- జగన్‌రెడ్డి ఆరు నెలల్లో ఎన్ని అమలు చేశారు?
- హామీలపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా?
- అడ్డగోలుగా దోచుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు
- ఆర్థిక వ్యవస్థను దిగజార్చి నీతులు వల్లిస్తున్నారా…
- పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు
- సూపర్‌సిక్స్ అమలుపై దిగజారుడు మాటలు వద్దు
- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు, జగన్‌రెడ్డికి లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నేతలు సూపర్ సిక్స్ అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మీ పాలనలో నవరత్నాల్లో ఆరు నెలల్లో ఎన్ని అమలు చేశారో బహిరంగంగా చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి నెలలో రాజన్న బడిబాట అని ప్రకటన మాత్రమే చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అగస్టు నెలలో వైఎస్సార్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు..అదే నెలలో వైఎస్సార్ పెన్షన్ కానుక అంటూ ప్రకటన మా త్రమే విడుదల చేశారు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని మండిపడ్డారు. పెన్షన్ల పెంపునకు మీకు ఆరు నెలలు సమయం పట్టింది. పతనం అంచునా ఉన్న ఆర్థిక వ్యవస్థను దిగజార్చిన పరిస్థితి నిజం కాదా? రోడ్ల మరమ్మతులు చేయకుండా కూడా చేయకుండా ప్రజల ప్రాణాలు తీసింది వైసీపీ ప్రభుత్వం కాదా? అని మండిపడ్డారు. అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఇప్పుడు నీతులు వల్లించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 1950 తరువాత ఏపీలో అభివృద్ధే చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తోంది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ మొత్తం ఏపీ వైపు చూస్తుం ది. సీఎం చంద్రబాబు సారథó్యంలో కూటమి ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు క్యూ కడుతున్నాయి. మంత్రి నారా లోకేష్ సైతం యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారు. మీ ప్రభుత్వం హయాంలో కనీసం ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకువచ్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత పెన్షన్లను రూ.4000 చేశాం. దీపం-2 పథకాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని 86 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేశాం. 203 అన్న క్యాంటీన్లను ప్రారం భించాం. అలాగే రైతుల నుంచి 26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 48 గంట ల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వ హయాం లో ఎప్పుడైనా జరిగిందా? పాలనను గాలికి వదిలేసి..వ్యవస్థలను నిర్వీర్యం చేసి..రోడ్లను అతలాకుతలం చేసి.. పరిశ్రమలను పారిపోయేలా చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.
జగన్‌రెడ్డి పాలనలో ఆర్థిక విధ్వంసం
వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పటానికి 2024 ఎన్నికలే నిదర్శనం. ప్రజలు ఇతర దేశాల నుంచి వచ్చి మరి ఓటు వేసి వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రజాతీర్పును గౌరవించకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరడం ఎంతవర కు న్యాయం? జగన్‌రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు ఇచ్చిన అర్జీలను తన సొంత నిధులతో పరిష్కరం చూపగలరా? శాసనసభకు రాని జగన్‌రెడ్డి అర్జీలు తీసుకో వడం వల్ల ఏమిటి ఉపయోగం? నలుగురు వైసీపీ ఎంపీలను ప్రజలు గెలిపించారు.. కానీ, అక్కడ మీకు ప్రతిపక్ష హోదా ఏదైనా ఉందా? 11 మందిని గెలిపస్తే అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సీఎం చంద్రబాబుకు రాష్ట్ర అర్థిక పరిస్థితిని ఇలా ఎప్పుడు చూడలేదంటే.. మీ పాలన వైఖరికి అద్దం పడుతుంది. మన మాతృభాషను కించపరిచే విధంగా రోత పత్రికలో రాసుకోవడం బాధాకరం. వర్క్ ఫ్రం హోం.. వర్క్ ఫ్రం ఫామ్ హౌస్‌లకు కాలం చెల్లింది. రాష్ట్ర ప్రజలను అవమానించకుండా అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యే రావా లని మీడియా ముఖంగా కోరుతున్నా. జగన్‌రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని సీఎం చంద్రబాబుకు నేను ఎప్పుడో చెప్పాను. జగన్‌రెడ్డి పాలన ఆర్థిక విధ్వం సానికి పాల్పడిరది. కేవలం ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాకుండా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి చేస్తుంటే చూడలేకపోతున్నారా? అని ప్రశ్నించారు.