మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రజావేదిక లో భాగంగా ఈ నెల 2న సోమవారం నుంచి 14వ తేదీ వరకు అర్జీల స్వీకరణ కార్యక్ర మం జరుగుతుంది. పాల్గొనే మంత్రులు, నాయకుల వివరాలను కార్యాలయం వెల్లడిర చింది. ప్రజలు, పార్టీ శ్రేణులకు వారు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపింది. ప్రజావేదికలో పాల్గొనే మంత్రులు, నాయకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 2న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ కె.కె.చౌదరి, 3న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీటీడీ బోర్డ్ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, ఏపీ శెట్టి బలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుటిపూడి సత్తిబాబు, 4న ఎమ్మెల్యే బాదేటి రాధాకృష్ణ, ఏపీ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొషన్ చైర్మన్ కిడారి శ్రావణ్, పర్యావరణ నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, 5న హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ దువ్వారపు రామారా వు, ఏపీ ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, 6న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బి.టి.నాయుడు, 7న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఏపీ గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, 9న కార్మిక సంక్షేమ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ పార్లమెంట్ ప్రెసిడెంట్ మల్లెల రాజ శేఖర్ గౌడ, 10న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఏఎంయుడీఏ చైర్మన్ స్వామినాయుడు, 11న పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభాభారతి, ఏపీటీఎస్‌ఎల్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, 12న రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, 13న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీఎస్‌ఏఎం చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, 14న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఏపీ కుర్బ/కురుమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మన్వి దేవేంద్రప్ప పాల్గొని అర్జీలు స్వీకరిస్తారు.