- క్లీన్ ఎనర్జీ కంపెనీలకు లీజుతో కేటాయింపు
- ఏడాదికి రూ.31 వేలు..ప్రతి రెండేళ్లకు పెంపు
- 7.5 లక్షల మంది యువతకు ఉపాధి
- అసైనీలకు నికరమైన, అదనపు ఆదాయం
- రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి తో పాటు అసైనీదారులకు స్థిరమైన, అదనపు ఆదాయం కల్పించడం కోసం అసైన్డ్ భూముల చట్టానికి సవరణ తీసుకొస్తున్నట్టు రెవె న్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన చట్ట సవరణ ప్రతిపాదనను శాసన సభలో ప్రవేశ పెట్టగా సభ్యులు ఆమోదించారు. రాష్ట్రంలో పరిశ్ర మల ఏర్పాటుకు, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు పునరు త్పాదక విద్యుత్ పరిశ్రమల(గ్రీన్ ఎనర్జీ) ఏర్పాటు చాలా కీలక మన్నారు. దేశంలోనే మొదటిసారిగా అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ప్రారంభించామని, అదేవిధంగా కాకినాడలో గ్రీన్ అమ్మోని యా ప్లాంటును కూడా ప్రారంభించామని చెప్పారు. పునరుత్పాదక విద్యుత్(క్లీన్ ఎనర్జీ) ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ అయితే దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, దీంతో మొత్తం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు.
క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలంటే కొన్ని చోట్ల అసైన్డ్ భూము లు అవసరమని, అందుకే లీజు ప్రాతిపదికన ఆ భూములు తీసు కునేందుకు చట్ట సవరణ చేస్తున్నట్లు చెప్పారు. 20 లక్షల మంది ఉపాధి కల్పించాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యం నేరవేరడంలో ఈ చట్ట సవరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలపై ఉన్న విద్యుత్ ఛార్జీల భారాన్ని మరింత తగ్గించడానికి కూడా ఈ చట్ట సవరణ ఉపయోగపడుతుంది. ఇప్పటికే యూనిట్‌పై 13 పైసలు తగ్గించాం. భవిష్యత్తులో మరింత తగ్గిస్తామన్నారు. క్లీన్ ఎనర్జీ ఉత్పాదన ఎంత ఎక్కువ పెరిగితే విద్యుత్ ఉత్పత్తిపై పెట్టే ఖర్చు అంత తక్కువ అవుతుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా నెట్ జీరో కార్బన్ స్థాయికి చేరుకోవాలన్న లక్ష్య సాధనకు ఈ చట్ట సవరణ దోహద బడుతుందని తెలిపారు.
సమ్మతితోనే భూములు లీజుకు తీసుకుంటాం
అసైనీదారుల పూర్తి సమ్మతితో వారి అంగీకరించిన తర్వాతే వారి వద్ద నుంచి భూములు లీజుకు తీసుకుంటామని తెలిపారు. ఈ భూములు లీజుకు ఇవ్వడం ద్వారా ఎకరానికి 31 వేల రూపా యల నికర ఆదాయం అసైనీదారులకు లభిస్తుందని, ఏడాదంతా వారి పోలంలో కష్టపడి పని చేసినా కచ్చితంగా ఆదాయం వస్తుం దో రాదో తెలియని పరిస్థితని, ఒకవేళ ఏదైనా కారణం రీత్యా పంట నష్టపోతే పెట్టుబడి నష్టమే కాకుండా వారి శ్రమ విలువ కూడా కొల్పాతారని పేర్కొన్నారు. అయితే వారి భూములను లీజుకు ఇవ్వడం ద్వారా లీజు ద్వారా నికరమైన ఆదాయం తో పాటు వారు ఏడాది పాటు శ్రమ చేసుకోవడం ద్వారా కూడా నికరమైన ఆదాయం లభిస్తుందన్నారు. మరోవైపు ప్రతి రెండేళ్ల ఒకసారి ఐదు శాతం లీజు పెంచడం జరుగుతుందన్నరు. అసైన్డ్ భూముల్లో చాలా చోట్ల బంజరు భూములు ఉన్నాయని, వీటిని లీజుకు ఇవ్వడం ద్వారా అసైనీలకు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు.














