• కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అజీస్ పురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో దాదాపు 800కుటుంబాలు నివసిస్తున్నాయి.
• అనేక సంవత్సరాలుగా మా గ్రామంలో తాగునీటి సమస్య ఉంది.
• తాగునీటిలో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉండడంతో కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్నాం.
• వర్షం పడితే తప్ప పంటలకు నీరు అందే పరిస్థితి లేదు.
• టీడీపీ పాలనలో సమ్మర్ స్టోరేజి ట్యాంకు మంజూరు చేశారు, నేటికీ నిర్మాణం జరగలేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులు పూర్తిచేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• లీటరు వెయ్యిరూపాయల విలువైన నీళ్లు తాగే ముఖ్యమంత్రికి సామాన్య ప్రజల కష్టాలెలా తెలుస్తాయి?
• రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు గుక్కెడు నీళ్లవ్వలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం.
• గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వస్థానంలో ఉంది.
• జగన్ అండ్ కో కు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై ఎటువంటి శ్రద్ధా లేదు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అజీస్ పురంలో సమ్మర్ స్టోరేజి ట్యాంకు నిర్మిస్తాం.
• వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెడతాం.