- వైసిపి కబ్జాచేసి కొట్టుకొచ్చిన పార్టీ కాదా?
- తల్లి, చెల్లిని వెన్నుపోటు పొడిచిందెవరు?
- గొడ్డలిపోటుతో బాబాయిని వేసేసిందెవరు?
- మాజీమంత్రి పీతల సుజాత ధ్వజం
అమరావతి: ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ఆ జీవి తాన్ని నాశనం చేసిన లక్ష్మిపార్వతిని పక్కన పెట్టుకొని సజ్జల అండ్ కో వెన్నుపోటు గురించి మాట్లడటం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందని మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం ఆమె విలేకరుల తో మాట్లాడుతూ.. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్‌రెడ్డి చెప్పే ప్రవచనాలు వినడానికి ప్రజలు అమాయకులు కాదు. బాబాయిని గొడ్డలిపోటుతో వేసేసిపిన్నమ్మ తాళి తెంచడం ఏ పోటుకిందకు వస్తుందో సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు. వెన్నుపోటు, గొడ్డలిపోటుకు కేరాఫ్ వైసిపి మాత్రమేనని అన్నారు. ఈ మేరకు తొమ్మిది ప్రశ్నలను సజ్జలకు సంధించిన పీతల సుజాత.. వాటికి సమాధానం చెబితే ఎవరు వెన్నుపోటుదారులో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.
సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వెన్ను పోటు అంటూ పాచిపాటను అరిగిపోయిన గ్రామ్ ఫోన్రికార్డులా పదేపదే మాట్లాడటం దొంగే దొంగ అని అరచినట్లుగా ఉంది. ఎన్టీఆర్‌ని పక్కపోటు పొడిచి ఆయన ప్రతిష్టను మసకబార్చి, శిఖరాగ్రం లాంటి ఆ మహనీయుని జీవితాన్ని సర్వనాశనం చేసిన లక్ష్మీ పార్వతిని పక్కన పెట్టుకొని సజ్జల, జగన్‌రెడ్డిలు వెన్నుపోటు అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. అధికారదాహంతో బాబాయిని గొడ్డలిపోటుతో కడతేర్చి పిన్నమ్మ తాళిబొట్టు తెంచడం ఏపోటు అంటారో పూర్వాశ్రమంలో సీనియర్ జర్నలిస్టు కూడా అయిన సజ్జల చెప్పాలి.
దానిని ఏమంటారు.. గుండెపోటా? గొడ్డలిపోటా? వెన్నుపోటా? ముందుగా చెప్పాలి. అసలు మీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? శివకుమార్ అనే వ్యక్తి పెట్టిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్ ఆర్ సీపీ)ని మీకు అచ్చివచ్చి న, చేయితిరిగి విద్య అయిన కబ్జాతో లాక్కొని వెన్ను పోటు పొడిచింది ఎవరు? వైసీపీని కబ్జా చేసింది నువ్వు, నీ ఎ1 కాదా?
5. లక్ష కోట్ల ప్రజాధనం దోపిడీకి నీకు అవకాశం కల్పించిన కాంగ్రెస్‌పార్టీపై కృతజ్జతలేకుండా వెన్ను పోటు పొడిచింది మీ దొంగలబండి బ్యాచ్ కాదా? మీ రాజకీయ ఉన్నతికి, ఆర్థిక మూలాలకు కారణ మైన కాంగ్రెస్‌ను పదవీకాంక్షతో నట్టేటముంచడమే కదా అసలైన వెన్నుపోటు అంటే? రాజకీయ అవసరం తీరాక గౌరవాధ్యక్ష పదవి నుంచి తల్లిని గెంటేసి కన్నతల్లికే వెన్నుపోటు పొడి చిన మీరు చంద్రబాబు గురించి మాట్లాడేది. ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వాల్సి వస్తుందని ఎన్టీఆర్ తెచ్చిన చట్టానికి తూట్లు పొడిచి తోబుట్టువుకు చెం దాల్సిన వేలకోట్ల ఆస్తులను కాజేసి ఆమెను వెన్ను పోటు పొడవడమేగాక పక్కరాష్ట్రానికి తరిమేసింది మీరు కాదా? మద్యనిషేదం చేస్తామని మహిళలను వంచించి వారి ఓట్లతో అధికారపీఠాన్ని దక్కించుకున్న మీరు మాటతప్పి,మడమతిప్ప మద్యం ఆదాయాన్ని బ్యాం కుల్లో తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి యావత్ మహిళాలోకానికి వెన్నుపోటు పొడిచింది మీరుకాదా? నవరత్నాలను నవరంధ్రాలుగా మార్చి అయిదు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచి.. ఆ తప్పులను వాటిని కప్పిపెట్టుకోవడానికి ఎదుటివారిపై నిందలు వేస్తారా? వెన్నుపోటు పొడవడంలో జె-గ్యాంగ్ బుస్సీ దొరను మించిపోయారు. మీ వెన్నుపోటు కప్పిపెట్టు కోవడానికి ఎదుటివారిపై బురద జల్లుతూ నాటకాలు ఆడుతున్నారు. మీకున్న దుష్ట బుద్ధి, దౌర్భగ్య ఆలోచన లను నిష్కళంక రాజకీయనేత చంద్రబాబునాయుడు కు ఆపాదిస్తే నమ్మడానికి, వినడానికి తెలుగు ప్రజలేం అమాయకులు కాదు.కొందరిని కొంతకాలం మాత్రమే మోసంచేయగలరు. అందరినీ అన్నికాలాల్లో మోసం చేయలేరన్న నగ్న సత్యాన్ని గుర్తెరిగి మసలు కోవాలని జగన్, సజ్జలకు పీతల సుజాత హితవు పలికారు.