అమరావతి: వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడి కొవ్వూ రు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దు చేయించిదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కాడని మండిపడ్డారు. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో టీడీపీ ఏకగ్రీవం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఎన్నికలను రద్దు చేశారన్నారు. ఆ స్థానంలో దుర్మార్గంగా కమిటిని ఏర్పా టు చేశారని మండిపడ్డారు. ఎన్నికలని రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన 11 మంది అర్బన్ బ్యాంకు డైరెక్టర్ లను, టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులను, నాయకులను అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి పిచ్చికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఎన్నికలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను చూపించకుండా, అడ్డగోలుగా ఎన్నికలను రద్దు చేయడం అన్యాయమని చెప్పారు. సభ్యులను అరెస్ట్ చేయడం మరీ అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన వారిని తప్పించి అడ్డగోలుగా త్రిసభ్య కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని చెప్పారు.
ఎన్నికల వ్యవస్థను బ్రస్టుపట్టిస్తున్న జగన్ రెడ్డి
ఎన్నికల వ్యవస్థను జగన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేకుండా అధికారాన్ని, పొలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కల వ్యవస్థను హైజాక్ చేస్తున్నారన్నారు. ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగడానికి వీల్లేదనే పరిస్థితిని సృష్టిం చారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి భారత రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి నెత్తుటి రాజ్యాంగాన్ని రాష్ట్రంపై బలవంతంగా రుద్దుతున్నారని నిప్పులు చెరిగా రు. తిరుపతి ఎన్నికల్లో తప్పుడు వ్యక్తులతో, దొంగ ఓట్ల తో ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను బయటపెట్టినా ఇంతవరకు చర్యలు లేవన్నారు. ఇప్పడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలని రద్దు చేసి బులుగు బ్యాచ్‌తో ప్రమాణ స్వీకారం చేయించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఎన్నికలని రద్దు చేయడమే కాకుండా నిబం ధనలకు విరుద్ధంగా, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రమాణ స్వీకారం చేయిచడం సిగ్గుచేటన్నారు. జగన్‌రెడ్డికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, ప్రజలంటే విలువ లేదని చెప్పారు. ఎన్ని కలను రద్దుచేసి తనకు తాను నియంతగా చెప్పుకుం టున్నాడని మండి పడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించకుండా నియంత పోకడలకు పోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు వస్తుందని హెచ్చ రించారు. తీవ్రమైన పరిణామాలని జగన్‌రెడ్డి ఎదుర్కోక తప్పదన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో దుర్మా ర్గంగా రాళ్లతో దాడులు, దౌర్జన్యాలు చేశారన్నారు. పేద వాడికి పెడుతున్న పట్టెడన్నాన్ని అందనివ్వకుండా అన్న క్యాంటిన్లను ధ్వంసం చేశారని చెప్పారు. రాష్ట్రంలో 16 పట్టణాలలో అన్న క్యాంటిన్లని ప్రభుత్వం తీసేసినా, విధ్వంసం చేసినా ప్రైవే టుగా అన్నాక్యాంటిన్లని పెట్టి పేదవాడి కడుపునింపాలనే ఉద్దేశంతో చంద్రబాబు నిర్ణయం తీసు కుంటే, వైసీపీ ప్రభుత్వం వాటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తోందన్నారు. 14 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతి పక్షనాయకునిగా ఉన్న చంద్రబాబు సొంత నియోజక వర్గంలో పర్యటిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించి అరాచకాలు చేస్తోం దని పేర్కొన్నారు. ఈ అరాచకపు చర్యలపై ప్రజలు తిరగ బడుతున్నారని, మున్ముందు రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.