- పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలపై కీలక సమావేశం
- కేంద్ర విజన్ 2047కు అనుగుణంగా సాగిన చర్చలు
- దేశాన్ని మొదటి ఐదు స్థానాల్లో నిలపడమే లక్ష్యం
- పాల్గొన్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంస్థ ప్రతినిధులు
- అవసరమైన సౌకర్యాలకు ఏపీ మారిటైమ్ బోర్డు హామీ
- రాష్ట్రాన్ని గ్లోబల్ షిప్ బిల్డింగ్ హబ్‌గా మార్చేలా అడుగులు
అమరావతి(చైతన్యరథం): ఏపీని నౌకానిర్మాణంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారు. 1053 కి.మీ తీరప్రాంతం, అభివృద్ధి చెం దిన ఓడరేవు నెట్‌వర్క్, వ్యూహాత్మక స్థానాలతో రాష్ట్రం ప్రపంచ నౌకానిర్మాణ గమ్య స్థానంగా మారడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రం లో అత్యాధునిక నౌకా నిర్మాణ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కార్యదర్శి ఎస్‌సురేష్‌కుమార్ అమ రావతి సచివాలయంలో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మారిటైమ్ విజన్ 2047కి అనుగుణంగా సమావేశంలో చర్చలు జరిగాయి. ప్రపంచం లోని మొదటి ఐదు నౌకా నిర్మాణ దేశాలలో భారతదేశాన్ని ఉంచాలని లక్ష్యంగా పెట్టు కుంది. ఈ దార్శనికతను వేగవంతం చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డ్ ఇటీవల రాష్ట్రం లో నౌకానిర్మాణ పెట్టుబడుల కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ద్వారా ప్రతిపాదనలను ఆహ్వానించింది.
మారిటైమ్ బోర్డ్ బృందం ఈ ఆసక్తి వ్యక్తీకరణ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ షిప్ బిల్డర్‌లను సంప్రదించింది. ఆ మార్కెట్‌లో చాలామంది దృష్టిని ఆకర్షిం చింది. హ్యుందాయ్ హెవీ ఇండస్ట్రీస్, కొరియన్ షిప్ బిల్డర్లు గతంలో ఏపీ మారిటైమ్ బోర్డుతో నిమగ్నమై ఉండటమే కాకుండా రాష్ట్రంలో అవకాశాలు, ఉన్న వనరులు, సామ ర్థ్యంపై బలమైన ఆసక్తిని కనబరిచారు. వారి సైట్ సందర్శనలు, చర్చలు షిప్ యార్డ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ను మంచి గమ్యస్థానంగా హైలైట్ చేశాయి. అంతేకాకుండా దేశంలో ప్రముఖ నౌకానిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్‌తో సహకార అవకాశాలను అన్వేషించడంపై సమావేశం దృష్టి సారించింది. ఆ సంస్థ ప్రతినిధులు ఏపీ మారిటైమ్ బోర్డుతో ఉత్పాదక చర్చలు జరపడమే కాకుండా నౌకా నిర్మాణానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి సంభావ్య సైట్‌లను కూడా సందర్శించారు.
సమావేశంలో ముఖ్యాంశాలు
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ప్రతినిధులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, తీరప్రాంత వనరులపై సంతృప్తి వ్యక్తం చేశారు. నౌకానిర్మాణం, సముద్ర అనుబంధ పరిశ్రమల సమూహాన్ని అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశం యొక్క మారిటైమ్ విజన్ 2047ను సాధించడానికి రాష్ట్రం ఎలా దోహదపడుతుంది అన్న దానిపై చర్చలు జరిగాయి. పెట్టు బడులను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు, క్రమబద్ధీకరించిన ఆమోదాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా పూర్తి సహకారానికి ఏపీఎంబీ వారికి హామీ ఇచ్చింది.
తదుపరి లక్ష్యం ఏమిటి?
ఈ విజన్‌ను రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. జీఆర్‌ఎస్‌ఈతో ఈ సమావేశం హ్యుందాయ్, కొరియన్ షిప్ బిల్డర్లు సృష్టించిన సానుకూ ల వేగాన్ని జోడిరచి మరో అడుగు ముందుకు వేస్తుంది. ఏపీఎంబీ పరిశ్రమ ప్రతినిధుల తో పరస్పర చర్చ కొనసాగిస్తుంది. అంతేకాకుండా బలమైన నౌకానిర్మాణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఖరారు చేస్తుంది. ఏపీ ప్రపంచ నౌకా నిర్మాణ కేంద్రంగా మారడానికి అనుగుణంగా సిద్ధం చేస్తుంది. ఉద్యోగాలను సృష్టించ డం, ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా భారతదేశ సముద్ర భవిష్యత్తుకు దోహదపడేలా చర్య లు తీసుకుంటుంది.