- ఐదేళ్లలో వేధింపులు తప్ప ఏంచేశారు?
- బీసీల అణచివేత ఆయన అజెండా..
- నిధులూ ఇవ్వలేదు.. విధులూ ఇవ్వలేదు
- గొంతువిప్పిన బీసీలపై అక్రమ కేసులు..
- తాతా రాజారెడ్డినుంచీ అదే పంథా
- తెదేపాతోనే బీసీల అభివృద్ధి సాధ్యం
- బీసీలకు ఎమ్మెల్యే అనగాని బహిరంగ లేఖ
అమరావతి (చైతన్యరథం): పెత్తందారీతనం, నియంతృత్వపోకడకు మారురూపం జగన్‌రెడ్డి. బలహీ న వర్గాల పొడగిట్టని అహంభావి. గడచిన ఐదేళ్లలో బీసీలకు సముచితస్థానం ఇవ్వలేకపోయాడు. సామజి కంగా రాజకీయంగా ఆర్ధికంగా బీసీలను ప్రోత్సహిం చిన దాఖలాలు లేనేలేవు. బీసీ నేతలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని వ్యక్తి. జగన్ హయాంలో అక్రమ కేసులతో వేధింపులు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన నిధులను కొల్లగొట్టడంలాంటి చర్యలు.. బీసీలపై అతని కుండే చిన్నచూపును బట్టబయలు చేస్తున్నాయి `అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. మార్చి 5న తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రక టించనున్న సందర్భంలో.. బీసీలకు ఎమ్మెల్యే అనగాని బహిరంగ లేఖ విడుదల చేశారు.
బీసీలు సంఘటితం గా భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన అవస రాన్ని లేఖలో పొందుపర్చారు. ముఖ్యమంత్రిగా జగన్ హయాంలో బీసీలు `ప్రభుత్వ ప్రేరేపిత దురాగతాలకు ఎలా బలైపోయారో లేఖలో విస్పష్టంగా పేర్కొన్నారు. లేఖలో అనగాని వెల్లడిరచిన అంశాలను పరిశీలిస్తే `బీసీలు ఎక్కడ ఎక్కువుంటే అక్కడ జగన్ తన సొంత సామాజికవర్గ వ్యక్తులకు పెత్తనం అప్పజెప్పి బీసీలను అణగదొక్కుతున్నాడు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా వుండే బలహీన వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసి.. సొంత వర్గానికి సంపద దోచిపెట్టడంపైనే జగన్‌రెడ్డి దృష్టి పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా ఉంటూ.. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ధైర్యంగా పోరాడుతున్న బలహీనవర్గాలపై జగన్‌రెడ్డి కత్తిగట్టాడు. అక్రమ కేసులు, దాడులతో బీసీలను అణ గదొక్కిన చర్యలు ..వైసీపీ ఏలుబడిలో లెక్కలేనన్ని.
తాత రాజారెడ్డి హాయాంనుంచీ..
చేనేత వర్గానికి చెందిన జింకా వెంకట నర్సయ్యను దారుణంగా హత్యచేసి, ఆయన బైరటీస్ గని ఆక్రమణ తో జగన్ తాత రాజారెడ్డి ప్రారంభించిన పెత్తందారీ, దోపిడీ ప్రస్థానం అప్రతిహతంగా నేటికీ కొనసాగడం బీసీలు ఎన్నటికీ మరువలేరు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు 10శాతం పెంచితే, అహం భావి జగన్ దానికి కోతపెట్టి 16,800మంది బీసీలను రాజకీయ ప్రాతినిధ్యానికి దూరం చేశాడు. గత ఐదేళ్లుగా బీసీలపై జరుగుతున్న నిరంతర దాడులు, వంద లాది హత్యలు దేనికి తార్కాణం?. తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య యాదవ్‌వంటి ఎంతోమంది బీసీలు నిర్దాక్షణ్యంగా హత్యకు గురైనా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నోరు విప్పి ఖండిరచి, వాటిని ఆపడానికి ప్రయత్నిం చిన పాపాన పోలేదు. సామాజిక న్యాయమంటూ నిరం తరం కపట నాటకాలు ప్రదర్శించే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనుసన్నల్లో బీసీ మంత్రులకు ప్రత్యక్ష్యంగా జరిగిన పలు అవమానాలను రాష్ట్ర ప్రజానీకం ప్రత్యక్షంగా చూసింది.
తన సామాజిక వర్గానికి చెందిన సామంతు ల ముందు బీసీ మంత్రులు మోకరిల్లడం, కూర్చోవడా నికి కనీసం వారికి కుర్చీకూడా ఇవ్వక పోవడంతో సభాంతం వరకు బేలగా నిలుచుండిపోయిన ఘట్టాలు బీసీల మనసుల్లో ఎన్ని నాటుకుపోలేదు. బీసీలు ఎక్కువ గా ఉండే జిల్లాలన్నింటిపై పెత్తనం సాగించేందుకు తన సామాజిక వర్గంవారిని నియమించుకున్న ముఖ్యమం త్రిని వంచనకు గురైన బీసీలు ఎన్నటికీ నమ్మలేరు. జగన్‌రెడ్డి ధన దాహానికి అధికంగా బలైంది, బలవుతు న్నది బలహీన వర్గాలే. ఇళ్ల పట్టాల పేరుతో 8వేల ఎకరాల బీసీల భూములు లాక్కున్నాడు. ఉచిత ఇసుక రద్దుచేసి ఉపాధి లేకుండా చేశాడు. అన్న క్యాంటీన్లను దెబ్బతీసి నోటి దగ్గరి కూడునూ దూరం చేసిన బీసీ ద్రోహి జగన్‌రెడ్డి. బీసీలకు మెరుగైన విద్య అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య లాంటి పథకాలు, పారిశ్రామిక వేత్తలుగా మార్చే రాయి తీలు రద్దుచేసి వారిని ఎదగనీయకుండా అణగదొక్కడం జగన్‌రెడ్డి పెత్తందారీ, ఫ్యాక్షన్ మనస్థత్వానికి నిదర్శనం. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక రద్దుచేసి 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేసి, వంద మందికి పైగా కార్మికుల ఆత్మహత్యలకు కారణం జగన్ రెడ్డి పెత్తందారీ, దోపిడీ మనస్తత్వం కాదా? నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం వాటా బీసీ, ఎస్సీ, ఎస్టీ లకే అప్పగిస్తామని చెప్పిన జగన్‌రెడ్డి 90శాతానికి పైగా పదవులు, పనులు సొంత వర్గానికి కేటాయించి తన పెత్తందారీ వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు.
వందలా ది మందిని సలహాదారులుగా నియమించుకుని బలహీనవర్గాల వారికి అందులో స్థానమే లేకుండా చేశాడు. పైగా సలహాదారులుగా బీసీలు పనికిరారం టూ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించడం పెత్తందారీతనం కాదా? బీసీ భవన్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం, బడ్జెట్లో కేటాయించిన నిధులు సైతం దారి మళ్లించడం, బీసీ రిజర్వేషన్లలో కోత విధించి 16,800 పదవులు దూరం చేయడం, విదేశీ విద్య, ఆదరణలాంటి బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేయడం వంటివి బీసీలపట్ల జగన్‌రెడ్డి చిన్న చూపునకు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు రాజప్రాసాదాల్లోకి, దర్బార్లలోకి బలహీన వర్గాలకు ప్రవేశం ఉండేది కాదు. ఇప్పుడూ అదే మాదిరిగా బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులకు తాడేపల్లి ప్యాలెస్‌లోకి అడుగు పెట్టనీయకుండా అవమానాలకు గురి చేశారు. నిన్న గాక మొన్న బీసీ ఎమ్మెల్యే రాయదుర్గానికి చెందిన కాపు రామచంద్రను అవమానించారు. తాడేపల్లి ప్యాలెస్ గేటు ముందే ఆయన శాపనార్ధాలు పెట్టి పార్టీకి రాజీనామా చేశాడంటే మానసికంగా ఎంతటి క్షోభకు గురి చేశారో అర్థం చేసుకోవచ్చు.