- 20న భోగాపురం సమీపంలో సభ
- హాజరుకానున్న చంద్రబాబు, పవన్, బాలకృష్ణ
విజయనగరం: టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని ఏపీ టీడీపీ అధ్య క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ హజరవుతారన్నా రు. ఈ సభకు ఐదు లక్షల మంది వరకు జనం తరలివచ్చే అవకాశం ఉందన్నారు. పది రైళ్లు ఇప్పటికే బుక్ చేశామన్నారు. బస్సుల కోసం అన్ని ఆర్టీసీ డిపోలకు లేఖలు రాస్తామన్నారు. యువతకు భరోసా కల్పించాలని లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభిస్తే అన్ని వర్గాలకు ఆధారమైందన్నారు. యువగళం పాదయాత్రను అడ్డుకోవటానికి జగన్‌రెడ్డి సర్కారు అడుగడుగు నా ఆటంకాలు సృష్టించిందని మండిపడ్డారు. 220 రోజుల్లో 3,000 వేల కిలోమీటర్లు లోకేష్ పాద యాత్ర ఓ చరిత్ర అని అన్నారు. అనివార్య కారణాల వలన శ్రీకాకుళం వరకు కొనసాగించ టం లేదన్నారు. విశాఖ ఏయూ మైదాంలో సభ పెట్టాలనుకుంటే జగన్ అడ్డుకోవటం దారుణ మని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18న పాదయాత్ర ముగించి 20న మధ్యాహ్నం రెండు గంటలకు విజయనగరం జిల్లా భోగాపురం మం డలం పోలిపల్లిలో పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు వెల్లడిరచారు.
బస్సులు కేటాయించండి
అద్దె చెల్లిస్తామని ఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అవసరమైన బస్సులు అద్దె ప్రాతిపదికన కేటా యించాలని ఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. బస్సులకు అవసరమైన రుసుములను చెల్లిస్తామన్నారు. ఈనెల 20వ తేదీన విజయ నగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద జరిగే ఈసభకు రాష్ట్రం నలుమూలల నుండి టీడీపీ కార్యకర్తలు,సానుభూతిపరులు, సామాన్య ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉం దన్నారు. కాబట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సభాస్థలికి అవసరమైన సంఖ్యలో బస్సు లు కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.