2024 జూన్ 12న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండు నెలలు పూర్తి అయ్యింది. రాష్ట్ర ఖజానా దివాళా స్థితిలోవున్నా రెండు నెలల్లోనే 60కి పైగా చెప్పుకోదగిన కార్యక్రమాలు చేయడమైంది. జగన్ సీయం అయిన మొదటి రెండు నెలల్లో పింఛన్లు రూ.250లు పెంచడం తప్ప మరేమీ మంచి పనులు చేయలేదు. ప్రజావేదికను కూల్చి విధ్వంసంతో పాలన ప్రారంభించారు. నవరత్నాలలో ఒక్క పింఛన్ తప్ప మరే హామీని జగన్ మొదటి రెండు నెలల పాలనలో చేయలేదనేది వాస్తవం. రెండు నెలల్లోనే ఎన్‌డీఏ ప్రభుత్వం 60కి పైగా మంచి పనులు చేయడం ఒక రికార్డ్. అయినా హామీలన్నీ అమలు చేయలేదని జగన్, నీలి మీడియా ప్రతిరోజూ దుష్ప్రచారం చేస్తున్నది. తాను అధికారం చేపట్టే నాటికి ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని జగన్ అబద్ధాలు చెబుతున్నాడు. ఆనాడు `రైతు రుణమాఫీకి చంద్రబాబు విడుదల చేసిన రూ.5 వేల కోట్లు జగన్‌కు అందుబాటులో ఉన్నాయి. మిగులు విద్యుత్ ఉన్నది. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ సిద్ధం చేసి జగన్ చేతిలో పెట్టారు. కాని `జగన్ ఎడాపెడా అప్పులు చేశారు. భారీగా ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచారు. ఇవన్నీ కప్పిపెట్టి అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఒకే దఫా రూ.1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడంతోపాటు బకాయిలు రూ.3 వేలు కూడా కలిపి రూ.7వేలు 64 లక్షల మందికి ఇవ్వడం దేశ చరిత్రలో మొదటిది. ఒకటవ తేదీనే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వడమైంది.
వైకాపా పాలనలో కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావనే ఉండేది కాదు. ఎన్‌డీఏ పాలనలో అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి ప్రోత్సాహం, ఎనిమిది వెనుకబడిన జిల్లాలకు కేటాయింపు, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడల అభివృద్ధి అంశాలు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చోటుచేసుకున్నవి. రైతులకు ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు చెల్లించడమైంది. రూ.286 కోట్లతో రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ప్రజాదర్బార్ ద్వారా విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ ప్రతిరోజూ తీసుకుంటున్న అర్జీలు 50 వేలకు పైగా చేరాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో గతంలో అర్జీలు తీసుకునేవారు కాదు. ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేయడమైంది. చేనేత వృత్తిదారులకు జీయస్‌టి ఎత్తివేత, గృహనిర్మాణానికి రూ.50వేలు అదనంగా ప్రకటించడమైంది. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలతోపాటు గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మంజూరు. అమరావతిలో రూ.250 కోట్లతో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ఏర్పాటు జరగబోతున్నది. డ్రిప్ పరికరాలు 90 శాతం సబ్సిడీతో తిరిగి ప్రారంభించడమైంది. ఉచిత ఇసుక సరఫరా ప్రారంభమైంది. ఇందులో ఉన్న కొన్ని సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. గల్ఫ్ బాధితులు నారా లోకేష్ చొరవతో విడుదలయ్యారు. తుఫాన్ బాధితులకు రెట్టింపు సహాయం చేయడమైంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరించబోమని కేంద్రమంత్రి కుమారస్వామి ద్వారా ప్రకటన చేయించడమైంది. దివ్యాంగులకు వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు, లాప్‌టాప్‌లు ఇవ్వడమైంది. ప్రజల ఆస్తుల్ని కబ్జాచేసే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అసైన్‌మెంట్ భూములు 9 లక్షల ఎకరాలు కారుచౌకగా వైకాపా పెద్ద నేతలు కొట్టేసే కుట్రకు బ్రేక్ వేయడం జరిగింది. మదనపల్లె భూకబ్జాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించారు. గంజాయి నియంత్రణకు 5గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు. రాజముద్రతో భూ`పాస్ పుస్తకాల జారీ, ప్రజా రాజధాని అమరావతిలో భూమిలేని కూలీలకు పెన్షన్ ఇచ్చి దాన్ని మరో ఐదేళ్లకు పొడిగించడమైంది. పరదాలు, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా, చెట్లు నరికివేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు సాగుతున్నవి. శ్రీశైలానికి ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపడానికి ఆదేశాలు జారీ చేశారు. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసి గత ప్రభుత్వ నేరాలు, ఘోరాలు ప్రజల ముందుంచడమైంది. రేషన్ సరుకులు పెంచారు విదేశాలకు అక్రమ బియ్యం ఎగుమతులకు బ్రేక్ వేశారు. కౌలు రైతులకు కోపరేటివ్ బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడమైంది.
ముచ్చుమర్రి గ్యాంగ్ రేప్ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడమైంది. తిరుమల ప్రక్షాళనతోపాటు లడ్డు నాణ్యత పెంచబడిరది. మూడు నెలల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణ పూర్తికి చర్యలు తీసుకుంది సర్కారు. యూట్యూబ్, గూగుల్, మహేంద్రవంటి సంస్థలతో భేటీలు జరిగాయి. ఏపీలో శాంతిభద్రతలు లేవని, కనుక ఇక్కడ పెట్టుబడులు పెట్టవద్దని వైకాపా సోషల్ మీడియా `యూట్యూబ్‌కు ఫిర్యాదులు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఉపాధి పథకం ద్వారా 6.50 కోట్ల పనిదినాలు కల్పనవల్ల అదనంగా 54 లక్షల మంది లబ్దికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు పెట్టడమైంది. మైనారిటీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణకు 19 కేంద్రాల ఏర్పాటు, మెటీరియల్ కాంపొనెంట్ క్రింద రూ.2 వేల కోట్లతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి చర్యలు, 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి సంతకం చేయడమైంది. ఇలా రెండు నెలల్లోనే 60కి పైగా చెప్పుకోదగిన పనుల్ని చంద్రబాబు ప్రభుత్వం చేయడం గతంలో ఎన్నడూ జరగలేదనేది నిజం. అయినా జగన్‌రెడ్డి నిత్యం విషప్రచారం చేస్తున్నారు. వ్యక్తుల మధ్య జరిగిన కొన్ని ఘటనల్ని కొండంత చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌ల పర్యటనలను అడ్డుకున్నారు. కానీ నేడు జగన్ పర్యటనల్ని అడ్డుకోలేదు. గతంలో నియంతృత్వం రాజ్యమేలగా నేడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ పేరు చిన్న అక్షరాలతో.. జగన్ పేరు తాటికాయంత అక్షరాలతో వేసి అంబేద్కర్‌ను అవమానించారు. దాన్ని సహించలేని ఎవరో అక్కడ జగన్ పేరు తొలగించారు. దాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలతో కుల విద్వేషాలు రెచ్చగొట్టే దిగజారుడుకు జగన్ మీడియా చేయని విన్యాసం లేదు. తన దుష్ట లక్షణాల్ని టీడీపీకి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ నైజంగా ఉన్నది. చివరకు వైకాపా స్థితి ‘నాన్న పులి’ కథ చందంగా ముగియక మానదు.
గురజాల మాల్యాద్రి
జాతీయ అధికార ప్రతినిధి