- అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోంది?
- వైసీసీ నేతలు, మంత్రులు పోలీసులను అవమానించినప్పుడు ఏమైపోయారు?
- సీఐడీ చీఫ్ సునీల్ అరాచకంపై ఎందుకు నోరెత్తలేదు?
- పోలీస్ సంఘాన్ని ప్రశ్నించిన టీడీపీ నేత వర్ల రామయ్య
అమరావతి : వైసిపి నేతల బూతులు ఎస్పీ బాలు పాటలా? అధికారపార్టీ నేతలు బూతుపురాణం వల్లె వేసినప్పుడు లేవని నోరు, ప్రతిపక్షం నోరుజారితే, దాన్ని ప్రతిపక్ష నేత ఖండిరచిన తర్వాత లేవడం వెనుక ఎవరున్నారు అని ఆంధ్రప్రదేశ్ పోలీసు సంక్షేమసంఘం నేతలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నిం చారు. మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన విలేకరులసమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనమాటలు యథాతథంగా… చట్టా నికి కట్టుబడి ఉన్నామన్న అసోసియేషన్ పెద్దలు, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ పై నోరు ఎందుకు మెదపలేదు. చట్టం ప్రకారమే పని చేస్తామని, రాజకీయ ఒత్తిళ్లకుతలొగ్గి పనిచేయ లేమని తీర్మానం చేసి, దాన్ని ముఖ్యమంత్రికి పంపే ధైర్యం ఉందా?.పోలీస్ అధికారులకు ఇబ్బంది కలిగి నప్పు డు,పోలీసుల సంక్షేమంపై స్పందించాల్సిన రాష్ట్రపోలీస్ అధికారులసంఘం,అధికారపార్టీకి నష్టంకలిగి నప్పుడే స్పందించడం చూస్తుంటే జగన్‌రెడ్డి ప్రభుత్వా న్ని కాపాడటానికి పడుతున్న తాపత్రయం కొట్టొచ్చిన ట్లు కనిపిస్తోంది.
రాజకీయాల్లో తలదూర్చి బలిపశువులు కావొద్దు పోలీసుల సంక్షేమం గురించి, వారి సాధకబాధకాల గురించి మాట్లాడాల్సిన అసోసియేషన్‌కు, రాజకీయా లెందుకు? రాజకీయాలు మేం చూసుకుంటాం. పోలీ సుల సంక్షేమాన్ని మీరుచూసుకోండని సదరు సంఘం పెద్దలకు సూచిస్తున్నాం. మాపార్టీ నాయకుడు చెంగల్రాయుడు తన ప్రాంతం లో కొంతమంది పోలీస్ అధికారులుపెడుతున్న ఇబ్బం దులు భరించలేక, కడుపు మండి ఒక మాట మాపార్టీ అంతర్గతసమావేశంలో తూలితే,అధ్యక్షస్థానంలో ఉన్న చంద్రబాబు దాన్ని వెంటనే ఖండిరచారు. పోలీస్ అధి కారులకు ఇబ్బంది కలిగినప్పుడు,పోలీసులకు సమస్య లు ఉన్నప్పుడు వాటిపై స్పందించడానికే రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఏర్పాటైంది. మాపార్టీ నేత చెంగ ల్రాయుడి వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు వెం టనే స్పందించి,ఆయన్ని మందలించారు. దీనిపై పోలీ స్సంఘం రాజకీయం చేయడమేంటి? రాజకీయాల్లో ని లోటుపాట్లు మీకు తెలియవు. ఐపీస్ అధికారుల సంఘం ఎందుకు స్పందించలేదు? అధికారం మారిన ప్పుడు మిమ్మల్ని బలిపశువుల్ని చేస్తారు.ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బలిపశువులుకావొద్దని సూచిస్తున్నాం.
ప్రకాష్‌కు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడున్నారు?
ప్రకాష్ అనే కానిస్టేబుల్ పోలీస్ శాఖకు, సిబ్బంది కి రావాల్సిన వాటిపై ముఖ్యమంత్రికి విన్నవిస్తే, అత న్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఆనాడు అతనికి జరిగిన అన్యాయంపై పెగలని పోలీస్ అధికారుల సం ఘం నోరు, ఇప్పుడెందుకు పెగిలింది? చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పోలీస్‌శాఖ అధీనంలో ఉన్న స్థలాన్ని, వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఇస్తే, సంఘం ఎందు కు నోరెత్తలేదు? మీ పోలీసులు కొజ్జాలు అని చిత్తూరు లో ఆమంచి కృష్ణమోహన్ అన్నప్పుడు పోలీస్ అసోస యేషన్ నోరు ఏమైంది? అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు ఈడ్చుకురాలేదేం?
సీఐడీ చీఫ్ పై నోరెత్తలేదు ఎందుకు?
చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ, అర్థరాత్రి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై పోలీస్ సంఘం నోరు పెగలదేం? సీఐడీ చీఫ్ సునీ ల్‌కుమార్ చట్టబద్దంగా వ్యవహరించడంలేదని పోలీస్ అసోసియేషన్ ఎందుకు అనలేకపోతోంది? చట్టానికి కట్టుబడి ఉన్నామంటున్న అసోసియేషన్ పెద్దలు, సీఐ డీ విభాగం అరాచకాలపై నోరు కుట్టేసుకున్నారా? 65 ఏళ్ల రంగనాయకమ్మను పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్లినప్పు డు అసోసియేషన్ పెద్దలైన వారినోరు పెగల్లేదేం? 75 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుని అర్థరాత్రి అరెస్ట్‌చేసి, పోలీసులు బరబరా స్టేషన్‌కు ఈ డ్చుకెళ్లినప్పుడు పోలీస్సంఘం పెద్దలనోరుపెగల్లేదేం? అధికారపార్టీకి, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే పోలీస్అసోసియేషన్ ఇప్పుడు బయట కు వచ్చిందా?అందుకే పోలీస్ అధికారుల సంఘం నోరు ఇప్పుడు పెగులుతుందా?మాజీ మంత్రి అచ్చె న్నాయుడు శస్త్రచికిత్సచేయించుకొని ఇంటిలో ఉంటే, అరెస్ట్ పేరుతో 10గంటలు డొక్కు వ్యానులో తిప్పిన ప్పుడు పోలీస్ అధికారుల సంఘం నోరు పెగల్లే దేం? ఆరుగురు దళితరైతులపై ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టి, చేతుల కు బేడీలువేసినప్పుడు పెగలని నోరు ఇప్పుడుం దుకు పెగులుతోంది? ‘‘చట్టవ్యతిరేక పనులు మేం చేయం’’ అని మీసంఘం ఏనాడైనా ప్రభుత్వానికి చెప్పిందా?
పోలీసులకు రావాల్సిన వాటిపై పోరాడండి
పోలీసుల సెలవుల గురించి, సెలవుల్ని నగదుగా మార్చుకోవడం గురించి, యూనిఫామ్ అలవెన్సుల గురించి, ఆగిపోయిన జీపీఎఫ్ నిధుల గురించి పెగల ని నోరు ఇప్పుడే ఎందుకుపెగులుతోంది?ఎంత మంది డీఎస్పీలు, సీఐలు వీఆర్‌లో ఉన్నారో అసోసియేషన్ పెద్దలకు తెలియదా?దాని గురించి మాట్లాడరేం? ఒకే కులానికి పోస్టింగ్‌లు ఇస్తూ, 33మంది రెడ్లకే ప్రాధా న్యత ఇస్తే, అసోసియేషన్ నోరు తెరవలేదేం? చట్టాని కి కట్టుబానిసలైతే స్పందించాలి కదా? మిమ్మల్ని బలి పశువుల్ని చేయడానికే అధికారపార్టీ కాగితాలిచ్చి మరీ మీతో మాట్లాడిస్తోంది.
చట్టప్రకారం పనిచేస్తామని తీర్మానం చేయగలరా?
పోలీసులు ఒక వైసీపీ కార్పొరేటర్ని అరెస్ట్ చేసి, స్టేషన్లో పెట్టే స్థితిలోఉన్నారా? పోలీస్ అధికారులం దరూ చట్టప్రకారమే పనిచేయాలనే తీర్మానం చేసే ధైర్యం పోలీస్ అసోసియేషన్‌కు ఉందా? తీర్మాన ప్రతు లను డీజీపీకి,సునీల్‌కుమార్‌కు పంపించగలరా? సీఐ డీ చేసే అరెస్ట్‌లపై అసోసియేషన్ పెద్దలు ఎందుకు మాట్లాడరు? అర్థరాత్రిళ్లు అరెస్ట్ చేయడమేంటి? పోలీ స్ అసోసియేషన్ ఇప్పటికైనా మేల్కొని, సాటి సభ్యుల సంక్షేమానికి కట్టుబడాలి.చట్టప్రకారమే పోలీసులుపని చేయాలని తీర్మానంచేసి, దానికే కట్టుబడి ఉండాలని వర్ల రామయ్య డిమాండ్‌చేశారు.
పోలీసులపై అధికార పక్షం దాడి, దూషణలు మీకు కనబడలేదా?
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే సీఐ చొక్కా పట్టు కున్నప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఎందుకు నోరెత్త లేదు? కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి పోలీ సులగు.. పగలగొడతా అన్నప్పుడు నోరెత్తలేదేం?వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి, సీఐని పట్టుకొని ‘‘నా కాళ్లు పట్టుకుంటే నీకు పోస్టింగ్ ఇచ్చాను’’ అన్నప్పుడు పోలీస్ అసోసి యేషన్ నోరుఎందుకు పెగల్లేదు? అధికారపార్టీ ఎమ్మెల్యే సాక్షాత్తూ ఎస్పీని ‘‘నీ అంతుచూస్తా,నీ బతుకేంటో తేలుస్తా, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ వా? కాపీ కొట్టి వచ్చా వా’’అంటే అసోసియేషన్ నోరు పెగల్లేదేం? ఆనాడు అసోసి యేషన్ మూగబోయిందా? అధికారపార్టీ ఎంపీ కృష్ణలంక స్టేషన్‌లోని హెడ్‌కానిస్టేబుల్‌ను నెట్టేసి, ముద్దాయిలను బయటకు తీసుకెళ్లినప్పుడు పోలీస్ అసోసియేషన్ ఏంచేసింది? ఆఎంపీ చర్యను అసోసి యేషన్ తప్పుపట్టిందా? నిన్నటికి నిన్న అదే ఎంపీ మనుషులు ఎస్ఈపీ అధికారుల్నిఅడ్డగించి, ఇసుక అక్రమరవాణా చేస్తున్న లారీనితీసుకెళ్తే,అసోసియేషన్ నోరుపెగల్లేదేం. మంత్రి రోజా పదిమందిలో ఒక సీఐని‘‘ఆ సీఐ లం… కొడుకు’’అంటే అసోసియేషన్ కు వినిపించలేదా?అప్పు డు పెగలని నోరు, ఇప్పుడు పెగిలిందేం? సీఐ ఎదురు రొమ్ముపై చెయ్యేసి నెట్టి, మంత్రి సీదిరి అప్పలరాజు బూతుపురాణం విప్పిన ప్పుడు మీరుఎందుకుమాట్లాడలేదు?శ్రీకాకుళం జిల్లా లో సీఐ లలితను చెంపలు వాయించినప్పుడు పెగల ని నోరు, ఇప్పుడు పెగులుతుందేం? తూర్పు గోదా వరి జిల్లాలో ఒక ఎస్ఐ ఎవరుచెప్పారని శిరో ముం డనం చేయించాడు? ఇసుక మాఫియాకు చెందిన వైసీపీ నేత కృష్ణమూర్తి చెబితేనే కదా ఆపని చేశారు. ఆపనిచేసిన ఎస్ఐ ఇప్పుడు ఎక్కడున్నాడు? కుప్పం లో వైసీపీ నేత సెంథిల్ కుమార్ సీఐపై దాడి చేస్తే, అసోసియేషన్ పెద్దల నోరుఎందుకు పెగల్లేదు? గుర జాల ఎమ్మెల్యే కాసుమహేష్‌రెడ్డి,‘‘ఏందయ్యా బొంగు పోలీసులు, ఎన్నికలు అయ్యాక నాకాళ్లు పట్టుకుం టారు’’ అంటే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయ లేదు? వైజాగ్‌లో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇంటిపై వైసీపీ వారు దాడి చేసినప్పుడు, పోలీసులకు గాయాలైతే, అప్పుడు మీఅసోసియేషన్ నోరు బొంగు రు పోయిందా?ఎంపీ రఘురామరాజుని సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఇష్టానుసారం దారుణంగా హింసిస్తు న్నప్పుడు పోలీస్ అసోసియేషన్‌కు చట్టాలు గుర్తు రాలేదా?