- ఉపకులాల ఆధారంగా నాయకత్వాన్ని తయారు చేస్తాం
- బీసీల వెన్నెముక విరిచిన జగన్‌రెడ్డి
- మంగళగిరిలో 53వేల మెజార్టీతో గెలుస్తా
- బీసీ జయహో సభలో నారా లోకేష్
అమరావతి, చైతన్యరథం: బీసీ అంటేనే ఒక భరోసా, బీసీ అంటేనే ఒక బాధ్యత, బీసీ అంటే ఒక భవిష్యత్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళవారం నాగార్జున యూనివర్శిటీ వద్ద జరిగిన బీసీ జయహో సభలో ఆయన మాట్లాడుతూ బీసీలు బలహీన వర్గాలు కాదు..బలమైన వర్గాలని చేసి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తర్వాత చంద్రబాబు పెద్దఎత్తున బీసీ సోదరులను ప్రోత్సహించారని, అందుకే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు బీసీ సోదరులకు ఉప కులాల వారీగా సాధికార సమితులు ఏర్పాటు చేసి, వాటికి కన్వీనర్ లను కూడా నియమించామని చెప్పారు. ఉప కులాల వారీగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో సాధికార సమితిలు ఏర్పాటుచేశామన్నారు.
ఉపకులాల వారీగా వచ్చే రోజుల్లో పెద్దఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో టీడీపీ ముందుకు వెళ్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ఇచ్చామని, బీసీల కోసం సబ్ ప్లాన్ ద్వారా రూ.36 వేల కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు. బీసీ కార్పొరేషన్ కు రూ.3వేల కోట్ల నిధులు కేటాయించి 4.20 లక్షల మంది బీసీ సోదరులను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామన్నారు. ఆదరణ పథకం కింద వెయ్యి కోట్లు కేటాయించి పనిముట్లు అందించామన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్‌మెంట్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి బీసీ విద్యార్థులకు విద్యను అందించామన్నారు. చేనేత సోదరులకు, మత్స్యకారులకు, కల్లుగీత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చామన్నారు. ఆనాడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీసీ సోదరుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని తీర్మానం చేశామన్నారు.
లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘‘ కానీ ఈ సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయన తర్వాత బీసీ సోదరులను వెన్నుపోటు పొడిచారు. బీసీలు వెన్నెముక అంటూనే బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టారు. స్థానికసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16వేల మంది బీసీలకు పదవులు దూరం చేశారు. 8వేల ఎకరాల బీసీ సోదరుల అసైన్డ్ భూములను వెనక్కు తీసుకున్న పార్టీ వైసీపీ. ఆదరణ పథకాన్ని రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కింద పది శాతం డబ్బులు కడితే కనీసం ఆ డబ్బులు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. బీసీ కార్పొరేషన్లలో నిధులు లేవు. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేశామని గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తులు.. కార్పొరేషన్ ఛైర్మన్లకు కనీసం కుర్చీలు కూడా ఏర్పాటుచేయలేదు. 75వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. మా మత్స్యకార సోదరులను మోసం చేసి జీవో 217 తీసుకువచ్చారు. ఆప్కాబ్ ను నిర్వీర్యం చేశారు. 300 మంది బీసీలను చంపేశారు. 26వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు. యనమల రామకృష్ణుడు ఒక పెళ్లికి వెళితే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడుపై ఏకంగా రేప్ కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు పై అనేక కేసులు పెట్టారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాజశేఖర్ ని నియమిస్తే.. ఆయనపైనా రెండు రోజుల క్రితం రౌడ్ షీట్ ఓపెన్ చేశారు.
మీరు పెట్టే ఎఫ్‌ఐఆర్ లు మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి.. రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో ఉన్న ప్రతి వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైకాపాలో బీసీలకు న్యాయం జరగట్లేదని చెప్పారు. పద్మశాలి వర్గానికి చెందిన ఆ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ వైకాపాలో బీసీల గొంతు నొక్కేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే పార్థసారథికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే బీసీలంటే ఎంత చిన్నచూపో మనం ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులను ప్రోత్సహించాం.
ఆనాడు ఆర్థిక మంత్రిగా యనమల, కేంద్రంలో ఎర్రన్నాయుడు రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. అనేక మంది బీసీ నాయకులను మంత్రులను చేశాం. టీటీడీ ఛైర్మన్, తుడా ఛైర్మన్ గా బీసీలను ప్రోత్సహించాం. ఈరోజు ఆ పదవుల్లో ఎవరు కూర్చొన్నారో మనం ఒక్కసారి చూడాలి. బీసిలకు జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం ఎలాంటిదో వారిపై జరిగిన వరుసదాడులను బట్టి తెలుసుకోవచ్చు. పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. ఆదరణ పథకం కింద రజక సోదరులకు వాషింగ్ మెషిన్లు ఇస్తే నేడు పక్కన పెట్టారు. కరెంట్ ఛార్జీల వల్ల వాటిని వినియోగించుకోలేని పరి…