- నోరుతెరిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడి గోడు
- భూములు కొట్టేసి దేవుడికే శఠగోపం పెట్టిన వైసీపీ నేతలు
- అర్హత లేదంటూ పింఛన్ కట్ చేశారని దివ్యాంగుడి ఆవేదన
- వైసీపీ నేత, ఎస్‌ఐ నుంచి నుంచి ప్రాణహాని ఉందని మరొకరు
- టీడీపీ జాతీయ కార్యాలయంలో అర్జీదారుల వినతిపత్రాలు
- అర్జీలు స్వీకరించిన మంత్రి ఆనం, వర్ల రామయ్య, నేతలు
మంగళగిరి(చైతన్యరథం): ఇటు అంబటి రాంబాబు అనుచరుల ఇంటి కబ్జా, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డిల అనుచరుల బెదిరింపులు..మరోవైపు దేవు డికే శఠగోపం పెడుతూ దేవాలయాల భూములను కొట్టేసిన వైసీపీ కేటుగాళ్ల బాగోతంపై బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో వారంతా తమకు న్యాయం చేయాలని అర్జీలను అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సంఘం కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణ, కోడూరి అఖిల్ తదితరులు వినతులు స్వీకరించారు. భూ కబ్జాలు, పింఛన్ సమస్య లు, పట్టాదారు పాసుపుస్తకాలు, అక్రమ కేసులు తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు.
ఇల్లు, స్థలం కబ్జా చేశారు..న్యాయం చేయండి
గుంటూరు సంగడిగుంటకు చెందిన మల్లం వసంతరావు తన గోడు చెప్పుకుంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు బంధువులమంటూ తమ ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి సామగ్రి బయటపడేసి..ఇంటిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నోరు తెరిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని న్యాయం చేయాలని కోరారు. మచిలీపట్నంలో కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ రి.నెం.1640లో 749 గజాల స్థలం డి1 ప్లాట్‌ను వైసీపీ నేతలు కబ్జా చేశారని..ఆ స్థలాన్ని విడిపించాలని బాధితురాలు అంగడాల విజయలక్ష్మి కోరారు.
వైసీపీ నేతలు కేసులు పెట్టి వేధించారు
ముస్లిం సామాజికవర్గానికి చెందిన తాను టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నందున మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప అనుచరులు అక్రమ కేసులు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారని..తనపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని పుంగనూరుకు చెందిన సయ్యద్ సుహేల్ బాషా వాపోయాడు. ఒంగోలుకు చెందిన కాళ్లు లేని దివ్యాం గుడైన ఖాదీర్ గత ప్రభుత్వంలో పింఛన్‌ను తొలగించారని న్యాయం చేయాలని కోరాడు. దీనిపై నేతలు అధికారులకు ఫోన్ చేసి ఆరా తీయగా అతను దారిద్య్ర రేఖకు కింద లేడని సమాధానం ఇచ్చారు. దీనికి ఖాదీర్ స్పందిస్తూ తనకు ఉండటానికి ఇల్లు కూడా లేదని. అద్దె ఇంట్లో ఉంటున్నామని తన తల్లి బొండాల బండి పెట్టి తమను పోషిస్తుందని విలపించాడు.
తమ భూమిని ముగ్గురికి ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించారు
తాము కొనుగోలు చేసిన 78.50 ఎకరాల భూములకు తప్పుడు పాసుపుస్తకాలు సృష్టించి మార్కాపురం ఎస్‌ఆర్వో కార్యాలయంలో 1బీలు, అడంగల్ సృష్టించి భూమి మొత్తాన్ని ముగ్గు రి పేరిట ఫేక్ రిజిస్టర్ చేయించుకున్నారని ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఐనముక్కల కు చెందిన పలువురు వాపోయారు. అందులో ఎస్‌పీపీ ఫార్మా ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వారి పేరిట కృష్ణా జిల్లా గన్నవరంలో మరొక ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారని బాధితు లు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
వైసీపీ నేత, ఎస్‌ఐ నుంచి ప్రాణహాని ఉంది
` వైసీపీ నాయకుడు కోటేరు ముత్తారెడ్డి, వీరులపాడు ఎస్సై నుంచి తనకు తన కుటుం బానికి ప్రాణ హాని ఉందని వారి నుంచి కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన నిప్పులపల్లి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తమపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ వాపోయారు. మెగా డీఎస్సీ భర్తీలో ఏ జిల్లాలో కూడా సంస్కృత పోస్టులను ఆన్‌లైన్‌లో చూపించడం లేదని పలువురు అభ్యర్థులు తెలిపారు. సంస్కృతంలో బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు సుమా రు 1000 మంది, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు 100 మంది, ఎంఏ పూర్తి చేసిన వారు 5000 వేల మంది ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సి పల్ పాఠశాలలలో ఖాళీ సంస్కృత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అర్జీ ఇచ్చారు.
బాలినేనికి ఓట్లేయలేదని తమ భూములను వేరొకరికి ఇప్పించారు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 427 కుటుంబాల సభ్యులు విజ్ఞప్తి చేస్తూ తాము మాజీ ఎమ్మెల్యే బాలినేనికి ఓట్లు వేయలేదని దురుద్దేశంతో తమ భూమిని ఇంకొల్లు మండలం భీమవరం గ్రామస్తులకు డీకే పట్టాలు ఇప్పించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
దేవాలయ స్థలం విడిపించాలి
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం శాయపురం గ్రామస్తుడు వెంకటప్పయ్య గ్రామంలో దేవాలయ స్థలం ఆక్రమ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసి భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం దండంగి గ్రామానికి చెందిన 111 మంది నిర్వాసి తులకు ప్యాకేజీ ఇప్పించాలని కోమలి కిషోర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశాడు.