- ప్రజల ఆశలు, ఆకాంక్షలే దిక్సూచి
- విస్తృతంగా చర్చించిన ఎన్డీఏ నేతలు
- రెండు గంటలపాటు కీలక భేటీ
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల సమరాం గణంలో క్షేత్రస్థాయి నుంచీ అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపై ఎన్డీయే కీలక నేతలు బుధ వారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి నివాసంలో రెండు గంటలపాటు సుదీర్ఘ భేటీ సాగింది. సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయు డు, జనసేన ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, మధుకర్, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి అరుణ్ సింగ్, సహ ఇన్‌ఛార్జి సిద్దార్థ సింగ్ హాజరయ్యారు. కూటమి ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో నెల కొన్న ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా భాగ స్వామ్య పార్టీలు నడుచుకోవాలని అచ్చెన్నాయుడు సమావేశంలో అన్నట్లు తెలిసింది. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైన నేపథ్యంలో.. ప్రజల మనసులు గెలుచుకోవటానికి ప్రస్తుత పరిస్థితుల్లో వారి ఆలోచనలను అర్థం చేసుకోవా ల్సిన అవసరం వుందని ప్రస్తావించినట్టు సమాచా రం.
అదేవిధంగా అగ్రనేతల ఐక్యతా స్ఫూర్తిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి.. ఓట్ల బదిలీ సక్రమంగా, సంతృప్తికరంగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలపై నా నేతలు చర్చించారు. అందరి నాయకత్వంలో సమష్టిగా ముందుకెళ్లాలని నాదెండ్ల మనోహర్ ప్రతిపాదిస్తే, నాయకత్వం కలిసినపుడు కార్యకర్తలు కలవాలని, పొత్తులో భాగంగా కార్యకర్తలతో కలిసి పనిచేసే విధానాన్ని రూపొందించుకోవాలని పురంధ్రీశ్వరి వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఏప్రిల్ 4న లోక్‌సభ స్థానాల్లో ఉమ్మడి భేటీ, ఏప్రిల్ 8న అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి భేటీ నిర్వహించేం దుకూ నేతలు నిర్ణయించారు. ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్తో పైనా చర్చించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అగ్రనేతల పర్యటనపైనా ఎన్డీయే కూటమి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉధృతమైన ఎన్నికల ప్రచారానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా కీలక భేటీలో చర్చించారని సమాచారం.