అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం జరగాల్సిన తన పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకున్నారు. ఈ రోజు నర్సీపట్నం లో జరుపుకునేరు. అంతే కాకుండా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత విపత్తు పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల జీతం మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా, ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ సామర్థ్యానికి అనుగుణంగా సహాయం అందచేయాలని స్పీకర్ ఆయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు.