అమరావతి: తల్లిదండ్రులని చంపేసిన ముద్దాయి.. తాను అనాథనని, కరుణ చూపండి అని జడ్జి గారిని వేడుకున్నాడట! సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది జగన్ తీరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పాలిట కల్పవృక్షం లాంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ప్రజా రాజధాని అమరావతిని అంతం చేసి.. ఇప్పుడు ఏపీకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పవర్ హౌస్ కావాలంటూ అసెంబ్లీలో మొసలి కన్నీరు కారుస్తున్నాడు అని జగన్కు చురకలు వేశారు