అమరావతి: జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అభివృద్ధిని అటకెక్కించారని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి వృత్తులు, వ్యాపా రాలు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టారని ధ్వజ మెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వందలాది వృత్తుల్లోని ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ అంధకారం కావడం తధ్యమన్నారు. ప్రజలపై భారాలు, నిలిచిపోయిన అభివృద్ధితో నైజీరియా, జింబాంబ్వే కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని పేర్కొన్నారు.
తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వ అప్పులు అసాధారణంగా పెరిగాయని తెలిపారు. మూల ధనవ్యయం మాత్రం దారుణంగా తగ్గిపోయిందన్నారు.రెవెన్యూ పడిపోయిందని, జీ.ఎస్. డి.పి., తలసరి ఆదాయం సింగిల్ డిజిట్‌కు దిగజారి పోయినట్లు వివరించారు. ఓపెన్ బారోయింగ్స్ 130 శాతంపైగా పెరిగాయని తెలిపారు.ఆఫ్ బడ్జెట్‌బారో యింగ్స్ రూ.4లక్షల కోట్లవరకు చేసినట్లుపేర్కొన్నారు.
బడ్జెట్‌లో చూపించని అప్పులు
బడ్జెట్‌లో అప్పులు చూపించకుండా ప్రజల్నిమోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలను 15వ ఆర్థిక సంఘం తూర్పారబట్టిందన్నారు. మూడున్నర సంవత్స రాల్లో రూ.8లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని, అయినా ప్రజల ఆదాయం పెరగలేదని, అభివృద్ధీ జర గలేదని ఆందోళన వ్యక్తంచేశారు.ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయం ఎటు పోతోందో కూడా లెక్కల్లేవన్నారు. ప్రభుత్వం ఎడా పెడా చేస్తున్న అప్పులకు, వచ్చే ఆదాయానికి సంబంధం లేకుండా పోయిందని తెలిపారు. ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పుల కారణంగా ప్రస్తుతం సంవత్సరానికి రూ.50 వేల కోట్లకు పైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోందన్నారు. భవిష్యత్తులో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు చేరే ప్రమాద ముందని పేర్కొన్నారు. లక్ష కోట్లు వడ్డీలే చెల్లిస్తే అభి వృద్ధి ఎలా సాధ్యమవుతుందో ముఖ్యమంత్రే సమాధా నం చెప్పాలన్నారు.
ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం రాష్ట్ర అప్పులు జి.ఎస్.డి.పి.లో 35 శాతం మించకూడదని, అయితే, వైసీపీ ప్రభుత్వం 2021మార్చి నాటికి చేసిన అప్పులు 44.04 శాతానికి చేరుకున్నట్లు వివరించారు. అప్పు లు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడమంటే రాష్ట్ర ఆర్థిక స్థితి అధ్వాన్నంగా ఉందని అర్థమవుతోందన్నా రు. తీసుకున్న అప్పుల్లో దాదాపు 81శాతం సొమ్మును కేవలం రెవెన్యూఖర్చుల కోసం వినియోగించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. మూడున్నరేళ్లలో రాష్ట్ర తలసరి అప్పు రూ.67 వేలకు చేరిందన్నారు. 2020-21ఆర్థిక సంవత్సరంలో 331 రోజులు అప్పులు చేయాల్సి రావడం రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. రిజర్వు బ్యాం కువద్ద రాష్ట్రం ఉంచాల్సిన కనీస నగదు నిల్వ రూ.1.94 కోట్లు 330 రోజులకు పైగా మెయింటైన్ చేయలేకపోయారని తెలిపారు.
రాష్ట్రంలో పెరిగిన ద్రవ్యోల్బణం
రాష్ట్రం గతంలో ఎన్నడూ ఎదుర్కోని స్థాయిలో ద్రవ్యోల్బణం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. పండగ పూటకూడా పస్తులుండే పరిస్థితి నెలకొందన్నారు.ప్రజ ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ఆర్థిక అసమాన తలు తీవ్రమయ్యాయని తెలిపారు. ప్రజల అప్పులు పెరిగాయని, పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, రాష్ట్రం అతలాకుతలం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, పెట్టుబడుల ఆక ర్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు లోటు లేకుం డా ఉండేదని, స్వయం ఉపాధికి ప్రత్యేక ప్రోత్సాహకా లు అందించినట్లు తెలిపారు.డ్వాక్రా వ్యవస్థకు రూ.10 లక్షల వరకు రుణాలు అందడంతో సుమారు కోటి మంది మహిళలు స్వయం ఉపాధి సాధించేలా ముంద డుగులు వేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిం చే ప్రోత్సాహకాలకు రాష్ట్ర వాటా కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాల్లోని పేదయువత,మహిళలకు ఉపా ధి అవకాశాలు మెండుగా కల్పించినట్లు పేర్కొన్నారు.
పెరిగిన పెట్టుబడుల ఉపసంహరణలు
ప్రస్తుతం కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రశ్నార్థకమైం దన్నారు. ఉన్న పరిశ్రమలను కమిషన్ల కోసం బెదిరి స్తుండడంతో పెట్టుబడులు ఉపసంహరణలు పెరిగిన ట్లు తెలిపారు. విశాఖలో ఏర్పాటు కావాల్సిన లులూ, అదానీ డేటా సెంటర్, ప్రకాశం జిల్లా నుంచి ఏసియ న్ పల్ప్ పేపర్ మిల్, కియా అనుబంధ సంస్థలు సహా ఎన్నో ప్రఖ్యాత కంపెనీల ద్వారా దక్కాల్సిన ఉపాధి రాష్ట్ర ప్రజలకు దూరం చేశారని నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ఉద్యోగ విప్లవం సాధించవచ్చన్న హామీని గాలికి వదిలేశారని మండి పడ్డారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ వంటి సంస్థల విషయంలో మాట తప్పి మడమ తిప్పి ప్రజ ల్ని మోసం చేసినట్లు విమర్శించారు.
ఆదాయం పెంచుకోవడం, సంపద సృష్టించుకోవ డం ద్వారానే భవిష్యత్తుకు భరోసా అనే కనీస సిద్ధాం తాన్ని పక్కన పెట్టి అప్పులు పెంచు కుంటూ పోతున్నా రన్నారు. సంపద సృష్టి గాలికి వదిలేసి విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, ఆర్టీసీ స్థలాలు, మార్కెట్లు, ప్రభుత్వ భవనాలు వంటి విలు వైన ప్రభుత్వ ఆస్తుల్ని సొంత వారికి కట్టబెట్టి జేబుల్లో వేసుకుంటున్నట్లు ఆరోపించారు. ఇటువంటి విధానా లు రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారబోతు న్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని యన మల రామకృష్ణుడు హితవు పలికారు.