బద్వేల్ కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. బద్వేల్ టౌన్ ని మోడల్ టౌన్ గా మారుస్తానని చెప్పాడు. బద్వేల్,గోపవరం,అట్లూరు మండలాలకు సోమశిల బ్యాక్ వాటర్ వద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చాడు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి పోరుమామిళ్ల, కలసపాడు మండలాలకు రెండేళ్లలోనే సాగు, తాగునీరు అందిస్తాం అని చెప్పి మోసం చేసాడు. పోరుమామిళ్ల చెరువు ముంపు బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. పోరుమామిళ్లను మున్సిపాలిటీ చేస్తానని చెప్పాడు. ఇచ్చిన హామీ ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా? బద్వేల్ ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, రోడ్లు నిర్మించింది టిడిపి. బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నిర్మించింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు. అగ్రికల్చర్ కాలేజ్, పోరుమామిళ్ల, బద్వేల్ మండలాలకు జూనియర్, డిగ్రీ కాలేజీలు ఇచ్చింది చంద్రబాబు గారు.
పోరుమామిళ్ల, కలసపాడులో పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేసింది టిడిపి. సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా చెరువులు నింపేందుకు ప్రత్యేక జిఓ ఇచ్చింది చంద్రబాబు గారు. ఆ జీఓ రద్దు చేసింది పులకేశి జగన్. బద్వేల్ ప్రజలు ఆలోచించుకోవాలి. పాలిచ్చే ఆవు కావాలా? లేక తన్నే దున్నపోతు కావాలా? టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగు నీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా బద్వేల్ చెరువు నింపుతాం. పోరుమామిళ్ల చెరువును అభివృద్ధి చేస్తాం. ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.
మిషన్ రాయలసీమ లో భాగంగా జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. బద్వేల్ టౌన్ ని అభివృద్ధి చేస్తాం. వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇళ్లు ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బద్వేలు నియోజకవర్గంలో జరిగిన భూ అక్రమాల పై సిట్ వేసి విచారణ చేస్తాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టను. బద్వేల్ లో ఉన్నా, బంగ్లాదేశ్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. బద్వేల్ గడ్డ పై పసుపు జెండా ఎగరేయండి. బద్వేల్ ని అభివృద్ది చేసే బాధ్యత నాది.