- కూటమి ప్రభుత్వంలో కార్మికులకు స్వర్ణయుగమే
- నేతన్నల సంక్షేమంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
- చేనేత, జౌళి, బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యమం త్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకు ని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మేరీస్ స్టెల్లా కాలేజీ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మంత్రి సవిత చేనేత వాకథాన్‌ను ప్రారంభించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, కమిషనర్ జి.రేఖారాణి, ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ కమిషనర్ జి.వాణీమోహన్ తదిత రులు పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరిద్దాం.. చేనేత కళను ప్రోత్సహిద్దామంటూ ర్యాలీలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ చేనేత కార్మికుల కుటుంబసభ్యులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కూటమి ప్రభుత్వ హయాం చేనేతకు స్వర్ణయుగమని ఉద్ఘాటించారు. చేనేత కార్మికుల కష్టాలపై ముఖ్యమం త్రికి పూర్తి అవగాహన ఉందని.. వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం నేతన్నలకు పూర్తి ఆసరాగా నిలిచారని, నేతన్నల సుస్థిర జీవనోపాధికి వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారని వివరించారు. అయితే గత కొన్నేళ్లలో నేతన్నలకు సరైన ఆదాయం లేక, వారి ఉత్పత్తులు కొనేవారు లేక వలసపోయే పరిస్థితులు, ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటుచేసు కున్నాయన్నారు. నిర్వీర్యమైన చేనేతకు మళ్లీ పూర్వవైభవం తెస్తామని.. నేతన్నలను ప్రోత్స హించే క్రమంలో ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు.