అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి జగన్రెడ్డి అండతోనే గిరిజనులపై ఎమ్మెల్సీ అనంతబాబు దాష్టీకాలు కొనసాగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఆత్మబంధువు, వైసీపీ ఎమ్మెల్సీ గంజాయి అనంతబాబు చేష్టలు చూస్తుంటే కుక్కతోక వంకర అనే సామెత గుర్తొస్తోందని ధ్వజమెత్తారు. దళితడ్రైవర్ సుబ్రహ్మణ్యంను హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఘటనపై రాజమండ్రి సెంట్రల్ జైలులో చిప్పకూడు తిన్నా అనంతబాబుకు బుద్ధిరాలేదని ఒక ప్రకటనలో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత సమాజంలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నా ఆయనలో ఏమాత్రం పరివర్తన కన్పించడం లేదు. పోలవరం నిర్వాసితుల పరిహారంపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన నేరానికి కూనవరం మండలం కూటూరులో ఆదివాసీ సోదరులపై గన్మ్యాన్తో దాడిచేయించి మరోమారు తన రాక్షస ప్రవృత్తిని చాటుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సోదరులపై దమనకాండ సాగిస్తున్న అనంతబాబుతోపాటు అతడ్ని పెంచి పోషిస్తున్న తాడేపల్లి ప్యాలెస్ ను బద్ధలుగొట్టడానికి 5కోట్లమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని జగన్ గుర్తించాలని లోకేష్ హెచ్చరించారు.