• గూడూరు నియోడజకవర్గం బల్లవోలు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్నాయి, వాటిలో సిలికా ఖనిజం అధికంగా ఉంది.
• గ్రామంలోని పేదలకు ప్రభుత్వం డీకేటీ పట్టాలను పంపిణీ చేసింది.
• కొంత మంది రైతులు పట్టాలు లేకుండానే ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నారు.
• చిల్లకూరు, కోట మండలాల్లో తీర ప్రాంత గ్రామాల్లో సిలికాను తవ్వుకునేందుకు 84మందికి ప్రభుత్వం లీజులకు అనుమతులు మంజూరు చేసింది.
• జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి సిలికా లీజుదారులను ఇబ్బందులు పెడుతున్నారు.
• సిలికా వ్యాపారాన్ని పంచాయతీ తీర్మానం లేకుండా శేఖర్ రెడ్డి అనే వ్యాపారికి అప్పజెప్పారు.
• వామన ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఈ వ్యక్తి దళిత లీజుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
• పేద రైతులు భూములు ఇవ్వాలని ఒత్తిడి చేసి బెదిరిస్తున్నారు.
• వేరుశనగ పంట సాగుచేసుకుంటున్న భూములను శేఖర్ రెడ్డి బెదిరించి లాక్కుంటున్నాడు.
• నిలదీసిన 33మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారు.
• నిబంధనలకు మించి సిలికాను తవ్వడం వల్ల పంటలకు నీరు దొరికే పరిస్థితి లేకుండా పోయింది.
• తాగునీరు కూడా దొరకడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక అక్రమ సిలికా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• నెల్లూరు జిల్లాలోని కోట, చిల్లకూరు మండలాల్లో జగన్ అండ్ కో అక్రమ సిలికా విక్రయాల ద్వారా ఇప్పటివరకు రూ.5వేల కోట్లు దోచుకుంది.
• దశాబ్ధాలుగా సిలికా మైనింగ్ చేస్తున్న 84మందిని బెదిరించి సిలికా భూములు లాగేసుకున్నారు.
• ఎటువంటి బిల్లులు లేకుండా పెద్దఎత్తున సిలికాను చెన్నయ్ తరలిస్తూ వైసిపి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాస్తవ లీజుదారులకు న్యాయం చేస్తాం.
• అక్రమ సిలికా తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తాం, రైతుల సాగుభూమికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతాం.