- ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి
- సీఎం చంద్రబాబు చిరకాల స్వప్నం
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు.
అమరావతి (చైతన్యరథం) : నదులు అనుసంధానంతో ప్రతి ఎకరానికి నీరిచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చనేది ముఖ్యమంత్రి చంద్రబాబు చిరకాల స్వప్నమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి సుజల స్రవంతి పథకంపై శుక్రవారం అసెంబ్లీలో అనకాపల్లి శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి రామానాయుడు సమాధానమిచ్చారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రాకు 63.20 టీఎంసీల గోదావరి వరద నీటిని తరలించడం ద్వారా, ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించాలనేది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, జిల్లాలు లబ్దిపొందుతాయని అన్నారు. దీని కోసం 2017లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం మొదటి దశలో పది టీఎంసీల గోదావరి జలాలు తరలించడం ద్వారా 1.30లక్షల ఎకరాలకు నీరందించేలా 2022 కోటతోు టెండర్లు పిలిచి,ఎర్త్ వర్క్, సర్వేపనులు కూడా చేపట్టామన్నారు.
తరువాత 2019-24 వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టు కోసం అయిదు రూపాయలు కూడా ఖర్చుపెట్టకుండా, ప్రాజెక్టును గాలికి వదిలేశారని విమర్శించారు. రెండో దశ అంటూ మరో 15028 కోట్లతో మొత్తంగా రెండు దశల్లో 17,050 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చారేని కానీ ఒక్క రూపాయి పని కూడా చేయలేదని అన్నారు. మొదటి దశలో పెదపూడి రిజర్వాయరు, ంండో దశలో భూదేవి, వీరనారాయణపురం, తాటిపూడి రిజర్వాయర్లు నిర్మించడంతో పాటు, మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ సిస్టం ఉందన్నారు. 38వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ సవాళ్ళు అన్నీ అధిగమించి ఈ పనులు అన్నీ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.
గోదావరి వరద నీటిని పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు పంపిణీ చేసేలా ఆర్దిక ఇబ్బందులు ఉన్నా,ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1600 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.ఈ మేరకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే నెలలోనే పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది 2025 జూలై కల్లా గోదావరి జలాలను ఉత్తరాంద్రకు తరలిస్తామని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం చంద్రబాబు లక్ష్యమని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిగా పోలవరం పర్యటన చేపట్టి, ఆ తరువాత వెంటనే పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారని చెప్పారు. ఎడమ కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా గోదావరి జలాలను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథóకానికి తరలించడం ద్వారా, ఉత్తరాంధ్రకు సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. తద్వారా, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు . గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందించేలా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడిరచారు.