బ్రాండ్స్ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రజలు పడుతున్న బాధలు తలుచుకుంటేనే బాధేస్తుంది. ప్రతి ఏడాది సిఎం రివ్యూల్లో రోడ్లను బాగు చెయ్యాలనే ఉత్తర్వులు ఇవ్వడం తప్ప ఒక్క చోట కూడా కొత్తగా రోడ్డు వెయ్య డం లేదు. అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ కార్య క్రమాలు కట్ చేస్తున్నారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు కట్ చేస్తున్నారు. ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తు న్నారు. చెత్త పన్ను కట్టకపోతే విచక్షణలేకుండా ప్రజల ఇంటి ముందు చెత్త పోసే సైకో ప్రభుత్వం ఇది అని లోకేష్ మండిపడ్డారు.