- ప్రజావినతులలో బాధితుడి ఫిర్యాదు
- చిట్టీల పేరుతో రూ.6 లక్షలకు టోకరా
- భూ ఆక్రమణలు, ఇతర సమస్యలపై విజ్ఞప్తులు
- అర్జీలు స్వీకరించిన రెడ్డి సుబ్రహ్మణ్యం, మర్రెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): కబ్జాదారులు రూ.25 కోట్ల విలువైన తమ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని.. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని కర్నూలుకు చెందిన వహీదా ఖాటూన్ టీడీపీ కేంద్ర కార్యాల యంలో ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తమ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకుని తమ భూమిని తమకు దక్కేలా చూడాలని విన్నవించింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ వ్యవసాయ మిష న్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కల రిష్వంత్ అర్జీలు స్వీకరించారు.
` కంచేటి విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి చిట్టీల పేరుతో తన వద్ద రూ.6 లక్షలు తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వడంలేదని కృష్ణా జిల్లా పోరంకి గ్రామానికి చెందిన నందిపాటి వరమ్మ లబోదిబోమంది. అతనిపై చర్యలు తీసుకుని తనకు డబ్బులు ఇప్పించాలని వేడుకుంది.
` పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన గోనుగుంట్ల పూర్ణచంద్రరావు సమస్యను వివరిస్తూ తన పేరున ఉన్న భూమిని సర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసి తనకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
` అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లికి చెందిన బండి ఈశ్వర్ సమస్యను వివరిస్తూ సుండిపల్లి టౌన్ నుంచి ఎగువ మాలపల్లి వరకు ఉన్న రహదారి అధ్వానంగా ఉందని, ఆ రహదారిని సరిచేసి ప్రయాణికుల ఇబ్బందిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాడు.
` తమ వీధిలో సైడ్ కాలువ సిమెంట్ రోడ్డు లేకపోవడంతో వర్షం పడితే వీధి మొత్తం చెరువును తలపిస్తుందని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన బండారు ఆంజనేయులు తెలిపాడు. సిమెంట్ రోడ్డు నిర్మించి సైడ్ కాలువ ఏర్పాటు చేయాలని విన్నవించాడు.
` తమకు గుంటూరులోని సంజీవనగర్ 3వ లైన్‌లో రేకుల ఇల్లు ఖాళీ స్థలం ఉండ గా దానిని పూనూరు నాగేశ్వరరావు, కుమారి కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగళకుదురులో నివాసం ఉంటున్న కొలకలూరి రమాదేవి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తన ఇంటిని, స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని మొర పెట్టుకున్నారు.