అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర అభి వృద్ధి కోసమే టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు పార్టీల పొత్తు నిర్ణయం అనంతరం ఆయన ఎక్స్‌వేదికగా స్పందించారు. ఉమ్మడి ఏపీ విభజనతో ఒక దశాబ్దంపాటు సామాజిక, ఆర్థిక రాజ కీయ గందరగోళం ఏర్పడిరది. ఐదేళ్లుగా వైసీపీ అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకుంది. బెదిరింపులు, దాడులు, దౌర్జ న్యాలు సాధారణ మైపోయాయి. వ్యవస్థల ను దుర్వినియోగం చేస్తున్నారు. 30 వేలకు పైగా మహిళలు తప్పిపోయారు. దళితుల పై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. ప్రతిపక్ష ఓటు చీలితే సీఎం జగన్‌కు లాభం జరుగుతుంది. ఓటు చీల కూడదనే.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.రాష్ట్ర అభివృద్ధికోసం రాను న్న రోజుల్లో మూడుపార్టీలు కలిసి పనిచేస్తా యి. ఎన్డీయేలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవా దాలు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ధన్యవాదాలని పవన్ పేర్కొన్నారు.