- పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన
- ప్రతిపక్షాల గొంతు నొక్కటం
- బడుగు, బలహీన వర్గాలపై నిరంతర దాడులు
- సహజ వనరులు, రాష్ట్ర సంపద దోపిడి
- పౌరుల గౌరవ జీవనానికి విఘాతం
- పవిత్ర డాక్టర్ అంబేద్కర్ రచిత రాజ్యాంగానికి తూట్లు
భారత రాజ్యాంగం ఒక అత్యంత పవిత్ర గ్రంధం వంటిది. స్వతంత్ర భారత దేశం ఎంచుకున్న ప్రగతి దిశలో వడివడిగా అడుగులు వేయటానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ బాటలు చూపిన ఒక సైద్ధాంతిక కోశం మన రాజ్యాంగం. దీని రచనకు ప్రధాన కారకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. భారతదేశ సామాజిక, ఆర్థిక వైవిధ్యాల నేపథ్యంలో నవ భారతం ఎదుర్కోనున్న సకల సమస్యల సామరస్య పరిష్కారానికి దిశా, నిర్దేశం చేసేందుకు రూపొందించ బడినందున ప్రపంచంలోనే మన రాజ్యాంగం అత్యంత పొడవైనదిగా సంతరించుకుంది.
దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు దాడులు, దోపిడీలకు గురై పరదేశీయుల పాలనలో తన ఉజ్వల వారసత్వాన్ని కోల్పోయి కునారిల్లుతున్న స్థితిలో స్వతం త్ర భారతంలో నవ సమాజ నిర్మాణం కోసం సమత, సమానత్వాల ప్రాతిపదికన ఒక గట్టి నూతన ప్రయత్నా నికి నైతిక, తాత్విక పునాదులు సూచించింది మన రాజ్యాంగం.
డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో పొందుపరచబడిన మన రాజ్యాంగ పీఠికలో భారతావనిని ప్రజాస్వామ్య, సామ్యవాద, మతాతీత దేశంగా పేర్కొన్నారు. దీర్ఘకాలం వివక్ష, అంటరానితనం, అసమానతలు, దోపిడీ పునా దులపైన ఏర్పడ్డ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల స్థానంలో ఆధునిక సమసమాజ సౌధం నిర్మాణానికి రాజ్యాంగం పౌరులందరికి కొన్ని ప్రాథమిక హక్కులు, పరిపాలనా సూత్రాలను పేర్కొంది.
అధికార వికేంద్రీకరణకు విరుగుడుగా శాసన, న్యాయ, పాలనా వ్యవస్థలకు నిర్దిష్ట కర్మక్షేత్రాలను నిర్వ చించి వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించింది. కాల క్రమేణ ఈ మూడు మూల స్తంభాలతోపాటు పత్రికలు, మీడియా ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా అవతరిం చాయి.పాలనలో పారదర్శకత,జవాబుదారీతనం కోసం అధికార యంత్రాంగంపై నియంత్రణను చట్ట సభలకు ఇవ్వటం జరిగింది. ప్రజలఅభీష్టం మేరకు ఏర్పడే శాస నసభలు తమ ఇష్టం వచ్చినట్లు చట్టాలను చేయటాన్ని నియంత్రించేందుకు వాటిని రాజ్యాంగ స్ఫూర్తి కోణంలో పరిశీలించే హక్కు ఉన్నత న్యాయస్థానాలకు ఇవ్వబడిర ది. ఈవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన బాటలో నడి చేందుకు రాజ్యాంగం కట్టుదిట్టమైన నియమాల రూపం లో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అందుకనే డాక్టర్ అం బేద్కర్‌కు అనంత ఖ్యాతి లభించింది.
జగన్ రెడ్డి అనుసరిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగం
జగన్‌రెడ్డి 2019లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రాథేయ పడి అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వామోదమైన అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దోపిడి, హత్య లు,అత్యాచారాలు, విధ్వంసానికి ప్రతీకగా నిలిచిన తన తాత రాజారెడ్డి విలువల ఆధారంగా పాలన కొన సాగిస్తున్నారు. పెత్తందారీ మానసికతతో నవ్యాంధ్రను పాలిస్తూ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి అధోగతిపా లు చేశారు. పేదలను కూడా దోపిడీ సాధకాలుగా మార్చుకున్నారు. బడుగు, బలహీన,అల్పసంఖ్యాక వర్గా ల పట్ల పెత్తందారీ మానసికతకు మూలస్తంభమైన విద్వేషంతో అనునిత్యం వ్యవహరిస్తున్నారు. డాక్టర్ అం బేద్కర్ ప్రతిపాదించిన ‘పౌరులందరూ సమానమే’ అన్న సూత్రానికి పూర్తి విరుద్ధంగా ప్రతి అడుగు వేస్తున్నారు. రాష్ట్ర సహజ వనరులు, సంపద ప్రజలందరికి చెంద వలసి ఉండగా వాటన్నింటిని పూర్తిగా తమ సొంతం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అమలౌతున్న రాజారెడ్డి రాజ్యాంగం రూపు రేఖలను స్థూలంగా పరిశీలిద్దాం.
అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక ఉల్లంఘన
1.భారతదేశం ప్రజాస్వామిక దేశమని రాజ్యంగం చెబితే.. కానేకాదు అంటూ జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నా రు. ప్రజాస్వామ్య విలువలను, ఎన్నికల ప్రక్రియను రాజకీయ విలువలను ప్రహసనంగా మార్చారు. శాసన సభ, శాసన మండలిలను నిర్వీర్యంచేసి తాను చెప్పిందే శాసనమన్నట్లుగా వ్యవహరిస్తునారు. అత్యంత పవిత్ర మైన ఓటు హక్కును చులకన చేసి ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. ఓటర్లకు భారీగా డబ్బులిచ్చి ఎన్నికలు గెలవటమే ప్రజాస్వామ్య మూలసిద్ధాంతమన్నట్లుగా నడుస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన స్థానికసంస్థల ఎన్నిక ల్లో ప్రతిపక్షాల అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయ కుండా దౌర్జన్యాలు చేసి అధికారాన్ని పొందే కుట్రలు చేశారు. ఇదేనా డాక్టర్ అంబేద్కర్ ఆశించింది?
- సామ్యవాద(సోషలిస్టు) ఆర్థిక వ్యవస్థను మన రాజ్యాంగం ప్రతిపాదిస్తే సహజ వనరులు, సంపద సమస్తం తన, తన బినామీల సొంతం చేసుకుని వాటి పై ప్రజలకు ఎటువంటి హక్కు లేకుండా జగన్‌రెడ్డి దోపిడీ చేయటం వాస్తవం కాదా? ఈ దోపిడీ మానసిక తతో ప్రజలు తీవ్రంగా నష్టపోయి, ఆర్థికంగా కుదేలవు తున్నారు. ఇదేనా డాక్టర్ అంబేద్కర్ ఆశించింది?
- మతాతీత భారతాన్ని రాజ్యాంగం ఆశిస్తే జగన్ రెడ్డి ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు.గత నాలు గున్నరేళ్లుగా హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులు, ఆదాయాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు, దోపిడీ లు జరుగుతున్నాయి. పవిత్రమైన తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరగటంపట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల లబ్ధి కోసం ఒక మతానికి, మత మార్పిడులకు ఊతమిస్తున్నారన్న ఆందోళన సర్వ త్రా నెలకొంది. ఇదేనా డాక్టర్ అంబేద్కర్ ఆశించింది?
ఆదేశిక సూత్రాల ఉల్లంఘన
- ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగేలా పాలన సాగించాలని రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలు(డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్) ప్రతి పాది స్తే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నడక అందుకు పూర్తి విరు ద్ధంగా ఉంది. డొల్ల సంక్షేమం,సహజ వనరుల దోపిడి, కుట్ర రాజకీయాలతో ఆయన అన్నివర్గాల ప్రజలను వంచనకు గురి చేస్తూ, అశాంతి సృష్టించడం జగద్విది తం. సహజ వనరుల నిర్వహణను అందరికీ ప్రయోజ నంకలిగేలా వినియోగించవలసి ఉండగా వీట న్నింటిని అస్మదీయుల ఆధీనంలో పూర్తిగాదోపిడి చేస్తూ విస్తృత ప్రజా ప్రయోజనాలకు జగన్‌రెడ్డి విఘాతం కల్పించటం వాస్తవం. ఇదేనా డాక్టర్ అంబేద్కర్ ఆశించింది.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన
నాటి భారతం అసమానతలతో తల్లడిల్లిన నేపథ్యం లో నవభారతంలో సమసమాజ స్థాపన కోసం రాజ్యాం గం ప్రజలందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించ గా జగన్‌రెడ్డి పాలనలో నిర్భీతిగా వాటి ఉల్లంఘన జరుగుతోంది. ఎలా అంటే..
- రాజ్యాంగ అధికరణం 14 పౌరులందరికి ‘సమానత్వ హక్కు’ మరియు ‘చట్టాల ద్వారా సమాన రక్షణ’ ప్రసాదించగా అది వీలు కాదంటూ జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడు. తనవారికో న్యాయం, ఎదుటివారి కో న్యాయం అనేది నానుడిగా మారింది. వ్యవస్థలన్నిం టిని ఎదుటివారిని వేధించటానికి ఉపయోగించటం, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు నిత్య కృత్యమయ్యాయి. ఇదేనా డాక్టర్ అంబేద్కర్ ఆశించింది?
- అధికరణం 19కింద రాజ్యాంగం ప్రతి పౌరుడికి ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కల్పించింది.దీంతోపాటు శాంతీ యుతంగా సమావేశాలు నిర్వహించుకోవటం, ఇష్టమొ చ్చిన వృత్తి, వ్యాపారం చేసే హక్కును కూడా ప్రసాదిం చింది. ఈ హక్కులు రాజారెడ్డి రాజ్యాంగం కింద ఆమో దయోగ్యం కాదు. అందుకనే తనను, తన ప్రభుత్వ నిర్వాకాలను ప్రశ్నించినవారిని ఏదోవిధంగా అరెస్టు చేసి నిర్బంధించటం ఆనవాయితీ అయిపోయింది. చంద్రబాబు, లోకేశ్ మరియు ఇతర ప్రతిపక్ష నాయ కుల సభలు, సమావేశాలు, యాత్రలను అడ్డుకోవటం, చీకటి జీవో నంబర్-1 విడుదల ఈ వైఖరికి నిదర్శ నం. ఇతరులపై దుష్ప్రచారానికి సోషల్ మీడియాను యదేచ్ఛగా వాడుకుంటూ.. అదే మాధ్యమాల్లో తమను, తమ ప్రభుత్వాన్ని విమర్శించటంపై వెనువెంటనే కేసు లు పెట్టటం, పోలీసులు వాలిపోయి అక్రమంగా అరెస్టు చేయటం రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
తమ ప్రభుత్వ అవినీతి, అరాచకాలు, అక్రమాలు, దోపిడిని ఎత్తిచూపుతున్నందునే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అక్రమంగా జైలుపాలు చేయటం ఈ కోవలోకే వస్తుంది. ఇదేనా డాక్టర్ అంబేద్కర్ ఆశించింది?
- రాజ్యాంగ అధికరణ 21 మేరకు ప్రతి పౌరునికి జీవన హక్కు కలిగింది. చట్టాల్లో పొందుపరచిన విధా నాల మేరకు తప్ప అట్టి జీవన హక్కును హరించే అధి కారం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఏమాత్రం లేదు. అయితే వాస్తవంలో దీనికి పూర్తి విరుద్ధంగా జరగటం ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఎందరో తెదేపా కార్యకర్తలు నిర్దాక్షిణ్యంగా హత్య చేయబడ్డారు. భారీ సంఖ్యలో దళిత, గిరిజన, అల్ప సంఖ్యాక, వెనుక బడిన తరగతుల వారుకూడా కక్ష పూరిత దాడులకు బలయ్యారు. ఇదేనా డాక్టర్ అంబేద్కర్ ఆశించింది?
వ్యవస్థల విధ్వంసం
- శాసన, న్యాయ, పాలనా వ్యవస్థలతో జగన్‌రెడ్డి చెలగాటమాడుతూ,వాటి గౌరవానికి భంగం కలిగిస్తు న్నారు.తన ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థలన్నీ నడు రోచుకోవాలని ఆయన అభిలాష. ప్రతికూల తీర్పులి చ్చిన న్యాయమూర్తులపై మీడియాలో దాడులు, చట్ట సభల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కటం, పోలీసు మరియు పాలనా యంత్రాంగాలను తన ప్రయోజనాలకు అను గుణంగా దుర్వినియోగం చేస్తూ వ్యవస్థలన్నింటిని విధ్వ ంసం చేశారు. ఇదేనా డాక్టర్ అంబేద్కర్ ఆశించింది?
ఈ విధంగా మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన పవిత్ర రాజ్యాంగానికి తిలోదకాలిచ్చి.. తన తాత రాజారెడ్డి వేసిన బాటలో నడుస్తూ అన్ని వర్గా ల ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, హక్కులను నిత్యం కబళిస్తూ వారి గౌరవప్రదమైన జీవన హక్కును కాలరా స్తున్నందునే.. ఉయ్ హేట్ జగన్ అంటున్నారు నవ్యాంధ్ర ప్రజలు.