- భారత్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలి
- అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించాలి
- ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి(చైతన్యరథం): ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎనఆరఐ సాధి కారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొ న్నారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయా దేశాల్లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ సంయమనం పాటించాలని, త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులందరూ నమోదు చేసుకోవాలని కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, మీడియా ద్వారా సరైన సమాచా రం తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందు బాటులో ఉండాలని సూచించారు.
గగనతలంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా విమానాల రవాణా ఆలస్యం అవుతోందని, త్వరలోనే విమానయాన సేవలు పునరుద్ధరిస్తామని మంత్రి ఆశా భావం వ్యక్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇస్తున్న ఆదేశాలు, సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రభావిత దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులందరినీ కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులలో ఏపీ ఎన్నార్టీ హెల్ప్‌లైన్ నెంబర్లు 918500027678, 910863 2340678 నెంబర్లకు కాల్ చేయాలని, మరింత సమాచారం కోసం https://apnrts.ap.gov.in/ వెబ్ సైట్‌ను సం ప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా స్థానిక అధికారులు, అధికారిక మీడియా ప్రకటనల సమాచారం మాత్రమే ఫాలో కావాలని కోరారు.













