- చెత్తపై పన్నేసిన చెత్త ప్రభుత్వమిది
- అమరావతిలో 2లక్షలకోట్ల సంపద తగలెట్టేశాడు
- రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం జగన్ రెడ్డి
- టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నక్యాంటీన్లు
- జగ్గయ్యపేటలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందు కు సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధి నేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి జగ్గ య్యపేటలో నిర్వహించిన రోడ్‌షో అధినేత మాట్లాడుతూ వీరోచితంగా పోరాడుదాం. రాష్ట్రాన్ని కాపాడు కుందామని కేడర్‌కు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలకు ప్రత్యేకకార్యక్రమాలు ఏర్పా టు చేస్తాం. బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి. బిసిలలో ఉన్న 140కులాలను పైకి తీసుకు వచ్చే బాధ్యత తనదని చంద్రబాబునాయుడు అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ సిలకు సం బంధించి నాడు ఉన్న 28పథకాలు రద్దు చేశారు. ఇం తటి తీరని ద్రోహం చేసిన జగన్ రేపు ఎన్నికల్లో జగన్ 5 వేలు పదివేలు ఇస్తాను అంటాడు. ఓటు వేస్తారా అనిప్రశ్నించారు.
అన్నింటా బాదుడే బాదుడు
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడు పరంపర కొనసాగు తోంది. కరెంట్ బిల్లల నుంచి ఇంటి పన్నుల వరకు అన్నీ పెంచారు. చెత్తపైనా పన్ను వేస్తున్న చెత్త ప్రభు త్వం ఇది. ఇసుక దోపిడీతో స్థానిక ఎమ్మెల్యే అక్రమా ర్జన చేస్తున్నాడు. ఆడబిడ్డల మంగళసూత్రాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన జగన్‌కు సిఎంగా ఉండే హక్కు ఉందా? కాలేజ్ ఫీజులు నేరుగా కాలేజ్‌లకు కట్టక పోవడం వెనుక కూడా జగన్ అక్రమార్జన వ్యూహం ఉంది. అన్న క్యాంటీన్ ఏం పాపం చేసిందని రద్దు చేశాడు. మళ్లీ టిడిపి ప్రభుత్వం రాగానే అన్నా క్యాం టీన్ పెడతాం. నాడు 200 పెన్షన్ టిడిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి 2000 అయ్యింది. టిడిపి వచ్చి ఉంటే 3000 అయ్యేది. జగన్ కు 175 రావడం కాదు. ఎన్నికల అనంతరం జగన్ జైలకు వెళ్లడం ఖాయం. వైసిపి బంగాళాఖాతంలో కలిసి పోతుంది.
పేదలు కడుపునిండా తినే పరిస్థితి లేదు
రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పాలనతో పేదలు తిండి తినే పరిస్థితి లేదు. రైతులు తీవ్రంగా నష్టపోయారు… మిరపపంటకు 3500 ఎకరాలు ఇక్కడ దెబ్బతింటే… కనీసం పరిహారం ఇవ్వలేదు. ధాన్యం డబ్బులు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏంటి? ఈ ప్రభుత్వం ఒక్క రైతు కు ఒక్క సబ్సిడీ ఇవ్వలేదు. మన హయాంలో ట్రాక్టర్లు, డ్రిప్ పరికరాలు ఇచ్చాం. వ్యవస్థలు కుప్ప కూలడం వల్లనే రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలు పెరిగాయి. పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని సిఎం మూడు రాజధానులు కడతారా?రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన సిఎం జగన్‌రెడ్డి. నాడు నేను కట్టిన హైటెక్ సిటీ తరువాత వచ్చిన వైఎస్‌ఆర్ కూలగొట్టి ఉంటే ఈ రోజు ఇంత నగరం అయ్యేదా? అమరావతిని కూడా ఆ స్థాయి నగరం చెయ్యాలి అనుకున్నా. అంతా అమ రావతిలో ఉద్యోగాలు చేసుకోవాలి అని కలలుగన్నా ను. జగన్ రెడ్డి అమరావతిలో 2 లక్షల కోట్ల సంపద తగలబెట్టాడు. 70 శాతం పూర్తి అయిన పోలవరం పూర్తి అయ్యి ఉంటే మంచి ప్రయోజనాలు ఉండేవి. పోలవరాన్ని ఈ సిఎం గోదావరిలో ముంచేశాడు.
జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో మాటమాటలు చెప్పాడు. యువ తకు ఉద్యోగాలు ఇచ్చాడా… జాబ్ క్యాలెండర్ ఉం దా… ఇచ్చింది వాలంటరీ ఉద్యోగం. ఈ ముఖ్య మంత్రి హయాంలో యువతకు ఉద్యోగాలు రావు. మళ్లీ ఉద్యోగాలు రావాలి అంటే టిడిపి అధికారంలోకి రావాలి. మళ్లీ వైసిపి వస్తే పిల్లల భవిష్యత్ అంధ కారమే. జగన్ నాడు నేడు అన్నాడు. 6 వేల స్కూళ్లు మూసేశాడు. ఇంగ్లీషు మీడియం అని చెప్పి చివరికి స్కూళ్లు మూసేశాడు. నా హాయంలో తెచ్చిన ప్రతిష్టా త్మక యూనివర్సిటీలకు ఈసిఎం కనీసం రోడ్డు వెయ్య లేదు. అభివృద్ది లేకపోతే సంపద సృష్టి ఎలా జరుగు తుంది. పేదలకు ఎలా మేలు జరుగుతుంది? దీనికి జవాబు చెప్పుజగన్ అని అడుగుతున్నా? రాష్ట్రంలో సమృద్దిగా వనరులు ఉన్నా…అల్లుడి నోట్లో శని ఉంది. ఆ శని జగన్ రెడ్డే?రాష్ట్రంలో వైసిపి మంత్రు లు, ఎమ్మెల్యేలు ఇసుక వ్యాపారం చేస్తారు. ప్రశ్నిస్తే బూతులు తిడతారు.
బిసినేత అయ్యన్నపై తప్పుడు కేసులు
వందల ఎకరాలు భూమలు దానం చేసిన అయ్యన్న కుటుంబంపై రెండు సెంట్ల భూమిలో అనుమతి తీసుకోలేదని కేసుపెట్టారు. బిసి నేత అయ్యన్న పై కక్ష తీసుకోవాలని తప్పుడు కేసు పెట్టారు. తప్పు చేసిన సిఐడి అధికారులను వదిలేది లేదు.అందరినీ బోను ఎక్కిస్తాను. ఇక్కడ ఉన్న పోలీసులు చెప్పాలి…మీకు జీతాలు వస్తున్నాయా…. బకాయిలు వస్తున్నాయా?జగన్ బటన్ నొక్కుతా అంటున్నాడు కదా…పోలీసుల బకాయిల బటన్ ఎందుకు నొక్కడం లేదు. రాష్ట్రంలో ఉద్యోగస్తులు కూడా భయపడుతున్నారు. పవన్ కళ్యాన్ బాధతో చెప్పు తీసుకుని చూపించాలి. బాధ కలిగి పవన్ అలా చేశాడు. మరి ఏం చెయ్యాలి వీరిని. కుప్పం వెళితే నా మీటింగ్ కు అడ్డంకులు సృష్టించారు. 70 మంది టిడిపి కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టారు. కార్యకర్తల కోసం మొదటి సారి జైలుకు వెళ్లాను. ప్రజా స్వామ్యం కోసం నా కుప్పం తమ్ముళ్లు జైలుకు వెళ్లారు. మనపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులపైనా ప్రైవేటు కేసులు పెడదాం. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ వస్తుందా… ఆరోగ్యశాఖ పడకేసిందా లేదా? కాకినాడ లో ఆరుద్ర అనే మహిళ ఆరోగ్య శ్రీ ద్వారా కూతురు వైద్యం చేయించుకోలేకపోయింది. సిఎంను కలిసే అవకాశం లేక… చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డిరది. నన్ను అనేక సందర్భాల్లో అడ్డుకునే ప్రయత్నం చేశారు. నా ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. సోషల్ మీడియాకు…సిఐడికి ఏంటి సంబంధం.. వాళ్లు కేసు లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.