అమరావతి: పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద నేతల రాజీనామాలతో దిక్కుతోచకుండా ఉన్న వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నట్లు ఎక్స్ ద్వారా వెల్లడిరచారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ వెల్లడిరచారు. కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనను గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని భావిస్తున్నారు. అయితే చేరిన పది రోజులకే వైసీపీని వీడుతున్నట్లు రాయుడు ప్రకటించటం కలకలం రేపింది. రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.