- సచివాలయాల పేరు మారుస్తూ బిల్లు
- అసెంబ్లీలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
అమరావతి(చైతన్యరథం): ఏపీ శాసనసభలో గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు. గురువారం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపె ట్టారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ విజన్‌కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేశామని మంత్రి వివరించారు. అందుకు తగినట్లుగా సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో గవర్నర్ గెజిట్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేశారని తెలిపిన మంత్రి..సచివాలయాలు చాలా చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నా యని, ప్రభుత్వ భవనాలున్న చోటికి వాటిని మారుస్తున్నామని తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తామని, అన్ని విభాగాల్లో సిబ్బందికి పదోన్నతులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని గవర్నింగ్ బాడీగా నియమిం చామని పేర్కొన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఈ చట్ట సవరణ ఉపయో గపడుతుం దని తెలిపారు. స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల పేర్లు ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తాయని చెకప్పారు. రాయలసీమలో ఉద్యా న పంటలు ఎక్కువగా ఉండటంతో అక్కడి సిబ్బందిలో హార్టికల్చర్ నిపుణులను నియమించవచ్చని సూచించారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి గవర్నింగ్ బాడీ ఎవరనే విషయంలో స్పష్టత లేదని.. దీనిపై చట్ట సవరణ ద్వారా స్పష్టత ఇవ్వాలని కోరారు.













