- రూ.27వేల కోట్ల కుంభకోణానికి జె-గ్యాంగ్ స్కెచ్
- 27వేల ఎకరాల భూములకు ఎసరు.. ఇప్పటికే పేదలకు బెదిరింపుల పర్వం
- ఈ భూములతో వ్యాన్ పిక్ తరహాలో బ్యాంకులను కొల్లగొట్టే వ్యూహం
- రహస్యంగా తీరప్రాంత గ్రామాల్లో సజ్జల, మిథున్ పర్యటనలు
- ఎమ్మెల్యే రేపాక నేతృత్వంలో తీర ప్రాంతంలో వైసీపీ దొంగల హల్‌చల్
- ఏవీఆర్ ఆయిల్స్ పేరుతో చమురు, సహజవాయువు వెలికితీత సాకు
- ఓఎన్ జిసి చేతులెత్తేసిన చోట తాము వెలికితీస్తామని అనుమతులు
- పచ్చని తీరంపై జగనాసురుడి కళ్లు – ఆందోళనలో తీరప్రాంతవాసులు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమలాపురం)
అడ్డగోలు సంపాదన, అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులతో సహా ఎవరినైనా బలిపెట్టే స్వభావంగల నేరచరితుడు ఫ్యాక్షనిస్టు, దోపిడీదారుడైన జగ న్‌రెడ్డికి రాష్ట్రప్రజలు దొంగచేతికి తాళాలిచ్చినట్లుగా 40నెలలక్రితం అధికార పగ్గాలు అప్పగించారు. ఇంకే ముంది..కంచే చేనుమేసిన చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఎటువంటి అధికారం లేకుండానే తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు దోచుకున్నగజదొంగ జగన్మోహన్‌రెడ్డికి అధికారపీఠం దక్కడం తో ఆయనచేసే అడ్డగోలు దోపిడీకి రాజముద్ర తోడైంది. తన తండ్రి హయాంలో వేటినైతేదోచుకొని వేలకోట్లు పోగేసుకున్నాడో అదేతరహా కుంభకోణాలను జగన్‌రెడ్డి 2.0 రిపీట్ చేస్తున్నారు. గతంలో దోపిడీ కారణంగా జైలుపాలైన ఓబులాపురం మైన్స్, లేపాక్షి నాలెడ్జి హబ్, వ్యాన్ పిక్‌లనే మళ్లీ లేటేస్టుగా పునరాృ తం చేస్తూ ఈ మూడింటి ద్వారా దాదాపు 50వేల కోట్లరూపాయల అక్రమసంపాదనకు తెరలేపారు. గత మూడేళ్లలో ల్యాం డ్, శ్యాండ్, వైన్, మైన్ కుంభ కోణాల ద్వారా 2లక్షల కోట్లరూపాయలు దోచుకున్న జగన్..రాబోయే రెండేళ్ల లో మరో మూడు లక్షల కోట్లు దోచుకునేందుకు పకడ్బందీగా స్కెచ్‌వేసి పక్కాప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు. అయితే తాజా ఎపిసోడ్‌లో కథ పాతదే అయినా క్యారెక్టర్లను మాత్రం స్వల్పంగా మార్చి నయా దోపిడీ పర్వానికి తెరలేపారు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. అందులో భాగంగానే కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సముద్రతీరంలోవ్యాన్‌పిక్ తరహా భారీ కుంభకోణానికి తెరలేపారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ ప్లోరేషన్ పేరుతో దాదాపు 27వేల ఎకరాల దళితులు, మత్స్యకారుల భూములను కొట్టేసి వేల కోట్లరూపాయల దోపిడీకి మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేశారు.
ఎవరీ ఎవిఆర్ ఆయిల్స్ లిమిటెడ్?
ఎవిఆర్ ఆయిల్స్ అండ్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక అన్ లిస్టెడ్ కంపెనీ. ఈ కంపెనీ జగన్ రెడ్డి అధికారం చేపట్టడానికి సరిగ్గా నాలుగునెలల ముందు 2019 ఫిబ్రవరి 4వతేదీన చెన్నయ్ లో కేవలం లక్షరూపాయల పెయిడ్ అప్ క్యాపిటల్ తో 10లక్షల రూపాయల పెట్టుబడితో రిజిస్టర్ అయింది. జగన్ రెడ్డి అధికారం చేపట్టి 3 సంవత్సరాల 4నెలలు కాగా, ఎవిఆర్ మినరల్స్ స్థాపించి 3 సంవత్సరాలు 7నెలలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎటువంటి మౌలిక సామర్థ్యం, ఆర్థిక పరిపుష్టిలేని సూట్ కేసు కంపెనీ ఎవిఆర్ ఆయిల్స్ సంస్థ. దీనికి ప్రతాప్ చంద్ర శివ అనే వ్యక్తి డైరక్టర్ కాగా, ఫిలిప్ పోతెన్ అనే వ్యక్తి నామినీ డైరక్టర్ గా ఉన్నారు. ఎటువంటి కనీస మౌలిక వనరులులేని ఈ సంస్థ రాజోలు నియోజక వర్గంలోని సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లోని సముద్రతీర ప్రాంతంలో ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపా లు వెలికితీస్తామని 21-8-2021న ప్రభుత్వా నికి దరఖాస్తు చేసుకోగా, ఏడాది క్రితం కనీస పరిశీ లన లేకుండా ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు.
అంతా సజ్జల కనుసన్నల్లోనే
రాష్ట్ర సకలశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రాంతంలోని ఒక గెస్ట్ హౌస్‌లో రెండురోజులు బసచేసి ఏం చేయాలనే విషయమై స్థానికఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు రూట్ మ్యాప్ ఇచ్చి..స్థానిక అధికారులకు త్వరగా పని పూర్తి చేయాలని అనధికారిక ఆదేశాలు జారీచేసి వెళ్లారు. దీంతో ఎవిఆర్ ఆయిల్స్ కంపెనీ ప్రతినిధులు, వైసిపి నేతలు రంగంలోకి దిగారు. రెండుమండలాల పరిధి లోని 24 కిలోమీటర్ల విస్తీర్ణంలో 27వేల ఎకరాలు సేకరించాలన్నది సజ్జలగారి ఆర్డర్.. ఎకరాకు 50వేలు ఇస్తాం.. మర్యాదగా భూములు అప్పగించి వెళ్లండి.. మీరు వెళ్లకపోయినా ఈ ‘‘యజ్జం’’ ఆగదన్నది వైసిపి నేతల చెబుతున్న మాటల్లోని సారాంశం. ఈలోపు మంత్రి పెద్దిరెడ్డి తనయుడు, ఎంపి మిధున్‌రెడ్డి ఈ ప్రాంతంలో రహస్యంగా పర్యటించడంతో దీనివెనుక ఎవరున్నారో పెద్దగా కష్టపడకుండానే తీరప్రాంత వాసులకు అర్థమైంది. అనాదిగా ఈభూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మమ్మల్ని వదిలేయండని పలుమార్లు ఈ ప్రాంత రైతులు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ స్పందనలో మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. సంబంధిత విజ్జాపన పత్రం తీసుకొని కనీసం రశీదు ఇవ్వడానికి కూడా ఉన్నతాధికారులు సాహసించలేదంటే ఏ స్థాయిలో వ్యవహారం నడుస్తుందో అర్థంచేసుకోవచ్చు.
మూడుబావుల్లో చమురునిక్షేపాల వెలికితీతకు అనుమతి
కెజి బేసిన్ పరిధిలోని సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం కేంద్రంగా మూడువెల్స్‌లో చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీస్తామని ఈ సంస్థ చెబుతోంది. ఇందుకు అవసరమైన ఆఫ్ షోర్ కార్య కలాపాల కోసం తాము KEI-RSOS పెట్రోలియం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ (KRPEL)తో ఒప్పం దం చేసుకున్నామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెప్పి అనుమతులు తెచ్చుకుంది. గతంలో ఓఎన్ జిసి వారు డ్రిల్లింగ్ చేసి వయొబుల్ కాదని చేతులెత్తేసిన 2బావులతోపాటు మరో బావి కలిపి మూడు బావులకు ఎవిఆర్ సంస్ధ కేంద్రంనుంచి అనుమతులు తెచ్చుకోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 31న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం కేశవదాసుపాలెం జడ్‌పి హైస్కూలులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా, రైతులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన సాక్షి దినపత్రికల్లో మార్చి 1వతదీన వెలువ డిరది. 30రోజుల్లో అభ్యంతరాలు ఉంటే తెలియ జేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. కేశవదాసుపాలెం ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అధికారులు ప్రభుత్వానికి ఏమి నివేదిక ఇచ్చారో తెలియదు.
వద్దంటున్నా తీరగ్రామాల్లో ఎవిఆర్ సర్వే
ఆ తర్వాత ఎవిఆర్ ఆయిల్స్ కంపెనీ ప్రతినిధులు, కొందరు వైసిపి పేటిఎం బ్యాచ్ సొసైటీ భూములతో సహా జిరాయితీ భూముల్లో సర్వే చేయడం ప్రారంభించారు. కేసనపల్లి సిసిఎఫ్ సొసైటీ వారు ఈ సర్వేని అడ్డుకొని తమ భూముల్లో డ్రిల్లింగ్ కార్యకలా పాలు నిర్వహించడానికి వీల్లేదని పాలక మండలిలో తీర్మానించారు. భూములు ఇవ్వాలంటూ వైసిపికి చెందిన పేటిఎం బ్యాచ్ తీవ్రవత్తిళ్ల నేపథ్యంలో రాజోలు తీరప్రాంత పరిరక్ష సమితి ఆధ్వర్యంలో కేశవదాసు పాలెంతోపాటు తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది జులై 6న రెండు మండలాల్లో ఆందోళనలు కూడా నిర్వహిం చారు. ఎస్సీ, సిసిఎఫ్, ఆల్ క్యాస్ట్ సొసైటీ సహకార సంఘాలు ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. తీరప్రాంత పరిరక్షణ సమితినాయకులు సఖినేటిపల్లి మండలంలో తీరప్రాంత గ్రామాలైన అంతర్వేది పల్లెపాలెం, అంతర్వేది కర, గొల్లపాలెం, తూర్పుపాలెం, కేశనపల్లి, కేశవదాసుపాలెం, చింతల మోరి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో పర్యటించి తమ నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కన్నుపడితే ఎంతమంది అడ్డుపడినా, ఎన్నివేల కుటుంబాలు రోడ్డునపడినా పట్టించుకోడు. రాజోలు తీరంలోకూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. దాదాపు 15వేల దళిత, మత్స్యకార కుటుంబాలు ఆధారపడిన 27వేల ఎకరాల భూములను కేవలం తమ స్వార్థంకోసం బలిపెట్టాలని చూస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులైన జె-గ్యాంగ్ చర్యలను అడ్డుకోవడమే ప్రస్తుతం తీరప్రాంత గ్రామాలకు ఉన్న ఏకైకమార్గం.