- మీ బిడ్డనంటూ ప్రజలను మోసం చేసేందుకు జగన్ కొత్త పల్లవి
- రెండో ఛాన్స్‌కు నో అంటున్న ప్రజలు
- చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కోర్టులు ప్రశ్నించవద్దా?
అమరావతి, చైతన్యరథం: రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు, రైతుల నుండి ఉద్యోగుల వరకు అన్నివర్గాల ప్రజలు సిఎం జగన్‌రెడ్డిని ద్వేషిస్తు న్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్ఛెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అసహ్యించుకుంటున్న ఏకైక సిఎం జగన్‌రెడ్డి అని, ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమని ఆయన అన్నారు. జగన్‌రెడ్డి పరిపాలనపై విసిగిపోయి ఉన్న రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తా యా ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టి బంగాళా ఖాతంలో ఎప్పుడు పడేద్దామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను ఎలా వంచించింది, వారిని ఎలా దోచుకుంది, ఎందుకు ప్రజలందరూ సిఎం జగన్‌రెడ్డిని అసహ్యించుకుంటున్నారో వివరంగా తెలుపుతూ టిడిపి ముద్రించిన 24 పేజీల ఏపీ హేట్స్ జగన్ అనే పుస్తకాన్ని అచ్ఛెన్నాయుడు టిడిపి సీనియర్ నేతలైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గద్దె రామ్మోహనరావు, బొండా ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య, జవహర్, పంచుమర్తి అనురాధ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టాభిరామ్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్ఛెన్నాయుడు మాట్లాడుతూ ‘‘ నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు, ప్రజల అంతరంగానికి అక్షర రూపం ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతులు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అని నినదిస్తు న్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా అన్ని వర్గాలవారు జగన్ రెడ్డి బాధితులే. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడకముందు, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజలు భావించారు. కొత్త రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మాత్రమే గట్టెక్కించగలడని నమ్మి, తెలుగుదేశాన్ని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. ఆనాడు తనను ప్రజలు తిరస్కరించారన్న అక్కసుతో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై విషప్రచారం చేస్తూనే ఉన్నాడు. 2019 ఎన్నికల సమయంలో ప్రజల్ని హామీలతో, మోసపు వాగ్ధానాలతో నమ్మించ డంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ప్రజల్ని వేధిస్తూ, రాష్ట్రాన్నిదోపిడీ చేస్తూనే ఉన్నాడు. తన దోపిడీ, అవినీతిని వాస్తవాల తో ప్రజల ముందు ఉంచుతున్నాడని, వారిలో చైతన్యం వస్తే తనకు, తన ప్రభుత్వానికి సమాధి కడతారని భావించే చేయని నేరానికి చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపాడు. జైల్లో ఉన్నా కూడా చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, టీడీపీపై నింద లేస్తూ ప్రజల్ని ఇంకా మోసగించే ప్రయత్నం చేస్తున్నాడు.