బ గ్రూప్`1 మెయిన్స్ మూల్యాంకనంలో అడ్డదారులు
బ హైకోర్టునూ తప్పుదారి పట్టించారు
బ రెండుసార్లు మూల్యాంకనం జరిపించి, కావాల్సినవారికి పోస్టులు కట్టబెట్టారు
బ హైకోర్టు తాజా తీర్పు ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి చెంపపెట్టు
బ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు విమర్శ
అమరావతి (చైతన్యరథం): నిరుద్యోగుల జీవితాలతో ఏపీపీఎస్సీ ఆటలాడుతోందని టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభ్రదుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు విమర్శించారు. 2018లో వచ్చిన గ్రూప్ `1 నోటిఫికేషన్‌లోని పోస్టుల వ్యవహారంలో హైకోర్టును కూడా తప్పుదారి పట్టించి, రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం (చేతితో పేపర్లు దిద్దటం) జరిపించి, తమకు కావాల్సివారికి మేలు చేసేలా వ్యవహరించిందని ఆరోపించారు. అభ్యర్థుల జవాబు పత్రాల్లో ఓఎంఆర్ షీట్లను కూడా తారుమారు చేసిందన్నారు. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా, 2018, గ్రూప్`1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసి, తిరిగి పరీక్ష నిర్వహించాలని బుధవారం తీర్పు ఇచ్చిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీపీఎస్సీ తీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిరంజీవిరావు మాట్లాడుతూ 2018 డిసెంబర్‌లో 162 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసిందన్నారు. ఇందులో 30 వరకు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, 28 వరకు డీఎస్పీ వంటి కీలక ఉద్యోగాలు ఉన్నాయన్నారు. 2019 మేలో ప్రిలిమ్స్ జరిగాయి. తరువాత మెయిన్స్‌కు సంబంధించి, 2020 డిసెంబర్‌లో డిజిటల్ మూల్యాంకనం చేపట్టి 2021 ఏప్రిల్‌లో మెయిన్స్ ఫలితాలను విడుదల చేశారు. దీనిపై కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో నోటిఫికేషన్‌లో ఎక్కడా డిజిటల్ మూల్యాంకనం అనే పదం లేదు కాబట్టి డిజిటల్‌గా మూల్యాంకనం చేయ టం తగదని హైకోర్టు జడ్జి డివివి సోయాజులు 2021 అక్టోబర్‌లో తీర్పు ఇచ్చి మూడు నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించా రు. దీనిపై ఏపీపీఎస్సీగానీ, అభ్యర్థులుగానీ ఎటు వంటి అప్పీలుకు వెళ్లలేదని చిరంజీవిరావు చెప్పారు.
రెండుసార్లు మూల్యాంకనం
2021 డిసెంబర్ 5న మ్యాన్యువల్ మూల్యాం కనం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆన్సర్ పేపర్లు రవాణా చేసేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఏపీపీఎస్సీ అధికారులు పోలీసు ఉన్నతాధి కారులకు లేఖ కూడా రాశారు. 2022 ఫిబ్రవరిలో మూల్యాంకనం పూర్తవుతుందని, ఆ తరువాత ఏర్పా ట్లకు సంబంధించి ఏపీపీఎస్సీ చర్యలు తీసుకుంటు న్నట్లు ఆ లేఖలో తెలిపారు. ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటిస్తున్నట్లు సాక్షి దినపత్రికలో వార్త కూడా వచ్చిం ది. అయితే.. ఆ మూల్యాంకన ఫలితాలను ఏపీపీఎస్సీ తొక్కిపెట్టి, మరోసారి మూల్యాంకనం చేయించింది. అసలు మాన్యువల్ మూల్యాంకనం 2022, మార్చి 25న ప్రారంభమైనట్లు ఏపీపీఎస్సీ అధికారులు దాఖ లు చేసిన అఫిడవిట్‌లో తెలియజేసి హైకోర్టును తప్పు దోవ పట్టించారు. 2022 మేలో మెయిన్స్ ఫలితాలు ప్రకటించి, జులైలో ఇంటర్యూలు నిర్వహించారు. ఆగ స్టులో ఎంపికైనఅభ్యర్థుల తుదిజాబితా ప్రకటించారు. తమకు కావాల్సినవారికి కీలకపోస్టులు కట్ట బెట్టారు. దీనిలో ఎంపికైనవారు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆర్వోలుగా పనిచేస్తున్నారని చిరంజీవిరావు తెలిపారు.
ఎన్నో సందేహాలు
అయితే 2021 డిసెంబర్, 2022 ఫిబ్రవరి మధ్య నే మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలతో అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. మెయిన్స్ పరీక్షను రద్దు చేసి అభ్యర్థులకు రెండు నెలలు సమయం ఇచ్చి ఆరు నెలల్లో తిరిగి మెయిన్స్ పరీక్ష ప్రక్రియను పూర్తి చేయాలని బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీపీఎస్సీ తీరుపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయని చిరంజీవిరావు అన్నారు.
1. మూడు నెలల్లో మాన్యువల్ మూల్యాంకనం పూర్తి చేయాలని 2021, అక్టోబర్‌లో హైకోర్టు తీర్పు ఇస్తే, 2022 మార్చిలో మూల్యాంకనం ప్రారంభమైనట్లు అఫిడవిట్‌లో తెలియజేయడం కోర్టు ధిక్కారం కాదా?
2. 2021 డిసెంబర్ నుండి 2022 ఫిబ్రవరి వరకు మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు స్పష్టమైన, లిఖితపూర్వక ఆధారాలున్నాయి. అయితే.. ఆ మెయిన్స్ ఫలితాలను ఎందుకు తొక్కిపెట్టారు?
3. జవాబు పత్రాల్లో పాత ఓఎంఆర్ షీట్ చించేసి.. కొత్తగా మరో ఓఎంఆర్ షీట్‌ను ఎందుకు పిన్ చేయాల్సి వచ్చింది?
4. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని, ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రభుత్వం ఎందుకు స్పందించింది?
5. అసలు ఈ కేసుకు, ప్రభుత్వానికి సంబంధమేమిటి?
6. తమ అనుయాయులను ఎన్నికల ఆర్‌ఓలుగా నియమించుకొని తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో గెలవడమే లక్ష్యమా?
7. ఒక రాజ్యంగబద్ధమైన సంస్థపై ప్రభుత్వ పెత్తనమేంటి?
8. నిజంగా కష్టపడి మెయిన్స్ రాసిన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ న్యాయం చేస్తుందా?
9. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు, ఇంటర్యూ ఫలితాలు గతంలో అధికారికంగా ఏపీపీఎస్సీ ప్రకటించేంది. ఇప్పుడు ప్రకటించకపోవడం వెనుక మర్మమేమిటి?
ఇలా ఎన్నో ప్రశ్నలు లక్షలాది ఉద్యోగార్థుల నుంచి వస్తున్నాయి. ఏపీపీఎస్సీపై విద్యార్థులకు, ఉద్యోగార్థు లకు పూర్తిగా నమ్మకం పోతోంది. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పారదర్శకంగా పనిచేసి ఉద్యోగార్థులకు నమ్మ కం కలిగించాల్సిన బాధ్యత ఏపీపీఎస్సీపై ఉంది. పక్కన ఉన్న తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ అసమర్థ పనితీరువల్ల ప్రభుత్వమే కూలిపోయింది. ఇక్కడ ఏపీపీఎస్సీ అసమర్థ పనితీరు వల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు అప్పులపాలై ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయి నిరాశ, నిస్ప్రహలకు లోనవుతున్నారని చిరంజీవిరావు అన్నారు.