అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్ భారతి, ఏ2 విజయసాయిరెడ్డి పాత్రను టీడీపీ నేతలు బయటపెట్టామని అక్కసుతోనే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మూక వ్యక్తిగత దూషణలకు దిగుతోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. లిక్కర్ స్కామ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి గురించి ఆరోపణలు చేస్తున్నారు. హెరిటేజ్ సంస్థ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, లక్షలాది రైతులకు, నిరుపేదలకు ఉపాధితో పాటు తోడ్పాటు అందిస్తున్నారు. నిత్యం ప్రజాసేవలో ఉన్న వారిపై అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ నేతలు మాట్లాడటమంటే ఆకాశంపై ఉమ్మేయడమే. మాకు సంస్కారం ఉంది.. కాబట్టే వైఎస్ భారతి, షర్మిల గురించి దూషణలు చేయలేదు. వ్యక్తిగత దూషణలకు దిగకుండా లిక్కర్ స్కామ్ పై మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా మీకు ఉందా?
అదాన్ డిస్టలరీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనాక రోహిత్‌రెడ్డి బినామీ కంపెనీగా రుజువైంది వాస్తవం కాదా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏ5గా ఉన్న ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ జగతి పబ్లికేషన్స్‌లో కోట్లాది రూపా యలు పెట్టుబడులు పెట్టింది నిజం కాదా? జగతి పబ్లికేష న్స్ ద్వారానే అవినీతి సాక్షి పత్రిక నడుస్తోంది వాస్తవం కాదా? బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాశిచాయానుల, ముప్పిడి అవినాష్‌రెడ్డి పేరుతో అదాన్ డిస్టిలరీలను విజయసాయిరెడ్డి నడుపుతున్నాడు. ఏపీలో రెండేళ్ల క్రితమే బినామీల పేరుతో అదాన్ డిస్టిలరీస్‌ను స్థాపించిన విజ యసాయిరెడ్డి వాటి ద్వారా వచ్చిన రూ.2వేల కోట్లను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈఎండీ లుగా కట్టారు. దీనికి జగన్ రెడ్డికి, వైఎస్ భారతీకి సంబంధాలున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జగతి పబ్లికేషన్స్‌లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. జగన్ అక్రమా స్తుల కేసులో సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కంపె నీల్లో ట్రైడెంట్ కంపెనీ ఒకటి. ట్రైడెంట్ కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ అధినేత వైఎస్ భారతి ఢిల్లీకుంభకోణంలో కీలకపాత్రదారులు, సూత్రదారులుగా ఉన్నారు. ఆధారాలన్నీ మా వద్ద ఉన్నాయి. త్వరలోనే ఢిల్లీ కుంభ కోణంపై సీబీఐ ఛార్జిషీట్లు వేయబోతోంది. దీనిలో జగన్ కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు నిందితు లుగా తేలడం ఖాయం. తాడేపల్లి పునాదులు కదలడం ఖాయమన్నారు.