- పోలీసులపై దాడి చేసి చంపేస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లు
- మాఫియా అవతారం ఎత్తిన వైసీపీ
- జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్లకు స్వర్ణయుగం
- కానిస్టేబుల్ హత్యపై తీవ్రంగా స్పందించిన లోకేష్
అమరావతి: జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్‌తో వైకాపా ఎర్రచందనం మాఫియా అవతారం ఎత్తిందని విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్.. స్మగ్లింగ్‌కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడు. అడ్డొచ్చిన పోలీసుల్ని వైకాపా ఎర్రచందనం మాఫియా చంపేస్తుంది. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై మెరుపుదాడులకు పాల్పడి కానిస్టేబుల్ గణేష్‌ని చంపేయటం రాష్ట్రంలో వైకాపా ఎర్రచందనం మాఫి యా దారుణాలకు పరాకాష్ట.
టాస్క్‌ఫోర్స్ పోలీసు వాహనాలనే ఢీకొట్టి కానిస్టేబుల్ని చంపేశారంటే.. సర్కారీ పెద్దల అండ దండలతో ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. విధి నిర్వహణలో పాలకుల మాఫియాకి బలైన కానిస్టేబుల్ గణేష్‌కి నివాళులు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను. గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదు కోవాలి. గణేష్‌ని అత్యంత కిరాతకంగా చంపేసిన ఎర్ర చందనం మాఫియాని కఠినంగా శిక్షించాలని ఒక ప్రకటనలో లోకేష్ డిమాండ్ చేశారు.