- శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు
- వివేకా కేసులో మాదిరిగానే ఈడి అధికారులపై ట్రైడెంట్ సిఇఓ ఎదురుకేసు
- చందన్ ఫిర్యాదుతో అసలు దొంగలను తేల్చేపనిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్
- ప్రధాని పర్యటన పేరుతో ఎ2వేసిన కుప్పిగంతులన్నీ వృధా
- డిల్లీలిక్కర్ లో 30శాతం వ్యాపారం శరత్ చంద్రారెడ్డిదేనన్న ఈడి
- 100 కోట్లు ముడుపులు ఇచ్చారన్న కస్టడీ రిపోర్టుతో జె-గ్యాంగ్ ఉక్కిరి బిక్కిరి
- స్టాక్ మార్కెట్‌లో కుప్పకూలిన అరబిందో షేర్లు..11.5% నష్టాల్లో ట్రేడ్
న్యూడిల్లీ : డిల్లీలో లిక్కర్ స్కామ్‌లో పాపాల పుట్ట బద్దలవు తోంది. ప్రధాని మోడీని ఎలాగైనా ప్రసన్నం చేసుకొని ఎలాగైనా తమ బినామీని కేసునుంచి బయటపడేయా లని వారంరోజులుగా విశాఖపట్నంలో ఎ2 విజయ సాయిరెడ్డి వేసిన కుప్పిగంతులన్నీ వృధా అయ్యాయి. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అర బిందో ఫార్మా డైరక్టర్ పినాక శరత్ చంద్రారెడ్డి, విన య్‌బాబు(ఎ1, ఎ2ల బినామీలు)లను ఎన్ ఫోర్స్ మెం ట్ డైరక్టరేట్ గురువారం డిల్లీలో అరెస్టుచేసింది. లిక్క ర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఉన్న శరత్ చంద్రా రెడ్డి ఎ2 విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి స్వ యానా సోదరుడు. ‘‘ఢల్లీి మద్యం పాలసీకి అనుగుణం గా శరత్ చంద్రారెడ్డి పలుమార్లు ఈఎండిలు చెల్లిం చారు. ఢల్లీి లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డిని కీలక సూత్రధారిగా ఉన్నారు, ఢల్లీి లిక్కర్‌మార్కెట్‌లో 30 శాతం వ్యాపారాన్ని ఈయన తనగుప్పిట్లో పెట్టుకున్నా రు, బినామీ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధం గా 9 రిటైల్ జోన్స్‌ని శరత్‌రెడ్డి పొందారు. శరత్ చం ద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన బినామీ సంస్థ సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లు ముడుపులుగా చెల్లిం చారు’’ అని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ సిబిఐ కోర్టుకు సమర్పించిన కస్టడీ రిపోర్టులో సంచలనాత్మక వివరా లు వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిం చిన ఢల్లీి లిక్కర్‌స్కామ్ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయల్పడుతుండటంతో తాడేపల్లి ప్యాలెస్‌లో అలజడి మొదలైంది. అరబిందో డైరక్టర్ శరత్‌చంద్రారెడ్డి, విన య్‌బాబులను వారం రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సిబిఐ ప్రత్యేక కోర్టు… తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదావేసింది. డిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక ఎ1, ఎ2లు ఉన్నారని ఈ స్కామ్ బయ ల్పడినప్పటినుంచి తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా ప్రజల ముందుకు తెచ్చింది. లిక్కర్ స్కా మ్లోచ కీలకంగా వ్యవహరించిన శరత్‌చంద్రారెడ్డి, వినయ్బా పబు లను మూడు రోజులపాటు ఢల్లీి లో రహస్యంగా ప్రశ్నించిన ఈడి పలు కీలక ఆధారాలు సేకరిం చింది. శరత్‌చంద్రారెడ్డి, వినయ్‌బాబుల కస్టడీ కోసం ఈడి వేసిన కస్టడీ పిటిషన్‌లో పలు విభ్రాంతికరమైన విషయాలు వెలుగులోకివచ్చాయి.డిల్లీలో శరత్‌చంద్రా రెడ్డి, వినయ్బాబుిలకు కోట్ల రూపాయల మద్యం వ్యా పారం ఉందని, అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉన్న శరత్‌చంద్రారెడ్డి ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నారని గుర్తించింది. సెప్టెం బర్ 21,22,23తేదీల్లో ఢల్లీిలో శరత్ చంద్రారెడ్డిని ఈడి ప్రశ్నించింది.ఎ2 విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన పెనాక శరత్‌చంద్రారెడ్డి అరబిందో గ్రూపుతోపాటు మరో 12కంపెనీలకు డైరెక్టర్ట్ ఉ న్నారు.డిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ఆధారాలు లభించిన ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్ కంపెనీ డైరెక్టర్‌గా కూడా శరత్‌చంద్రారెడ్డి ఉన్నారు.డిల్లీ మద్యం కుంభకో ణంలో ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్ పేరును గతంలో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. శరత్‌చంద్రారెడ్డికి చెందిన 3 బినామీ కంపెనీల ద్వారా సుమారు రూ.60కోట్లు ఇండోస్పిరిట్స్ కంపెనీకి తరలిం చారని కూడా ఈడి.. కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొంది.
శరత్‌చంద్రారెడ్డి అరెస్ట్‌తో అరబిందో ఫా ర్మా షేర్లు స్టాక్‌మార్కెట్‌లో కుప్పకూలాయి. గురువారం నాడు ట్రేడిరగ్ ముగిసే సమా యానికి అరబిందో షేర్లు 11.56% నష్టాల తో రూ.478.80ల వద్ద క్లోజ్ అయ్యాయి.
ఈడి అధికారులు వేధించారంటూ ట్రైడెంట్ మాజీ సిఈవో ఫిర్యాదు
వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ అధికారి రాంసింగ్‌పై ఎదురుకేసుపెట్టిన తరహాలోని లిక్కర్ కుంభకోణంలో పీకల్లోతున ఇరుక్కున జె-గ్యాంగ్ ఈడి అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టేం దుకు తెగబడిరది. ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసులో ఈడి అధికారులు తమను వేధించారంటూ ఈడీ డైరెక్టర్‌కు ట్రైడెంట్ కెంఫర్ మాజీ సీఈవో చందన్‌రెడ్డి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆత్మరక్షణ కోసం సిబిఐ, ఈడి అధికారులపై జె-గ్యాంగ్ ఎదురు కేసులు పెట్టడం ఆయాసంస్థల అధి కారులను విస్మయానికి గురిచేస్తోంది. ట్రైడెంట్ సిఇఓ చందన ఈడి డైరక్టర్‌కు రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది. ‘‘సెప్టెంబర్ 16న తనఇంట్లో ఈడీ అధికారులు సో దాలు చేశారు. ఈడీ ఆఫీస్‌కు తీసుకెళ్లి నన్ను గాయపరి చారు, లిక్కర్ సిండికేట్‌తో శరత్‌చంద్రారెడ్డికి సంబంధాలు న్నాయని చెప్పమని వత్తిడితెచ్చారు,నన్నువేధించిన ఈడీ అధి కారులపై చర్యలు తీసుకోవాలి’’ అని ట్రైడెంట్ కెంఫర్ మాజీ సిఇఓ చందన్‌రెడ్డి ఈడి డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చందన్ రాసినలేఖ చూసిన వెంటనే సిబిఐ, ఈడి అధికారులకు వివేకా నందరెడ్డి హత్యకేసులో జె-గ్యాంగ్ ఆడిన డ్రామా కళ్లముందు కన్పించింది. ఈతరహా ఫిర్యాదులు గతం లో ఎవరు చేశారు, చందన్ ఫిర్యాదు వెనుక ఎవరు ఉన్నా రన్న విషయం ఇప్పటికే సిబిఐ, ఈడి అధికారులకు తెలిసి పోయింది. ఈ కేసు లో పెద్దగా ఇన్వెస్టిగేషన్ అవసరం లేకుండానే చందన్ లేఖ ద్వారా ఈడి అధికారులకు జె-గ్యాంగు మంచి క్లూ ఇచ్చినట్లయింది. మొత్తమ్మీద మరో 24గంటల్లో ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్న సమయంలో డిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డి అరెస్టుకావడంతో ఆయనవెనకున్న ఎ1,ఎ2లకు వెన్నులో వణుకుపుడు తోంది. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదన్న ఆందో ళనలో తాడేపల్లి ప్యాలెస్‌లో వాతావరణం భయానకం గా మారినట్లు విశ్వసనీయవర్గాల భోగట్టా.