- చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
- విచారణకు అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు
విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది. సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్ర మంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ 3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధి కారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు ఇప్ప టికే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు.చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ కేసు కు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మద్యం అనుమతుల కేసులో ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.