- ఈ ఏడాదీ సవాళ్లను అధిగమించి
- అంతకుమించి అత్యుత్తమ ఫలితాలు సాధిద్దాం
- పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం ఏపీ
- 16 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా కార్యాచరణ
- విద్యుత్ యూనిట్కు రూ.1.19 తగ్గించటమే లక్ష్యం
- ఈ ఏడాదిలోనే భూ రికార్డుల పూర్తి ప్రక్షాళన
- జీ రామ్తో కమ్యూనిటీ ఆస్తుల పెరుగుదల
- అమరావతి ప్రపంచానికే స్ఫూర్తిదాయకం
- అభివృద్ధిలో రాజధాని రైతుల భాగస్వామ్యం
- నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం జరగదు
- పోలవరం మిగులు నీళ్లు తెలంగాణ వాడుకోవచ్చు
- వారు ప్రాజెక్టులు కట్టినప్పుడు మేము అడ్డు చెప్పలేదు
- గత ప్రభుత్వంలో తిరుమల పవిత్రను దెబ్బతీశారు
- నేడు మద్యం బాటిళ్లు పెట్టి దుర్మార్గానికి పాల్పడ్డారు
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
- మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లతో సమీక్ష
అమరావతి(చైతన్యరథం) సవాళ్లను అధిగమించి: 2025లో సాధించిన ఫలితాలకు మించి ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విధ్వం సమైన వ్యవస్థలను గాడిన పెట్టి సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు. 2025 ఏడాదిలో మంచి ఫలితాలతో ప్రజల ఆశల్ని నిలబెట్టి విశ్వాసాన్ని మళ్లీ నింపామని తెలిపారు. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివా లయంలోని 5వ బ్లాకులో మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో కనీసం అప్పు తీసుకునే వెసులు బాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగవంతం చేయగలిగామని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు వేశాం. స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. దీని కోసం ఇప్పటివరకూ. రూ.1114 కోట్లు వ్యయం చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం. దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశాం. ఏడాదిన్నరలో రూ.50వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమం లో కొత్త మైలురాయిని సాధించాం. 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్ర మాలు, పనులు చేశాం. సంక్షేమ పాలనలో మరో మైలురాయిని దాటామని పేర్కొన్నారు.
పోలవరం పూర్తైతే ఏ రాష్ట్రమూ పోటీ పడలేదు
గత పాలకులు అమరావతిని స్మశానం, ఎడారని ఎగతాళి చేశారు. కానీ ఇదొక స్ఫూర్తిదాయక ప్రాజెక్టు. రాజధాని అభివృద్ధి లో రైతులను భాగస్వాములను చేస్తున్నాం ‘పోలవరం అత్యద్భు తమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం. నల్లమల సాగర్ ద్వారా రాయల సీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు. పుష్కరా ల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని తెలిపారు.
త్వరలో భోగాపురం విమానాశ్రయం జాతికి అంకితం
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తన్న ఎయిర్ పోర్టును త్వరలోనే జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.12 వేల కోట్ల రాబట్టి కాపా డుకున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ ఆ ప్లాంట్ను నిలబెట్టి తీరుతామని ఉద్ఘాటించారు. ‘దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయి. పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారింది. సీఐఐ ద్వారా చేసు కున్న ఒప్పందాలు అన్నీ సాకారం అయితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపీబీ ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబ డులకు ఆమోదం కూడా ఇచ్చాం. వీటి ద్వారా కూడా పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ కూడా 15 బిలియన్ డాలర్ల పెట్టు బడులతో ఏఐ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలో కృషి చేసిన అధికారులు, ప్రభు త్వ విభాగాలను అభినందిస్తున్నాను. అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేస్తాం. ఆరు నెలల్లో క్వాంటం కంప్యూ టర్ ఇక్కడి నుంచి పనిచేస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరను గణనీ యంగా తగ్గించగలిగాం. భవిష్యత్తులో రూ.1.19 పైసల మేర యూనిట్ కొనుగోలు ధర తగ్గించటం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లలోనూ 970 టీఎంసీ లను నింపగలిగాం.
రాయలసీమలోనూ పెద్దఎత్తున నీటిని నిలిపామని వివరించారు.
కమ్యూనిటీ ఆస్తులు పెరుగుతాయి
12 శాతానికి పైగా గత ఏడాది వృద్ధి సాధించాం. ఈసారి రెండో త్రైమాసికంలోనే 11.28 గ్రోత్ రేట్ సాధించాం.. మన లక్ష్యం 16 శాతం వృద్ధి రేటు. దానికి అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం తీసుకువచ్చాం. అలాగే పౌరసేవల్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు సాధించగలిగితే 2026లో మరింత మంచి ఫలితాలు సాధించవచ్చు. పట్టాదారు పాస్ పుస్త కాలను రాజముద్రతో జారీ చేస్తున్నాం. గతంలో ఫొటోలు వేసు కుని ఇష్టానుసారంగా వ్యవహరించారు. రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. అలాగే రీసర్వే ప్రక్రియను కూడా వేగంగా చేపడుతున్నాం.గతంలో ఎన్టీఆర్ మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ విభాగాన్ని ప్రక్షాళన చేశారు. ఈ 2026 ఏడాదిలో ల్యాండ్ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. రిజి (స్టేషన్ విభాగంలోనూ పూర్తి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. టెక్నాలజీ వినియో గించుకుని పూర్తి పారదర్శకంగా ఈ వ్యవస్థను మారుస్తాం. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగంగా దస్త్రాలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వీబీ జీ రామ్ జీ ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధంగా వినియోగించుకోవాలి. తద్వారా కమ్యూనిటీ ఆస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
దేవుడితో రాజకీయాలు బాధాకరం
దేశంలో 25 ఏళ్ల క్రితమే పీపీపీ విధానంలో జాతీయ రహ దారుల నిర్మాణం ప్రారంభమైందని, ఇవాళ గిన్నిస్ రికార్డును సాధించే దిశగా రహదారుల నిర్మాణం జరుగుతోందని పేర్కొ న్నారు. చేసిన పనులు సమర్ధంగా ప్రజలకు చెప్పుకోవటం ముఖ్యమన్నారు. ‘కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం.
శ్రీ వేంకటేశ్వరస్వామిపై ప్రజలకు అంత నమ్మకం. అలాంటి క్షేత్రాన్ని అపవిత్రం చేసే ప్రయత్నాలు జరిగాయి. పరకా మణిలో దొంగతనం జరిగితే సమర్ధించే ప్రయత్నం చేశారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారీ, ఖాళీ మద్యం బాటిళ్ల ను తిరుమలలో పెట్టడం లాంటి దుర్మార్గపు పనులకు పాల్ప డ్డారు. దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.














