గుంటూరు(చైతన్యరథం): శ్రీ భ్రమర టౌన్‌షిప్ అధినేత గళ్లా రామచంద్రరావుపై ఉద్దేశపూర్వకంగానే కమ్మా వెంకట్రావు అనే వ్యక్తి అసత్య ఆరోపణలు చేసినట్లు స్థల యజ మాని చల్లా రమేష్ వివరణ ఇచ్చారు. పిడుగురాళ్లకు చెందిన కమ్మా వెంకట్రావు(ఫిర్యాది) వడ్డీ వ్యాపారి. అతని వద్ద చల్లా రమేష్(స్థల యజమాని) కొంత నగదును వడ్డీకి తీసుకుని హామీగా పొలాన్ని తాకట్టు పెట్టాడు. అలా నాలుగెకరాలు, మూడెకరాలు తాకట్టు పెట్టాడు. అయితే అప్పు తీర్చడం కోసం మొదటి నాలుగు ఎకరాలు భ్రమర వారికి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం రోడ్లు బద్దలు కొట్టించి బెదిరించి ఒప్పందం కంటే రెట్టింపు డబ్బులు డిమాండ్ చేయడంతో కష్టమర్లకు న్యాయం చేయటం కోసం నష్టాన్ని భరిస్తూ కంపెనీ వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
అలాగే తాను మిగిలిన అప్పుకు వెంకట్రావుకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వస్తున్నానని, 2023లో తన మిగిలిన స్థలాన్ని శ్రీ భ్రమర టౌన్ షిప్‌కు అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకోగా రూ.10 వడ్డీ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని బెదిరించారని తెలిపాడు. దీనిపై అప్పట్లోనే పిడుగురాళ్ల పోలీసుస్టేషన్, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చల్లా రమేష్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరలా గళ్లా రామచంద్రరావు సతీమణి గళ్లా మాధవి ఎమ్మెల్యే కావడంతో అసత్య ఆరోపణలు చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని దంపతులను బెదిరించే ఉద్దేశంతో కొంతమంది అండతో మూడెకరాలకు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని తెలిపారు. అతనికి మొదటి నుంచి ప్రభుత్వ ఆఫీసులలో పిటిషన్లు పెట్టించడం, బ్లాక్‌మెయిల్ చేయడం అలవాటేనని, ఈ విషయం అందరికీ బాగా తెలుసునన్నారు. ఈ స్థల వివాదం తనకు, కమ్మా వెంకట్రావు మధ్యేనని, గళ్లా రామచంద్రరావు పాత్ర ఎక్కడా లేదని వివరణ ఇచ్చారు.