- నేటినుంచి మలిదశ ‘రా కదలి రా’..
- బాబు పిలుపుతో కదులుతున్న జనం
- వైసీపీ శ్రేణుల వెన్నులో వణుకు
- ఆంధ్ర అభివృద్ధికి ఇదీ రూట్ ప్లాన్
- దోపిడీ పాలనపై ప్రజాచైతన్యమే అజెండాగా చంద్ర గర్జన
తులసివనంలో గంజాయి మొక్కలాంటి గుట్కా నాని గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా.. పిడిబాకు లు దిగేలా ‘రా కదలిరా’ సభ జరగ బోతోంది. ఎక్కడబడితే అక్కడ, ఎలాబడితే అలా.. తెలుగు దేశం పార్టీపైన, నేతలపైన చెత్తభాషతో నోరు పారేసుకునే నాని చెంప చెళ్లుమనేలా చంద్రబాబు ప్రసంగం సాగుతుందని పార్టీ శ్రేణులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. జగన్ పాలనలో రాతి యుగానికి చేరిన రాష్ట్రాన్ని స్వర్ణ యుగానికి చేర్చాలని సంకల్పం పెట్టుకున్న చంద్రబాబు ` ఎన్టీఆర్ వర్థంతి సాక్షిగా నేటి నుంచి మలిదశ ‘రా కదలిరా’ను ప్రారంభిస్తున్నారు. సభను దిగ్విజయం చేయడానికి స్థానిక పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
పాపం పండేవరకూ పరమాత్ముడూ కదలడు. కంసుడి పాపాలు వందయ్యేవరకూ కృష్ణుడు ఎదురుచూశాడు. ఎన్నికలు వందరోజులకు చేరే వరకూ చంద్రబాబూ ఎదురు చూశారు. జగన్ పాలనలో జనం ఊచకోతను చూసి చలించిన చంద్రబాబు.. నియంత నాశనంనుంచే తెలుగు జాతి సముద్ధరణ అంటూ ముందుకు కదిలారు. అలా బాబు చేసిన రణన్నినాదమే` ‘రా.. కదలిరా!’. బాబు పిలుపునకు తెలుగు ప్రజలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే `జగన్ పాపం పండినట్టే కనిపిస్తోంది.
వ్యక్తులైనా, వ్యవస్థలైనా ప్రగతి దిశగా పయనించాలంటే.. విజన్ డాక్యుమెంట్ ఒకటి డిజైన్ చేసుకోక తప్పదన్నది చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట. ఆ విజనే `సమైక్య రాష్ట్రంలోనూ, ప్రత్యేకాంధ్రలోనూ.. నిర్మాణాత్మక ప్రగతికి బీజమేసింది. ఆ విజనే `ప్రపంచ దేశాలతో తెలుగు నేలను ముడేసింది. ఆ విజనే `తెలుగు ఆత్మగౌరవానికి ప్రపంచం మొత్తం తలొంచి నమస్కారం చేసే స్థాయినిచ్చింది. ఏపీ తిరిగి పూర్వ వైభవం అందుకునే దిశగా పరుగులు మొదలెట్టింది. ఇక్కడే రాజకీయం విసిరిన పాచిక ఆంధ్రను దెబ్బతీసింది.
మారిన రాజకీయ పరిణామాల్లో ` ఆంధ్ర ప్రజలు జగన్‌పై జాలి చూపించారు. ‘ఒక్కఛాన్స్’ అంటూ రాజ కీయ భిక్షమెత్తిన జగన్‌కు అవకాశమిచ్చారు. తరువాతే `నియంత నిజ స్వరూపం బయటపడిరది. గత ఐదేళ్ల లో పాలన గాడితప్పింది. అరాచకం రాజ్యమేలింది. విజన్ మాయమై`కన్ఫ్యూజన్ కన్నుతెరిచింది. అభివృద్ధి మాట అటుంచి ` రాష్ట్రం ఐదేళ్లలో అధోగతికి చేరింది. అనుభవంలేని అహంభావికి అనవసరంగా అధికారం అందించామన్న చింత తెలుగు జాతిని వెంటాడుతోంది. రాష్ట్రం విడిపోయినపుడు ` నాలుగు రోడ్ల కూడలిలో దిక్కులేనిదిగా నిలబడిన ఆంధ్రకు చేయి అడ్డుపెట్టిన ట్టే.. ఇపుడు నియంత పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించ డానికి మళ్లీ చంద్రబాబుబాధ్యతలు తీసుకున్నారు వైసీపీ పాలనను పాతరేయకుంటే రాష్ట్ర భవిష్యత్ మరింత ప్రమాదంలో పడే పరిస్థితి ఉందంటూ ముందుకు కది లారు. కలిసొచ్చేవాళ్లను కలుపుకుని వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఒకటి చేస్తున్నారు. బాబు సభలకు పోటెత్తిన జనాన్ని చూస్తుంటే.. జగన్ పాపం పండినట్టే కనిపి స్తోంది. వైసీపీ మూకల వెన్నులో వణుకు పుడుతోంది.
రా కదలి రా `తొలి దశగా జనవరి 7న కనిగిరిలో మొదలైన ప్రభంజన పోరు.. జనవరి 10న తునిలో ముగిసింది. తిరువూరు, ఆచంట, ఆళ్లగడ్డ, బొబ్బిలి ప్రాంతాలను కలుపుకొని ఆరుచోట్ల ‘రా కదిలి రా’ అంటూ ప్రభంజన పోరుసాగింది. సభల్లో చైతన్యం వెల్లివిరుస్తుంటే `నాయకుడు చంద్రబాబులో ఉత్సాహం పెల్లుబుకుతోంది. సందర్భానుసారం ప్రత్యర్థిపై ఛలోక్తులు విసురుతూనే.. జగన్ వైఫల్యాలు, రాష్ట్రానికి అతను చేసిన నిర్మాణాత్మక ద్రోహాన్ని ఎండగట్టడంలో తెదేపా అధినేత చంద్రబాబు తన అనుభవాన్ని రంగరిస్తున్నారు. ‘పాపం జగన్ పేదవాడు. ఎంత పేదవాడంటే.. వేసుకోడానికి డ్రాయరు కూడా లేదు’ `అంటూ ఒక సభలో చంద్రబాబు విసిరిన ఛలోక్తిలో సీరియస్ హెచ్చరిక కూడా మిళితమై ఉంది. రాష్ట్రానికి అడ్రెస్ లేకుండా చేసిన నీకు, భవిష్యత్‌లో పట్టబోయే గతి అదేనన్న పదునైన హెచ్చరిక బాబు స్వరంలో కనిపించింది. రాష్ట్రాన్ని బతికించుకోవాలంటే తెలుగు దేశాన్ని గెలిపించాలన్న చైతన్యం కలిగిస్తూనే.. ఆంధ్ర అభివృద్ధికి తాను చేపట్టబోయే నిర్మాణాత్మక ప్రగతిని చంద్రబాబు తన సభల్లో స్పష్టంగా వివరిస్తున్నారు. మరోపక్క సభ నిర్వహించిన ప్రతిచోటా స్థానిక అంశా లను ప్రస్తావించటం ద్వారా `అభివృద్ధి విషయంలో తన రాజకీయ అనుభవాన్ని ప్రదర్శిస్తున్నారు.
జనం.. ప్రభంజనం
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన అనేక జగన్ సభలకు `‘అద్దె జనాన్ని’ మాత్రమే చూశాం. సంక్షేమ పథకాల కార్యక్రమాలే అయినా.. ‘బటన్ నొక్కేశాడు.. పద బయటకి పోదాం’.. అంటూ సభ మధ్యలోంచే జనం లేచెళ్లిపోయిన సంఘటనలు అనేకం. ‘రా కదలి రా’ సభల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు ప్రసంగాల నుంచి జనం కదలడం లేదు. సభికుల్లో ఉత్సాహం రేకెత్తిస్తూ ప్రత్యర్థులపైకి చంద్రన్న సంధిస్తున్న ఛలోక్తుల బాణాలు గురి తప్పకుండా గుచ్చుకుంటున్నాయి. ప్రతి సభా ఒకటికి మించి మరోకటి విజయవంతమైన నేపధ్యంలో `ఎన్టీఆర్ వర్ధంతి రోజైన జనవరి 18నుంచి గుడివాడ వేదికగా మలిదశ ‘రా కదలి రా’ మొదలవుతుంది. జీడీ నెల్లూరు, కమలాపురం, అరకు, మండపేట, పీలేరు, ఉరవకొండ, కోవూరు, పత్తికొండ, గోపాలపురం, పొన్నూరు, మాడుగుల, టెక్కలి, ఉంగుటూరు, చీరాలలో జనవరి 29 వరకూ రా కదలి రా నిర్వహించనున్నారు.