నారా లోకేష్ ప్రజల ఆశీస్సులతో 1600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.
వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆత్మకూరు లో తట్టెడు మట్టి వెయ్యలేదు.
ఇక్కడ ప్రజలకు ఇసుక దొరకకుండా చేసి వైసిపి నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
సోమశిల ప్రాజెక్టు డ్యామేజ్ అయితే మరమ్మత్తుల కోసం వైసిపి ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు.
నేను వైసిపి నుండి గెలిచిన మూడు నెలల్లోనే వైసిపి ప్రభుత్వం మాఫియా రాజ్యం అయిపోయింది అని చెప్పాను.
రైల్వే లైన్, ప్రభుత్వ ఆసుపత్రి అన్ని వైసిపి ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురయ్యాయి.
రాబోయేది టిడిపి ప్రభుత్వమే, సిఎం కాబోయేది చంద్రబాబు, యువతకు భవిష్యత్తు ఇచ్చేది లోకేష్.
ఆత్మకూరు ని అభివృద్ది చేయబోయేది టిడిపి.
ఆత్మకూరు కి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని కోరుతున్నాను.
వైసిపి ది విధ్వంసకర ప్రభుత్వం. కొత్తవి కట్టడం వీళ్ళకి చేతకాదు. అందుకే ఇది సైకో ప్రభుత్వం.
ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేసింది అంటే తన పతనాన్ని తనే కోరుకుంది.
సోమశిల ప్రాజెక్టు ను సైకో ధ్వంసం చేశాడు. సోమశిల ఉత్తర కాలువను నాశనం చేసాడు.
సైకో పోవాలి… సైకిల్ రావాలి అని అన్నాడు.