- డిసెంబరు నాటికి వివిధ పనులకు టెండర్లు
- సీఎం అధ్యక్షతన 38వ సీఆర్డీఏ సమావేశం
- వివరాలు వెల్లడిరచిన మంతి నారాయణ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు మినహా మిగిలిన అన్ని పనులకు టెండర్లను డిసెంబరు మాసాంతానికల్లా పిలవనున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ వెల్లడిరచారు. ఈ పనులన్నీ ఏడాది నుండి రెండున్నరేళ్లలోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 38వ సీఆర్డిఏ సమావేశం బుధవారం సచివాలయంలో జరిగిందన్నారు. సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడిరచారు. 2014-19 మధ్యకాలంలో అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 3,600 అపార్టుమెంట్లు కట్టినట్టు గుర్తు చేశారు. వాటిలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు ఐ.ఏ.ఎస్. అధికారులు నివాసానికి సంబంధించి 432 ప్లాట్లతో కూడిన 18 టవర్ల నిర్మాణాలను గతంలో చేపట్టి దాదాపు పూర్తి చేశామన్నారు.
అయితే సివరేజ్ ప్లాంట్, త్రాగునీటి సరఫరా, క్లబ్ హౌస్ నిర్మాణ పనులు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిని రూ.524 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు బుధవారంనాటి సమావేశంలో క్లియరెన్సు వచ్చిందని, రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించిన టెండర్లను పిలిచి 20 రోజుల్లో పనులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సీఆర్డిఏ కార్యాలయం కోసం గతంలో తమ ప్రభుత్వం జి7 భవన నిర్మాణాన్ని చేపట్టి స్ట్రక్చర్ పూర్తి చేశామని, అయితే గత ప్రభుత్వం దాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. రూ.160 కోట్లతో దాన్ని పూర్తి చేసేందుకు సమావేశంలో ఆమోదించామని, గతంలోనే ఈ పనులకు సంబంధించిన టెండర్లు ఖరారైన నేపథ్యంలో వీటి పనులను నాలుగైదు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. సీఆర్‌డీఏ, ఏడీసీ, మెప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, మున్సిపల్ ఆఫీసు తదితర కార్యాలయాలన్నీ ఈ భవనంలో ఏర్పాటు చేస్తామన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దాదాపు 360 కి.మి. మేర ట్రంక్ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
అయితే వాటి కాలపరిధి పూర్తైన నేపథ్యంలో డిసెంబరు మాసాంతానికల్లా తిరిగి టెండర్లను పిలుస్తామన్నారు. రాజధాని ప్రాంతం ఎటువంటి వరదలకు, ముంపునకు గురయ్యే అవకాశం లేకుండా ఉండేందుకు.. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ డిజైన్లను రూపొందించే పనిని నెథర్లాండ్ నిపుణులకు అప్పగించామన్నారు. అయితే ఈమధ్య కాలంలో బుడమేరు వల్ల విజయవాడ నగరానికి సంభవించిన ముంపును దృష్టిలో ఉంచుకుని మరింత పటిష్టవంతంగా డిజైన్లు రూపొందించాలని ఆర్‌వి కన్సెల్టెన్సీకి అప్పగించడం జరిగిందని, ఆ డిజైన్ పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని, వాటికి సంబంధించిన టెండర్లను నవంబరు మాసాంతానికిల్లా పిలుస్తామన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్లకు సంబంధించిన టెండర్లను కూడా డిసెంబరు చివరికల్లా పిలుస్తామన్నారు. 2009లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని కరకట్ట రోడ్డు డిజైన్ చేయడం జరిగిందని, అయితే బుడమేరు వరద దృష్ట్యా రీ డిజైన్ చేసేందుకు కన్సల్టెన్సీకి అప్పగించామని, ఆ పనులనకు సంబంధించి 15 రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు. జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించేందుకు ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లను రెండు మాసాల్లో పిలవనున్నట్టు మంత్రి నారాయణ వెల్లడిరచారు.
ప్రపంచ బ్యాంకు నిధులు రూ.15 వేల కోట్ల మంజూరుకు సంబంధించి పర్యావరణం మరియు సోషల్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై చర్చలు జరుగుచున్నాయని, ఈ ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చిందన్నారు. నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో ఈ నిధులు కూడా మంజూరయ్యే అకాశం ఉందన్నారు. ఇకపై ఎప్పటికప్పుడు సీఆర్‌డీఏ అకౌంట్స్ సబ్‌మిట్ చేయడం జరుగుతుందన్నారు. రాజధాని రైతులకు త్వరలోనే ప్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పరిహారం విషయంలోనూ రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో దాదాపు జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తి కావొచ్చిందన్నారు. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి సమావేశంలో పాల్గొన్నారు.