- రూ.12.85 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు
- వేలం వేసి ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలి
- జగన్ ఐదేళ్లలో దోచుకున్న డబ్బంతా కక్కించాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం): ఎవడబ్బ సొమ్మని జగన్‌రెడ్డి రూ.12.85 కోట్లతో ఇంటికి ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ధనం జగన్ వాడుకున్నంత విచ్చలవిడిగా గతంలో ఏ ముఖ్య మంత్రి వాడి ఉండరని ధ్వజమెత్తారు. బిన్ లాడెన్, సద్దాం హుస్సేన్, అమెరికా అధ్యక్షులు కట్టుకున్నట్టు అబేద్యమైన ఐరన్ గడ్డర్‌తో తన ఇంటికి అంతటి సెక్యూరిటీతో కట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? రూ.12.85 కోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టి ఇంటికి రక్షణగా సెక్యూరిటీ గడ్డర్ కట్టుకోవడానికి ఎవరు అను మతించారో బయటపెట్టాలి.. ఏ అధికారి నిర్మించుకోమని రిపోర్టు ఇచ్చాడో వెల్లడిర చాలని కోరారు. మావోయిస్టులు, సెటిల్‌మెంట్ గ్యాంగ్, రిలీజియస్ గ్రూప్, ఐఎస్‌ఐ లాంటి ఏ గ్రూప్ నుంచి కూడా హాని లేనప్పుడు ఇంతటి రక్షణ జగన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ చెప్పిన ట్లు జగన్ ఐదేళ్ల పాలనలో తిన్నదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు. నిమ్మకూరులో ఉన్న బెల్ కంపెనీలో ప్రపంచదేశాల్లో యుద్ధాల్లో ఉపయోగించే ఆయుధాలు తయారు చేస్తారు.. వాళ్లకు కూడా ఇంతటి దుర్భేద్యమైన సెక్యూరిటీ గడ్డర్స్ లేవు. అలాంటప్పు డు జగన్‌కు ఎందుకు? అని ప్రశ్నించారు. అత్యంత విలువైన మణిమాణిక్యాలు జగన్ వద్ద ఏమైనా ఉన్నాయేమో..అందుకే ఇంతటి రక్షణ గడ్డర్లను ఏర్పాటు చేసుకున్నారే మోనని వ్యాఖ్యానించారు.
ప్రజాధనం దుర్వినియోగం వాస్తవం కాదా?
జగన్ పెట్టుకున్న సలహాదారుల వల్ల రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందేమో ఏ సలహాదారుడైనా చెప్పగలరా? పేదల సొమ్ముతో రక్షణ కవచం ఏర్పాటు చేసుకునేటప్పుడు పేదల డబ్బు నాకెందుకు అని జగన్‌కు అనిపించలేదెందు కు? దీన్ని బట్టి జగన్‌కు పేదలపై ఎంతటి ప్రేముందో అర్థమవుతుందన్నారు. దుర్మార్గపు ఆలోచనలతో ఐదేళ్లు పాలించి ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసింది కాక రాష్ట్ర సలహాదారులుగా తగని వారిని నియమించుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిం ది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగన్ మానసపుత్రిక సాక్షిలో పనిచేసిన వారికి దోచిపెట్టినదంతా ఇప్పడు కక్కించాలి. పోలవరం నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి ధనం అవసరం కనుక జగన్ సలహాదారులు, సాక్షి ఉద్యోగులు, సెక్యూ రిటీకి పెట్టిన ఖర్చు అంతా వసూలు చేయాలని కోరారు.
దోచుకున్న డబ్బును కక్కించాలి
జగన్ ఐదేళ్లు తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తానొక రాజుగా..కాలు తీసేయండంటే భటులు కాలు తీసేయడం, తల తీసేయండని చెబితే తల తీసే య డం, కట్టేసి కొరడాతో కొట్టండని చెబితే కొట్టడం వంటి ఆర్డర్డు వేయొచ్చని జగన్ భావించాడు. ప్రజాస్వామ్య పరిపాలన చేయాలని, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని జగన్‌కు తెలియదు..జగన్ చదువుకున్నది కూడా అంతంతమాత్రమే. తాడేపల్లి ప్యా లెస్ ముందు తన ఇంటికి ప్రజలు ఎవరూ నడవకుండా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు రహదారిని చంద్రబాబు వచ్చాక ప్రజా రహదారి చేశారు. తన ఇంటికి 40 అడుగుల ఎత్తు వరకు ఇనుప కంచె కట్టుకోవాల్సిన అవసరం జగన్‌కు ఎందుకొచ్చింది? రాజీవ్ గాంధీ ఇలాంటి కంచె ఏర్పాటు చేసుకుని ఉంటే బయటపడేవారు. ఉగ్రవాదుల నుంచి, టెర్రరిస్టుల నుంచి భయం ఉండే మోదీ, అమిత్ షాలకు కూడా ఇంతటి రక్షణ లేదు. జగన్‌రెడ్డి కోర్టులకు రెగ్యులర్‌గా హాజరై ఉంటే ఎప్పుడో జైలు జీవితానికే పరిమితమయ్యేవాడు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోర్టుకు వెళ్లలేదు. పదవి పోయి నాలుగు నెలలైనా కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదో అర్థం కావడంలేదు. కోర్టులు అతన్ని ఎందుకు పిలవడం లేదో కూడా అనుమానానికి తావిస్తోంది. కోర్టుకు ఆయన అవసరం లేదా? తెలిసిన వారు ఇందుకు సమాధానం చెప్పాలి. జగన్ ఇం టికి ఉన్న కంచెను వేలం వేసి వచ్చిన ధనాన్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని కోరారు. అంతేకాక నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఉపయోగించుకున్న ప్రజల డబ్బును జగన్‌తో కక్కించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు.