- చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా
- ఐటీ ప్రొఫెషనల్స్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నా
- సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి
- విజయవాడ హరిత బెర్మ్‌పార్క్‌లో బాధ్యతల స్వీకరణ
- పాల్గొన్న మంత్రి కందుల, డిప్యూటీ స్పీకర్ రఘురామ
విజయవాడ(చైతన్యరథం): తెలుగువారి కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిర క్షించి పూర్వవైభవం తీసుకువస్తానని సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి అన్నారు. హరిత బెర్మ్ పార్క్‌లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరిం చారు. జ్యోతి ప్రజ్వలనతో మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె తో ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవ చేయ డానికి చాలామంది ఆలోచిస్తున్నారన్నారు. అలా నాకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
విజనరీ నాయకుడు చంద్రబాబు ఆశయాలకు ఆకర్షితులైన వ్యక్తిగా నాకు ఈ అవకాశం రావడం చాలా సం తోషంగా ఉందన్నారు. పదవికి ప్రొఫెషనలిజమ్‌ను జోడిరచాల్సిన అవసరం ఉందన్నారు. వందల మంది ప్రొఫెషనల్స్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చిందని.. ఇది వారందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఐటీ ఉద్యోగులు అన్ని సమయాల్లో అందు బాటులో ఉంటూ ఎక్కువ సమయం పనిచేస్తారన్నారు. ప్రొఫెషనల్స్‌కు ప్రతిరోజూ ఉద యం 8.30 గంటలకే రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఎక్కువ మంది ప్రొఫెషనల్స్‌ను రాజకీయాల్లోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తామన్నారు. ఏ పనిచేసినా పూర్తి బాధ్యతతో పనిచేయమని ముఖ్యమంత్రి చెప్పిన విధంగా మన సం స్కృతి, సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించి పదవికి గౌరవం తేస్తానని తెలిపారు. దేశ, విదేశాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రమోట్ చేయాల్సిన అవసరం మన పై ఉందని, ఇందుకు సాంకేతికతను జోడిరచాల్సి అవసరం ఉందని ముఖ్యమంత్రి ఆలో చనలకు అనుగుణంగా అందుకోసం కష్టపడి పనిచేస్తానని వివరించారు.
కల్చరల్ క్వీన్‌గా పేరుతెచ్చుకోవాలి
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
ఐటీ రంగంలో రాణించి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ముఖ్యమం త్రి చంద్రబాబుపై ఉన్న గౌరవంతో ఐటీి ప్రొఫెషనల్స్ సభ ఏర్పాటు చేసి విజయవంతం చేయడానికి కృషిచేసిన వ్యక్తి తేజస్వి అని రఘురామకృష్ణంరాజు ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసి ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాకు కూడా మన సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఎనలేని అభిమానమని, కల్చర్ క్వీన్‌గా తేజస్విని పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిం చారు.
సాంస్కృతిక వైభవం కోసం కృషిచేయాలి
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్రం కళలు, సంస్కృతికి పెట్టింది పేరు.. ఐటీ రంగానికి చెందిన తేజస్వి సృజ నాత్మక, సంస్కృతి సమితి చైర్‌పర్సన్‌గా తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తారని భావిస్తు న్నా.. సాంస్కృతిక వైభవం కోసం తేజస్విని, జానపద కళల కోసం గుమ్మడి గోపాలకృష్ణ ఇద్దరూ రాష్ట్రానికి సాంస్కృతిక పూర్వవైభవం తెచ్చేలా కృషిచేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, కామినేని శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, మాల్యాద్రి, పట్టాభిరామ్, ఆనం వెంకటరమణారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివా సులురెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు, నాయకులు జె.జనా ర్దన్‌రావు, బాలకోటయ్య, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర, సీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.