అమరావతి(చైతన్యరథం): భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేయడం అభినందనీయమని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. స్వాతంత్య్రోద్యమ యోధుడు, త్యాగాల ముద్దబిడ్డ, అడవితల్లి లాలించి పెంచిన అల్లూరి అందరికీ ఆదర్శనీయుడన్నారు. దేశం కోసం ఆయన త్యాగం, ఆయన సాహసం అందరికి స్ఫూర్తిదాయకం. నేటి యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలి. విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టడం వలన దేశం కోసం అమరులైన త్యాగమూర్తులకు ఎనలేని కీర్తిని అందించినట్లే. అమర వీరులకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇది. దేశం కోసం, దేశ ప్రజలకోసం బ్రిటీష్వారి తూటాలకు గుండెలు ఎక్కుపెట్టి ఎదురొడ్డి నిలబడి అల్లూరి చిందించిన రక్తం, ధైర్య సాహసాలే నేటి మన స్వేచ్ఛావాయువులు. అటువంటి అల్లూరి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టటం ఆయన కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడమే అవుతుందని ఒక ప్రకటనలో మంతెన పేర్కొన్నారు.