(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
అమరావతి : ఒక ఉన్మాది, సైకో, నరరూప రాక్షసుడు పాలకుడైతే ఆ రాజ్యం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపుతున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలియాస్ తుగ్లక్ రెడ్డి. ఒక్కఛాన్స్ పేరుతో అధికారపగ్గాలను అప్పగించిన పాపానికి గత 40 నెలలుగా 5కోట్ల మందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అరాచక పాలకుడు జగన్‌రెడ్డి వికృత చేష్టలకు పరాకాష్టగా నిలుస్తోంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం. కోట్లాది ప్రజల ఆరాధ్యదైవం, అన్న ఎన్టీఆర్… భారతదేశం లోనే తొలిసారిగా 1986లో హెల్త్ యూనివర్సిటీ స్థాపించగా.. ఆయన సేవలకు గుర్తుగా చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి జగన్ తన శాడిజాన్ని మరోమారు ప్రజలకు రుచిచూపించారు. ఎటువంటి సంకేతాలు లేకుండా అర్థరాత్రి ఆత్మలతో మాట్లాడి తెల్లారేసరికి నిర్ణయాలు తీసుకునే జగన్ రెడ్డి.. నిన్న అర్థరాత్రి కూడా అదే పోకడ కొనసాగించారు. ఫలితంగా బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత, అరాచక చర్యపై అసెంబ్లీ, శాసనమండలి అట్టుడికిపోయాయి. అసెంబ్లీలో టిడిపి సభ్యులను మార్షల్స్ బయటకు నెట్టి బిల్లు పాస్ చేసుకున్న సైకో సిఎం జగన్… శాసనమండలిలో తెలుగుదేశం సభ్యుల తీవ్ర అభ్యంతరాల నడుమ ఆమోదిచుకున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంతో తెలుగుప్రజలు ఆగ్రహవేశాలతో రగిలిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబికాయి. ఎక్కడికక్కడే తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఆందోళనలు ఉద్ధృతం చేసి తాడో,పేడో తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
ఆగ్రహంతో ఊగిపోయిన టిడిపి శాసనసభ్యులు
ఏపీ అసెంబ్లీ 5వ రోజు ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. హెల్త్ యునివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్చాలన్న నిర్ణయంపై ఆగ్రహం చేశారు. టిడిపి సభ్యుల ఆగ్రహవేశాలతో ఖిన్నుడైన స్పీకర్ సీతారాం అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అయినప్పటికీ స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నిరసన కొనసాగించారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు బిల్లు కాపీలను చింపి స్పీకర్ పై విసిరారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. ఎన్టీఆర్ పేరును సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు. తన టేబుల్ పై ఉన్న పేపర్లను టిడిపి సభ్యులు లాగేయడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పేరు మార్పుపై బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యులను మార్షల్స్ బలవంతంగా బయటకు పంపారు. అనంతరం టిడిఎల్ పి కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటం వద్ద టిడిపి ఎమ్మెల్యేలు జోహర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు. అసెంబ్లీ బయట టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పేరు మార్పు బిల్లుల ప్రతులను తగలబెట్టారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని చుట్టుముట్టిన శ్రేణులు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఆర్చ్ ఎక్కి టీడీపీ జెండా పాతారు. గోడ దూకి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. మహిళలను సైతం పోలీసులు అమానుషంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. పోలీసు లు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు నినాదాలు చేశారు. భారీ పోలీసు వలయాలను ఛేదించుకొని టిడిపి నేతలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడిరచారు. ఒక కార్యకర్త హెల్త్ యూనివర్సిటీ పోర్టికో పైకి ఎక్కి తమ నిరసనను తెలియజేశారు. హెల్త్ యూనివర్సిటీ ప్రాం గణంలో ఆందోళనకు దిగిన టిడిపి వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్, టిఎన్ టియుసి అధ్య్షుడు గొట్టుముక్కల రఘురామరాజుతో సహా పలువురు టిడిపి నేతలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్ ఎక్కించారు. మరోవైపు సత్తెనపల్లి టిడిపి నేత మన్నే శివనాగమల్లేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి హెల్త్ యూనివర్సిటీ గేటువద్ద బైఠాయించారు. కొందరు గన్నవరం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
మండలి లో గందరగోళం – ఉద్రిక్తత
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్క రించిన మండలి చైర్మన్ తిరస్కరించడంతో యువనేత లోకేష్ నేతృత్వంలో టిడిపి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ నినాదాలు చేశారు. పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఛైర్మెన్ పోడియం చుట్టుముట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసిపి ప్రభుత్వం తెచ్చిన బిల్లు ఉపసంహరించుకోవాలంటూ నిరసన చేపట్టారు. మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటూ విమర్శలు చేస్తూ దాడి చేసిన అధికార పక్షం ఎమ్మెల్సీలు ఎదురు దాడికి దిగారు. వైసిపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టిడిపి సభ్యులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ బాబాయ్ కి గొడ్డలిపోటు, చెల్లి కి వెన్నుపోటు, తల్లి ని గేంటేసిన అబ్బాయ్ అంటూ నినాదాలు చేశారు. చరిత్ర హీనుడు జగన్‌రెడ్డి అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్పు తుగ్లక్ చర్య. వైఎస్ కి హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఎంటి? హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది ఎన్టీఆర్ అని అన్నారు. టిడిపి సభ్యులు నినాదాలతో చేసేది లేక చైర్మన్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడినా పోడియం దగ్గరే ఉండి టిడిపి సభ్యులు ఆందోళన కొనసాగిం చారు. టిడిపి సభ్యుల ఆందోళనకు బిజెపి, పిడిఎఫ్, ఇతర పార్టీల సభ్యులు సంఫీుభావం తెలిపారు. సభ్యు ల ఆందోళన నడుమే వైద్య,ఆరోగ్యమంత్రి విడదల రజని సభలో బిల్లు ప్రవేశపెట్టారు.
జగన్ రెడ్డి దోపిడీపై ఆందోళన
మూడేళ్లలో జగన్ రూ.2 లక్షల కోట్ల దోపిడీ చేశా రంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభ పక్షం బుధవారం ఉదయం ప్లకార్డులు చేతబూని అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీ సమీపంలో ని ట్రాఫిక్ పీఎస్ వద్ద సహజ వనరుల దోపీడీ పై తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. అవినీతిలో ఏ 1 జగన్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. లేపాక్షి భూములు జగన్ కుటుం బం కబ్జా చేస్తే, ఖాళీ స్థలాలను వైసిపి ల్యాండ్ మాఫి యా కబ్జా చేస్తోందని ఆరోపించారు. జగన్ రెడ్డి స్కాం రెడ్డి గా మారి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని నేతల ధ్వజమెత్తారు. భూ, ఇసుక, మద్యం, మైన్స్, బియ్యం దోపిడీకి వైకాపా నేతలు పాల్పడుతు న్నారంటూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఇసుకను మింగేస్తున్న వైసీపీ ఇసుకాసురులు అంటూ ప్లకార్డుల తో ప్రదర్శన చేశారు. జే బ్రాండ్స్‌తో జగన్‌రెడ్డి పేదల రక్తం తాగుతున్నారని నినాదాలు చేశారు. జగన్ వాకిట్లో గంజాయి చెట్లు, సెంటు భూమి పేరుతో ప్రజాధనం లూటీ అంటూ ప్లకార్డులు చేబూని నిరసన తెలిపారు. మైనింగ్ మాఫియా డాన్ గా జగన్ రెడ్డి ఉంటే, వైసీపీ నేతలు రేషన్ బియ్యం కొట్టేస్తున్నారని నేతల మండిపడ్డారు. ఎర్ర చందనాన్ని వైకాపా నేతలు ఏటిఎంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు.