- వాటి నిధులను దారి మళ్లించిన నీచమైన జగన్‌రెడ్డిదే
- సెల్ఫ్ ఫైనాన్స్ విధానంతో విద్యార్థులనూ దోచుకున్నారు
- నాడు ఏ తప్పూ చేయకుంటే విచారణకు సిద్ధమా?
- తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): గత ఐదేళ్ల అరాచక పాలనలో జగన్‌రెడ్డి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల సంద ర్భంగా… ఈ వంద రోజుల్లో గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని, ఆర్థిక నష్టాన్ని, గాడి తప్పిన వ్యవసలను సరిచేసుకుంటూ మళ్లీ రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే దిశగా ముఖ్యమం త్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి పత్రిక, మీడియా విషప్రచారం మొదలుపెట్టిందన్నారు. గత రెండురోజులుగా అశుద్ధ మీడియా మెడికల్ కాలేజీల గురించి గతంలో వారు చేసిన తప్పులను దాచిపెట్టి, వాటిని సరిదిద్దే పని మొదలుపెట్టిన ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి తన పర్యటనలు, సభల్లో మీ పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్లు చదివించండి… ఎన్ని లక్షల ఫీజులైనా నేను చెల్లిస్తానంటూ గొంతు చించుకుని అరిచాడు. మరి అధికారంలోకి వచ్చి సీఎం పదవిలో కూర్చున్నాక వైద్య విద్యను మరిచాడని ధ్వజమెత్తారు. తన హయాం లో 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్పుకుంటున్న జగన్‌రెడ్డి.. వాస్తవానికి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చి నిర్మాణాలు, అడ్మిషన్లలో చెప్పుకో విధంగా కనిపించింది కేవలం ఐదు కాలేజీల్లో మాత్రమేనని చెప్పారు. మరి ఈ ఫేక్ జగన్ రెడ్డి ఎప్పుడు చెప్పినా 17 అనే పాట పాడతాడని ధ్వజమెత్తారు. ఆయన జీవితంలో కనిపించే నిజం ఏమిటంటే తాను నిరం తరం అబద్ధాలు చెబుతూనే..ఎదుటి వారు అబద్ధాలు చెబు తున్నారని రోజూ చెప్పడమేనని వ్యాఖ్యానించారు.
సెల్ఫ్ ఫైనాన్స్ విధానంతో దోచుకున్నది వాస్తవం కాదా?
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను మెరిట్ కోటాలో లేదా కన్వీనర్ కోటాలో భర్తీ చేసే విధానాన్ని ఆపేసి మూడు కేటగిరీలను సృష్టించింది జగన్‌రెడ్డి కాదా? ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీలను సృష్టించి సెల్ఫ్ ఫైనాన్స్ లో కోర్సులను ప్రారంభించి ఆ విధానానికి నాంది పలికింది జగన్‌రెడ్డి కాదా? అని ప్రశ్నిం చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిల్లల తల్లిదండ్రులను రెచ్చగొట్టి మీ పిల్లలను ఏమి చదివిం చాలన్నా నేను లక్షలాది రూపాయల ఫీజులు కడతాను అని బీరాలు పలికి ముఖ్యమంత్రి అయ్యాక తల్లిదండ్రుల రక్తాన్ని శ్రమగా మార్చి సంపాదించిన డబ్బులను కూడా ఎంబీబీఎస్ సీట్ల విషయంలో తెచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ విధానంతో జలగలా పీల్చుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.
ప్రైవేటుపరం చేస్తామని చంద్రబాబు చెప్పలేదు
మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నాడని జగన్ రెడ్డి, భారతి మీడియా విషప్రచారం చేస్తున్నారని.. వాస్తవానికి ప్రైవేటుపరం చేస్తామని కూటమి ప్రభు త్వం ఇప్పటివరకు చెప్పలేదని తెలిపారు. చంద్రబాబు ఈ 3 నెలల్లో కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలను ఎలా నిర్వహించాలనే చర్చ వచ్చినప్పుడు గుజరాత్ మోడల్‌ను అధ్యయనం చేయండి అని మాత్రమే చెప్పారని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కొత్త మెడికల్ కాలేజీలను నిర్వహించాలని, గుజరాత్ మోడల్‌ను మాత్రమే అధ్యయనం చేయమని మాత్రమే చెప్పారు. ఒకవేళ ఈ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం గురించి కూడా మాట్లాడాలనుకుంటే భారతదేశంలో 1981 ముందు కంట్రోల్ ఎకానమీ ఉండేది. అభివృద్ధి చెందుతున్న భారతదేశం 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో పేదరిక నిర్మూలన జరగాలన్నా, ఉపాధి అవకాశాలు కావాలన్నా పెట్టుబడులు రావాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను మన ఆర్ధికాభివృద్ధి కోసం మన దేశంలో మౌలిక సదుపాయాల అభి వృద్ధి కోసం ఉపయోగించాలన్న ఒక లక్ష్యంతో 1991లో పి.వి.నరసింహారావు, మన్మోహ న్‌సింగ్ నాయకత్వంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి లిబరైజేషన్, మోడలైజేషన్, గ్లోబలైజేషన్ ప్రారంభించారు. 1990లో అప్పటి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు సమీకరణ ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటో అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు తన విజనరీతో ఆర్థిక సంస్కరణలను అమలు చేసి లక్షలాది కోట్ల రూపాయలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోటి 25 లక్షలు జనాభా ఉన్న హైదరాబా ద్‌కు పంచడం ఒక చరిత్ర. అందువల్లే ఈరోజు ప్రపంచం మొత్తం దానివైపు చూస్తుంది. అంటే చంద్రబాబు పబ్లిక్, ప్రైవేట్ రంగాలను ప్రోత్సహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మౌలిక స్వరూపాన్నే మార్చారు. ప్రభుత్వ వనరులు తక్కువగా ఉన్న ఏపీలో నాణ్యమైన విద్యా సౌకర్యాలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో అనేక విద్యా సంస్థలను రాష్ట్రం విడి పోయి న తర్వాత చంద్రబాబు 2014 -19 మధ్య తీసుకువచ్చారు. అమరావతి రాజధానిలో వీఐటీి, ఎస్‌ఆర్‌ఎంకు కొన్ని వేల మంది విద్యార్థులు రాజధానికి వచ్చారని గుర్తుచేశారు.
ఐదేళ్లలో మెడికల్ కాలేజీలను చేసింది శూన్యం
గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. కానీ జగన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో డబ్బా కొట్టుకుంటున్న 17 మెడికల్ కాలేజీ ల గురించి ఏమిచేశాడో గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. ఐదేళ్ల కాలంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు ఎంతవుతుందని చెప్పారంటే రూ.8,480 కోట్లు అవుతుందని అంచనా.. మరి ఆ డబ్బులో రూ.3,672 కోట్లను నాబార్డు రుణంగా ఇచ్చింది. కేంద్ర ప్రభు త్వం రూ.972 కోట్లు రుణంగా ఇచ్చింది. దానికి తోడు మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆరోగ్య శ్రీ నిధులను కూడా 17 కాలేజీల పేరు చెప్పి దారి మళ్ళించారు. 2019లో జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల నుంచి ఈ కాలేజీల గురించి మేము ఏమీ అడగలేదు. పరిపాలనపై అవగాహన రావాలని వదిలేశాం. తర్వాత నాలుగేళ్లలో తానేదో నిర్మించినట్లు టీడీపీపై విషప్రచారం చేస్తున్నాడు. తాను కాలేజీల విషయమై చేసింది కేవలం 25 శాతమే. దాదాపు 6 వేల కోట్లు దగ్గర పెట్టుకుని కేవలం రూ.2,125 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు.
డబ్బులు ఉంచుకుని పనులు చేయలేదు
చిత్తశుద్ధి ఉంటే డబ్బులు ఉంచుకుని మెడికల్ కాలేజీల పనులు ఎందుకు పనిచే యలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు కేవలం 16 శాతం మాత్రమే చెల్లించారు. మిగతాది మేము చెల్లించబోతున్నామని వివరించారు. 2023-24 విద్యా సంవత్సరంలో విజయ నగరం మెడికల్ కాలేజీ, రాజమండ్రి మెడికల్ కాలేజీ, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీ పట్నం కాలేజీల్లో అడ్మిషన్ల అనుమతి ఉందన్నారు. ఈ మెడికల్ కాలేజీల గురించి నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ను అడిగినప్పుడు మిగతా కాలేజీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తికాలేదు. భవనాలు పూర్తి కాలేదు. సిబ్బందిని నియమించలేదు. పాడేరు, పులివెందుల లో అలాగే మిగతా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల గురించి రాష్ట్రప్రభుత్వం అడిగినపుడు కేం ద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అండర్ టేకింగ్‌కు ఇవ్వాలని అడిగింది. ఇన్ని వాస్తవాలను ముందు పెట్టుకుని కూటమి ప్రభుత్వం మీద విషప్రచారం మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. మీరు తప్పు చేయకుంటే వాటిపై విచారణ కోరితే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు.