మూడు ముక్కలాట నిలవదు
రాజధాని కోసం చేస్తున్న ధర్మపోరాటమే గెలుస్తుంది
జగన్ .. నాకు వయసు ఒక నంబరే
వైసీపీ ని బంగాళాఖాతంలో కలిపేయాలి
సత్తెనపల్లి నుంచి మేడికొండూరు వరకు భారీ రోడ్ షో
ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా నిలుస్తుంది అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆడుతున్నమూడు ముక్కలాట అనేది నిలబడదు. అమరావతి కోసం ప్రజలు చేసే చేసే ధర్మ పోరాటం న్యాయం గెలుస్తుంది అని చెప్పారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి తాడికొండ నియోజకవర్గం లోని మేడికొండూరు మండలం గుండ్లపాలెం లో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అంతకుముందు సత్తెనపల్లి నుంచి మేడికొండూరు వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు జనస్పందన వెల్లువెత్తింది. దీంతో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్ళే వాహనాలను సైతం నరసరావుపేట మీదుగా మళ్లించాల్సి వచ్చింది. రోడ్ షో జరిగే మార్గంతా జనసంద్రంగా మారింది. పలు చోట్ల చంద్రబాబుకు మహిళలు మంగళహారతులు ఇచ్చారు. మరికొన్ని గ్రామాలలో భారీ గజమాలలతో స్వాగతం పలికారు. దారిపొడవునా చంద్రబాబు పై పూలవర్షం కురిపించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ సంపద సృష్టితో ప్రజలకు మేలు జరుగుతుంది.
రాజకీయ నేతలు తెలివితో సంపద సృష్టి కోసం పనిచేయాలి. సంపదను దోచుకునే వారు కాదు. సంపద సృష్టించే వారు నాయకులుగా ఉండాలన్నారు. హైదరాబాద్ అభివృద్ది చేసిన నేను, దానికి ధీటుగా ఉండాలని అమరావతి ని సంకల్పించాను. నాడు రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవు. అప్పుడే ఆలోచించి ల్యాండ్ పూలింగ్ పథకం తీసుకువచ్చి భూములు సేకరించాను. 29 వేల మంది రైతులు, 33 వేల ఎకరాలు ఇవ్వడం అనేది ప్రపంచంలోనే చరిత్ర అని పేర్కొన్నారు. రైతులు భూములు ఇచ్చి మంచి రాజధాని కట్టమని కోరారు. ఒకప్పుడు మన రోడ్లు అధ్దాన్నంగా ఉండేవి. అప్పుడే ప్రైవేటు పార్టనర్ షిప్ తో రోడ్ల నిర్మాణంచేపట్టాం. దీంతో దేశంలో అద్భుతమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. నాడు పోర్టులు, విద్యుత్, ఎయిర్ పోర్టులు, టెలికాం సెక్టార్ లో సంస్కరణలు తీసుకువచ్చాం.
ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో నాడు ప్రాజెక్టులు రూపకల్పన చేశాము. ఇందులో భాగంగానే ఒక్కపైసా ఖర్చులేకుండా హైటెక్ సిటీ కట్టాం.దీంతో ఆ ప్రాంతం రూపు మారిపోయింది అని వివరించారు. ఒకప్పుడు ఎకరా భూమి 10 వేలు 20 వేలు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎకరం భూమి 30 కోట్లు, 40 కోట్లు కెసీఆర్ కూడా అన్నాడు. ఒకప్పుడు ఎపిలో భూముల రేట్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువ అన్నాడు. దీనికి సిగ్గుపడాలన్నారు. ఎన్నికల ముందు ఇదే రాజధాని అని జగన్ అన్నాడు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అన్నాడు.
ఎందుకు నీ ఇల్లు తగలబెట్టడానికా?
నాడే మూడు రాజధానులు అంటే జగన్ తాట తీసేవారు. రాజధానిపై కుల ముద్ర వేశారు. అన్ని కులాల వారూ భూములు ఇచ్చారు. అలాంటి చోట ఒక కులం పేరు పెట్టి రాజధానిపై కుట్ర చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ భూమి గట్టిగా ఉండదు. ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నారు. కానీ సాంకేతికంగా అదీ తప్పుడు ప్రచారం అని తేలింది. తరువాత అమరావతి భూముల్లో కుంభంకోణం అన్నాడు. కానీ కొండను తవ్వి ఎలుకను కాదు కదా. బొచ్చు కూడా పట్టుకోలేకపోయాడు అని విమర్శించారు. తరువాత అసైన్డ్ భూముల అంటూ ఏవేవో ఆరోపణలు చేశాడు. అసైన్డ్ భూములకు కూడా లాండ్ పూలింగ్ లో డబ్బులు ఇచ్చిన ఘనత టీడీపీది అని చెప్పారు. రౌతు కూలీలకు ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇవ్వలేదు. మనం రూ. 2500 రైతుకూలీలకు ఇచ్చామన్నారు.
ఈ గుంటూరు జిల్లాలో రాజధాని రావాలి అని ప్రజలందరి కోరిక. రాష్ట్రానికి నడి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ అమరావతి ప్రాంతం. మనం కట్టిన అసెంబ్లీలో, మనం కట్టిన సచివాలయంలో కూర్చుని వాటిపై ఆరోపణలు చేస్తున్న ఫేక్ ఫెలోఈ ముఖ్యమంత్రి మనం బ్రహ్మాండమైన బిల్డిండ్ కట్టాం. వాటిని గ్రాఫిక్స్ అంటున్న మంత్రులు వాటి పైకి ఎక్కి దూకితే తెలుస్తుంది. వాళ్ల శని విరగడవుతుంది అని ధ్వజమెత్తారు. పోలీసులు అమరావతి ఉద్యమ కారులపై దారుణంగా వ్యవహరించారు. రైతులపై వందల కేసులు పెట్టారు. 2 వేల మందిపై కేసుల పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడికి వస్తూ కంటెపూడి అనే గ్రామానికి వెళ్లాను. అక్కడ పేదల పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. సిఎం విద్యా దీవెన, అమ్మఒడి ఇచ్చాను. అందరూ చదువుకున్నారు అంటున్నాడు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక్కరే చదువుకోవాలా? ఎస్ సిల పిల్లలు చదువుకోకూడదా? ఒక్కరికి అమ్మ ఒడి ఇస్తే మిగిలిన పిల్లలు చదువుకోవద్దా.?ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేసిన లావణ్య అనే ఆ బాలికను నేను చదివిస్తా అని చెప్పానని చంద్రబాబు తెలిపారు. ఎంతో మంది పిల్లలు చదువులు మానేసి పొలం పనికి పోయారు. ఈ సైకో సిఎంకు సిగ్గు ఉందా అని నేను అడుగుతున్నా సత్తెన పల్లిలో అక్కడి ఎమ్మెల్యే ఒక బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం వస్తే దానిలో కూడా వాటా అడిగాడు. వీళ్లు మనుషులా? శవాలపై చిల్లర వేరుకునే వ్యక్తులా? అడిగినట్లు రెండున్నర లక్షలు ఇవ్వలేదని ఆ చెక్ బాధి కుటుంబానికి రాకుండా చేశారు. ఆ కుటుంబానికి రెండు లక్షల సాయం ప్రకటించా. వారి బిడ్డను చదివిస్తా అని ప్రకటించా అని వివరించారు.
కంటెపూడి గ్రామంలో విభిన్నప్రతిభావంతురాలికి కనీసం ట్రై సైకిల్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుంది అని ప్రశ్నించారు. ఈ వైసిపీ ప్రభుత్వంలో అన్ని ధరలూ పెరిగాయి. నిత్యావసర వస్తువులు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పన్నులతో ప్రజల రక్తం పీల్చే ప్రభుత్వం ఇది ఈ ప్రాంతంలో దొరికే ఇసుక ఎందుకు మనకు దొరకడం లేదు. ఇక్కడ ఉన్న వైసీపీ ఎంపీ ఇసుక అక్రమాలు చేస్తున్నాడు అని ఆరోపించారు. ఒక ట్రాక్టర్ ఇసుక 5 వేలు. ఒక లారీ ఇసుక 75 వేలు. ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది. తాడేపల్లి కొంపకు పోతుంది.
రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడు బండ్ల వద్దకూడా గూగుల్ పే ఉంది. పేటిఎం ఉంది. మరి బ్రాందీ షాపుల వద్ద ఎందుకు ఆన్లైన్ పేమెంట్ లేదు. వైన్ షాపుల్లో సొమ్మంతా ఎక్కడికి పోతుంది తాడేపల్లి కొంపకు పోతుందని ఆరోపించారు. రాష్ట్రానికి ఆదాయం రావాలి అంటే రాజధాని రావాలి అని ఒక సాధారణ మహిళ నన్ను కలిసి చెప్పింది. ఆ మహిళకు ఉన్న అవగాహన కూడా సిఎంకు లేదు అని విమర్శించారు.
డ్రామాలు ఆడుతున్నారు
బాబాయి గొడ్డలి వేటు. కోడికత్తి డ్రామా. పింక్ డైమండ్. అమరావతిపై డ్రామాలు. ఇలా అన్ని అంశాలపై డ్రామాలు ఆడిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సిఎం అవ్వాలని సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్ తాను జైల్లో ఉన్న సమయంలో నువ్వు నా బాణం అని చెల్లిని తిప్పిన వ్యక్తి జగన్. ఇప్పుడు ఆ చెల్లి ఎక్కడ ఉంది. కన్నతల్లి విషయంలో కనీస పరామర్శ చేయని వ్యక్తి జగన్ రెడ్డి. తల్లిని చెల్లిని అభిమానించని జగన్. మనల్ని చూస్తాడా? వివేకా హత్యలో షర్మిల వ్యాఖ్యలకు జగన్ సిగ్గుతెచ్చుకోవాలన్నారు. జగన్ ఎంత పెద్ద నటుడో చూడండి. ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా అన్నాడు. జగన్ నటనకు ఆస్కార్ ఇవ్వాలి అని ఎద్దేవా చేశారు. జగన్ నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. జగన్ నాకు వయసు ఒక నెంబరే. నాకున్న స్పిరిట్ నీకు లేదు. 40 ఏళ్లలో చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగు దేశం పార్టీ. అభివృద్ది కి చిరునామా తెలుగు దేశం పార్టీ నాడు ఉన్న అన్నక్యాంటీన్ ఇప్పుడు ఎందుకు లేదు?చంద్రన్న భీమా వస్తుందా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పేదరిక నిర్మూలన
సమాజంలో పేదరికం పోవాల్సి ఉంది. దీని కోసమే నేను పిపిపిపి అనే ఒక విధానాన్ని ప్రతిపాదించాను అని చంద్రబాబు చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్, ప్రజ లతో కలిసి పార్టనర్ షిప్ తో ఏర్పాటు అయిన నగరమే, ఈ అమరావతి నగరం. అమరావతి పూర్తి అయ్యి ఉంటే రెండు నుంచి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేది. ఇప్పుడే కూలీలతో మాట్లాడాను. వారు కూలీ పని కోసం కర్నూలు నుంచి అమరావతి ప్రాంతానికి వచ్చారు అని చెప్పారు. అమరావతి పూర్తి అయ్యి ఉంటే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం, లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాథి లభించేది. అలాంటి రాజధానిని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్ అని విమర్శించారు.
గుంటూరు జిల్లాలో మూడు రోజులగా పర్యటన చేస్తున్నాను. మీ స్పందన చూశాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఓడిపోవడం ఖాయం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ని బంగాళా ఖాతంలో కలిపేయాలి అని పిలుపునిచ్చారు. జగన్ వైనాట్ కుప్పం అంటున్నాడు. వైనాట్ కుప్పం కాదు. ఇప్పుడు చెపుతున్నా వైనాట్ పులివెందుల వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురుతుంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని అక్కడే ఓడించాను అని చంద్రబాబు వెల్లడించారు. చేపలు పట్టుకునే చిన్న గ్రామం సింగపూర్. ఎడారి ఉండే దుబాయి ఎలా అభివృద్ది చెందాయో చూశాం. పుణ్యభూమి, అన్ని సంపదలు ఉన్న అమరావతిని శ్మశానం చేస్తున్నాడు. పేదలను ఎలా కోటీశ్వరులను చేస్తావు అంటున్నాడు. చేసి చూపిస్తాం.
జగన్ దగ్గర ఉన్న ఆదాయం తీస్తే. 43 వేల మంది కోటీశ్వరులు కావచ్చు అని పేర్కొన్నారు. ఉద్యోగులకు పిఆర్సి లేదు. సిపిఎస్ రద్దు చేయలేదు. పోలీసులకు సరెండర్ లీవుల డబ్బులు చెల్లించలేదు. పదవీ విరమణ పొందితే కూడా చెల్లింపులు చేయడం లేదు. జగన్ ఒక స్టిక్కర్ సిఎం. మీఇంట్లో జగన్ స్టిక్కర్ వేస్తే దాని పక్కన 6093 అని రాయండి. అది జగన్ ఖైదీ నెంబర్ జగన్ బొమ్మ ఉండాల్సింది మన గోడలపై కాదు. పోలీస్ స్టేషన్ లో అని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదు. మళ్లీ వైసీపీకి ఓటు వేస్తే ఉరి వేసుకోవాల్సిందే అని చంద్రబాబు పేర్కొన్నారు.